బసవరాజు అప్పారావు గీతములు/ప్రేమరాజ్యము
సకియ లిచటి కొచ్చినంత
నొకరిమొగము లొకదు చూచి
కులుకుచు చిరునవ్వు నవ్వు
కొందు రేలనో ?
చెకచెకమని నడచెడు నా చెలుల నడకలోన నవ్వు
చెట్లచాటున నున్న పురుషుచిత్తమును కలంచుగాదె
నీళ్ళకోస మప్ప చె
ల్లెళ్లు పోదు రీ దారినె
------
ప్రేమ రాజ్యము
(Adaption.)
లోకముతో మన కేటికి లోలాక్షీ! రా, పోదము !
జీవితంపు సంతసమ్ము జెరిప్ నంత గూర్చుపాదు
లోకముతో మనకేటికి, లోలాక్షీ, రా, పోదము.
సరసమౌ వసంతభాగ్యగరిమ మిగుల సుల్లసిల్లు
నడవులందు పండుఫలము గుడిచి మనము తనివిదీర
విచ్చినమందారపూల యచ్చమైన తేనె గ్రోలి
మచ్చమైకమొంది మేను మరిచిపోయి తమకమ్మున
చెవ్వికింపగు నాదముతో నెలయేఱులు శ్రుతి వేయగ
చివురుటాకుబోలు వ్రేళ్ళ చెలియ ! నీవు వీణె మీట,
నొక్కి జంతుజాలము విన, సొదల సన్ని పాఱదోలి
చేత నున్న విమలభావగీరపు పొత్తమ్మువిప్పి
శ్రవణసేయ ప్రణయగీరి చవులూరగ నేను బాడ
కానన మే స్వర్గసీమకన్న సౌఖ్య మౌగదె! యీ
లోకముఇతో మన కేటికి, లోలాక్షీ! రా పోదము.
--------
కామాసుర
"జలజల మని పాఱెడు నీ
సెలయేటిదరిం గూర్చుని
విలపించెద వేల నిటుల
చెలియ! చెప్పవే.
చిన్నవోయె ముద్దుమోము
కన్నులంట నీరు గరు
వన్నెతరిగి వాడె మేను
కన్నె! యేలనే?