బసవరాజు అప్పారావు గీతములు/మేలిముసుగు
వరప్రసాది
(శాఫోగీతము)
పుట్టుదు రింతలు భూమిపై లెక్క
కందని యుగ యుగాంతరౌలదాక
ఎంత గాలించినా యీ పృధ్వి యెల్ల,
నిను బోలు కన్నియ గనరాదు నిజము
చాలంగ బ్రేమించి సంతోష మొంది
నెఱ పన నెట్టిదో యెఱుగని మేటి
సమబుద్ధి యనెడు నుత్తమదాన మొసగి
నెలత ! దేవతలు మన్నించిరి నిన్ను.
---------------
మేలిముసుగు
(జేబున్నీసా)
మేలిముసుంగు నే మీదికి దీయ
నే మేమి జరుగునో యె ట్లెఱుంగుదుము ?
పికిలిపిట్టయు గులాబీపూవు మరచు
భక్తితో లక్షిలావణ్యమ్ము గొలుచు
బ్రాహ్మణుం డా దేవి వదలి నా మోము
జూచి నాచెలువున జొక్కెడునేమొ ?
కన్నుల కేరికి గానరాకుండ
పొదరింటిలో బలె పుష్పగర్భమున
దాగియుండెడు సుగంధంబును బోలి
మద్రచితమ్ములౌ పద్యాల నడ్గి
యున్న నామోము గాంతురుగాక జనులు
మేలిముసుంగు నే నేల దీయవలె ?
----------------
నిరాశ
(జేబున్నీసా)
అల పాలసమ్ములౌ హస్తమ్ములార !
ప్రాణేశు కౌగిలి బడయరైతిరిగ !
శుష్కించి యీరీతి జొక్కుటకన్న
విరిగిఓవుటయే మే లరసిచూడంగ.
దండుగమారి నేత్రములార! మీరు
కాంతుని న్నేండ్లుగ గానరైతిరిగ !