Jump to content

బసవరాజు అప్పారావు గీతములు/కామాసుర

వికీసోర్స్ నుండి

చెవ్వికింపగు నాదముతో నెలయేఱులు శ్రుతి వేయగ
చివురుటాకుబోలు వ్రేళ్ళ చెలియ ! నీవు వీణె మీట,
నొక్కి జంతుజాలము విన, సొదల సన్ని పాఱదోలి
చేత నున్న విమలభావగీరపు పొత్తమ్మువిప్పి
శ్రవణసేయ ప్రణయగీరి చవులూరగ నేను బాడ
కానన మే స్వర్గసీమకన్న సౌఖ్య మౌగదె! యీ
లోకముఇతో మన కేటికి, లోలాక్షీ! రా పోదము.
                           --------
                  కామాసుర

"జలజల మని పాఱెడు నీ
సెలయేటిదరిం గూర్చుని
విలపించెద వేల నిటుల
     చెలియ! చెప్పవే.
చిన్నవోయె ముద్దుమోము
కన్నులంట నీరు గరు
వన్నెతరిగి వాడె మేను
     కన్నె! యేలనే?

చెట్టు; చామ నల్లబాఱె
పిట్టలన్ని గూళ్ల కేగు
చుట్టు నెల్లయెడలను చీ
   కట్లు గ్రమ్మెడున్."
"మొన్న తోట గంటి మ్నొక్క
వన్నెకాని కామరూపు
కన్నుమణగుకాంతి, వాలు
     గన్నులవానిన్.
తల కొక పూదండయు, చే
తులకు కంకణములు దెచ్చి
వలపు కలిగనటుల మెల్ల
       కిలకిల కులికెన్.
ఎక్కించెను తేజీపై
నొక్కటైన గాంచ నతడు
పక్క కొఱిగి, యీల వేసి
    చక్కగ బాడన్.
మలగుపండ్లు గుడ్వ నిచ్చి
పలవదేనె మంచుపాలు,
తెలిఅనట్టి బాస జెప్పె
           'వలతు ని ' న్నవి

సెకయేటికి దెచ్చి నన్ను
వలాల బెగ్గిలి కలగుచు
వలపున నాకన్నుల ము
   ముద్దుల నాల్గు గొనన్.
మెల్లమల్లన్ జో కొట్టన్
కలగంటివి - హా! ఘోరము!
విలయపుకల గంటిని యీ
    సెలయేటిదరిన్.
వెల్లబోవు రాకొమదులు
తెల్లవోయి చచ్చినట్టు
లెల్ల రనిరి 'కామాసుర '
    పిల్లను బట్టెన్*
వెలవెల బోవుచు కీడున్
దెలిపె వరి పదవు లెల్ల
మలకువయ్యె, పడియుంటిని
          సెలయేటిదరిన్.
జలజల మని పారేడు నీ
సెలయేటిదరిన్ గూర్చుని
విలపింపగ కారణముం
      దెలియ మియ్యదే