బసవరాజు అప్పారావు గీతములు/త్రోవే లేదా?
Appearance
త్రోవే లేదా?
రావాలంటే త్రోవేలేదా
దేవదేవుడౌ నా నాథునకు?
తారలు జూపెడు దారు లెరుగడే
భూరమణుండౌ నా ప్రాణేశుడు?
పూవుల జాడల బడి రాలేడే
భువన మోహనుడు నా రాజేంద్రుడు?
రాగిణి ప్రణయపు రవళిని వినడే
రాగలోలుడౌ నా లోకేశుడు?
ప్రేమద్వారము బెట్లు సడిల్చీ
నామనోహరుడు రాజాలడటే?
రావాలంటే త్రోవేలేదా
దేవదేవుడౌ నా నాథునకు?