Jump to content

బసవరాజు అప్పారావు గీతములు/వరప్రసాది

వికీసోర్స్ నుండి

         వరప్రసాది
      (శాఫోగీతము)

పుట్టుదు రింతలు భూమిపై లెక్క
కందని యుగ యుగాంతరౌలదాక
ఎంత గాలించినా యీ పృధ్వి యెల్ల,
నిను బోలు కన్నియ గనరాదు నిజము
చాలంగ బ్రేమించి సంతోష మొంది
నెఱ పన నెట్టిదో యెఱుగని మేటి
సమబుద్ధి యనెడు నుత్తమదాన మొసగి
నెలత ! దేవతలు మన్నించిరి నిన్ను.
             ---------------

               మేలిముసుగు
               (జేబున్నీసా)
మేలిముసుంగు నే మీదికి దీయ
నే మేమి జరుగునో యె ట్లెఱుంగుదుము ?
పికిలిపిట్టయు గులాబీపూవు మరచు
భక్తితో లక్షిలావణ్యమ్ము గొలుచు