Jump to content

బసవరాజు అప్పారావు గీతములు/కోయిల2

వికీసోర్స్ నుండి

కోయిల


కోయిలా కోయిలా
    కూయబోకే!
    గుండెలూ బద్దలూ
    చేయబోకే! కోయిలా ||

తీయనీ రాగాలు
తీయబోకే!
తీపితో నామనసు
కోయబోకే! కోయిలా ||

    చిట్టినీ జ్ఞాపకం
    చేయబోకే!
    చింతతో ప్రాణాలు
    తీయబోకే! కోయిలా ||