బసవరాజు అప్పారావు గీతములు/ప్రియ నిరీక్షణము
వెన్నెల గొఱ్ఱెలమందల గూర్చీ,
బిడ్డలతల్లుల రొమ్మున జేర్చీ,
లోకమున నెల్ల మృదువుం బ్రియమౌ
నాకన్నెయెదకు నన్నుం దార్చు.
-----
ప్రియ నిరీక్షణము
(శాఫోగీతము)
గున్నమావి కొమ్మలందు గువ్వలు
గుసగుసలాడుచు నుండెన్
వాడినయాకులు నిదుర జరించెడి
వాడల నాడుచునుండెన్
ఇవ్వని మాడ్చెడు మధ్యాహ్న మెల్ల
నిట్లె కాచుకొనియుంటిన్
సంజను గబగబ వచ్చు నీ యడుగు
చప్పుడు వినబడనా యంచున్.
ప్రియనిరీక్షణము
(శాఫోగీతము)
వాడిన గులాబియాకు లన్నియున్
పడిపోయెను సోననీటిలోనన్
కమ్మని పిల్లంగ్రోవులపాటలు
ఉమ్మరించు నిశ్శబ్దము జీల్చున్
కాని నేనిటులె వీనుల నొగ్గుచు
కాచియుండ నెంతో యాత్ర్రేముతో
అలదె వాకిలి మట్లపైన నీ
యడుగులచప్పుడు వినిపించెన్.
-----
ప్రియనిరీక్షణము
(శాఫోగీతము)
గడియక జామనక కాచి కూర్చుండి
నిశ్శబ్ధమగుద్వార మీక్షించుచుందు
నీడలు గోడపై మాడుచుంబోవు
వీధి నదుగులవడి వినవచ్చుచుండె
ఆశయు సంశయ మ్మలమి నాదైన
యాలోలహృదయమ్ము నాడించుచుండె
అందరో యిండ్లకై యేగుదెంచెదరు
కాని నీ వింక దూరానెఉంటివిగా.
-----
ప్రణయస్కృతి
(శాఫోగీతము)
- [1]మున్నొకతఱి నా హృదయతల్పమున
పన్నుంటిని నీలరజత జ్యోత్స్నలు
నీ సొమ్మేయగు నిర్మలప్రేమను
నిలపై ఠీవిని నడువంగన్
పోయ న్నేడో చంద్రుడు, చుక్కలు
బోయె, నిశీధము వోవుచున్నది,
వేళ దాటిపోయె, పాన్పుపై నే
వేస్ట నొంటిగ బడియుంటిన్.
- ↑ *మున్నొకతరి నా హృదయతల్పమున
బన్నుంటిని నీలరజత కౌముది
యిలపై పచారుసేయగ నీ సొ
మ్మే యగు నిర్మలప్రేమముతోన్