Jump to content

బసవరాజు అప్పారావు గీతములు/క్రాస్ పరీక్ష

వికీసోర్స్ నుండి

        పాపఫలము నెత్తణచగ
        బతుకు తెరువు వేరులేక
        దాసుడనై దాంపత్యపు
        తళుకు లొలక చిట్టితొ స
య్యాటలాడు తుండగ నా ఆయువు ముగిసేనా ?
ఆయువుముగిసే అదునుకు ఆటలలో ఎగసేనా ?

        కత్తిపోట్లు తిని తిని కడు
        గాయమైన పేదగుండె
        బీతువోవ పరవశాన
        ప్రియమారగ నాచిట్టిని
కౌగిలించుకుండగ నాకాయము సురిగేనా ?
కాయము సురిగేవేళకు కౌగిలిలో కరిగేనా ?

క్రాస్ పరీక్ష

    వు కనుబొమ లిటె చిట్లించగానె
       తనువు కంపిల్లి గుండెలు తల్లడిల్లి
      "వాకుధోరణి" గల న్యాయవాది నయ్యు
       మొదటిమాటలోనే తెల్లమొగము వేతు

*[1]

మధురమధుయామినీపీఠ మధివసించి
        చల్లచూపుల జడ్జి మా చందురుండె
        నవ్వె తనపర్వు (పగ్గె) బుగ్గయినట్లు కొంటె
        రిక్కప్లీడర్లు నను జూచి పక్కుమనిరి.

నా జీవిత నాటకము

        ఈకపటనాటకాల నే నింక నాడ
        లేను, తెరదించుడీ, కొరగాని నాలి
        వేసముల వేసి, పొట్టకై మోసగించి
        పరుల యాచించి లాలించి బతకలేను.

        పుట్టినట్టి పౌరుషమైన పుటక మరిచి
        పరునికృతికి వేసముగట్టు పాప మేల ?
        నా విధురజీవితమ్మునే నాటకమ్ము
        జేసి ఆడించి జగతి రంజింపలేనొ ?

    • మధురమధుయామిని సీమ కధిపతియగు చల్లచూపుల రాజు మా చందురుండె నవ్వె తనపగ్గె బుగ్గయినట్లు కొంటె రిక్కకన్నెలు నను జూచి పక్కుమనిరి.