Jump to content

ఫ్రెంచి స్వాతంత్ర్యవిజయము/పదుమూడవ అధ్యాయము

వికీసోర్స్ నుండి

ప్రెంచిస్వాతంత్ర్యవిజయము

పదుమూడవ అధ్యాయము

జాతీయసభ

1

ప్యారిసు ప్రజలు
రాజును కాపు
దలలో నుంచుట.

ఇటుల వర్శేల్సులో జాతీయ ప్రభుత్వము, నిర్మించబడు చుండగా, ప్యారిసు పట్టణములో రాజు పారిపోవ యత్నించు చున్నా డను వాడుకలు -బయలు దేరెను. ప్యారిసు ప్రజలు వచ్సేల్సుకుపోయి, రాజకుటుంబమును ప్యారిసుకు తెచ్చి, భద్రపరుపవలెనసు యోచను లు సేయసాగిరి.. ఆ సంవత్సరము ఆహార పదార్థ ములు ధరము విపరీతముగా పెరిగెను. ప్యారిసు మ్యునిసిపాలిటీవారు సష్టముసుభరించి,రొట్టెలను ప్రజలకు చౌ కగా అమ్మించు చుండిరి గాని, రొట్టెలు తగినన్ని దొరకక , బీద వారు బాధపడుచుండిరి. రాజు ఫ్యారిసులో నుండినచో నీ రొట్టె

లకరువు పోవునని ప్రజలులు తలంచసాగిరి. ప్రభువుల యొక్క
182

ఫ్రెంచి స్వాతంత్ర్య విజయము

మతగురువుల యొక్కయు కుట్రలవలన తమకు బాధలు కలుగు చున్నవని ప్రజలెంచిరి.. ప్యారీసులోని వాడుక లన్నియు పర్సే ట్సులోని రాజునకు "తెలి యుచుండెను. కొన్ని విదేశీయ సైన్య ములను రాజు తెచ్చి పెట్టుకొనెను. దేశమునుండి పారిపోవలసి' నదని కొందరు రాజునకు సలహా చెప్పిరి. 'దేశములో రాజు యొక్క అధికార మంతరించినది. విదేశమునకు పారిపోయినచో రాణియొక్క - సోదరుడగు ఆస్ట్రియాచక్రవర్తి యు. నిదివఱకే దేశమును వదలి పోయిన - రాజ బందువులును ఇతర ప్రభువులును ఇంకను రాజు పక్షము నున్న సైన్యములను రాజునకు సహా యము చేయగలరు. వారి సహాయముతో దేశముమీదికి దండెత్తి వచ్చి జాతీయసభను నాశనము కావించి, తన యొక్క, -- నిరంకుత్వము స్థాపించుకొన వచ్చునని, రాజునకు సలహాయొ సంగబడెసు. ఇందుకు రాజు సమ్మతించెను. కాని రాజు అనుమా నించుచుండెను . నూతన సైనికులు వేసేల్సుకు వచ్చిన దినమున సైనికోద్యోగు లొక విందొనర్చిరి. రాజు హాజరయ్యెను. రాణి యువరాజు నెత్తుకొని యుపన్యాస మిచ్చెను. సైనికోద్యోగులు రాజుయొక్క గౌరవమును నిలువబెట్టదమని శపదములు చేసిరి జాతీయసభను తూలనాడిరి. మూడురంగుల జాతీయ జెండాను తీసి వేసి ప్రాత తెల్ల రాజపతాక ముల నెత్తిరి. ఈ సంగ తులన్నియు మరునాడు ప్యారిసులో ప్రజలు తీవ్రముగా చెప్పు కొనసాగిరి. -జాతీయ జెండాను కాళ్ళకింద వేసితొక్కిరను వర్తమానముకూడ వచ్చెను. ప్రజలలో నుద్రేకము హెచ్చ

ను. జూతీయభటులు కసితీర్చుకుని నువ్విళ్ళూరు చుండిరి. ఆక్టో

183

పదుమూడవ అధ్యాయము

, బరు 5 వ తేదీ ఉదయమున ప్యారిసునుండి అనేక వేలమంది స్త్రీలు నందరను పిలుచుకొని, :పదునొకండు మైళ్ల దూరముననున్న వర్సేల్సునకు బయలు దేరిరి.. పురుషుల గుంపులు వెనుక బయలు దేరెను. ఆ వెనుక లఫయత్ సేనాని క్రింద. జాతీయ భటులు బయలు దేరి వెళ్లిరి. ముందు వెళ్లిన స్త్రీ పురుషులు రాజమందిరమున చుట్టుకొని, జాతీయ సభామందిరములో ప్రవే శించి, రొట్టె, రొట్టె యని కేకలు వేసిరి. దినమంతయు కొత్త గుంపులు వచ్చి చేరుచుండెను. రాజు సైనికులకును. ప్రజాసమూ' హములకును కలహములు ప్రారంభమయ్యెను. ఇంతలో ఇరు వది వేలమంది జాతీయ భటులతో లయతు వచ్చెను. రాజసైని కులు వెళ్లిపోయిరి. శాంతము నెలకొల్పబడెను. మరునాడుప్రొ ద్దున ప్రజల గుంపులు రాజమందిరములో ప్రవేశంచి రాణి యెక్క. గదులను ముట్టడించిరి. రాణి భయపడి రాజు మొక్క ముందిరము లోనికి పరుగెత్తెను. లూయీ రాజు ప్రజలకు లొంగు టకు నిశ్చయించెను. రాజు మిద్దె మీదికి వచ్చి క్రిందనున్న ప్రజలకు దర్శనమిచ్చెను. ప్రజలు " రాజు ప్యాిరిసుకు రావ లెను" అని కేకలు వేసిరి. రాజును, రాణియును సమ్మతింపక తప్పినది కాదు. రాజకుటుంబము బండిలో నెక్కించుకొని ముందును వెనుకకు సు ప్రజలగుంవులు బారులు తీర్చి ప్యారిసుకు వచ్చిరి.. జాతీయ సైనికులు బండిపక్కను నడిచిరి. అక్టోబరు 6వ తేదీన రాజకుటుంబమును ప్యారిసులోని ట్యూలెరీమందిరమునకు చేర్చిరి. వెంటనే జాతీయసభ వారుకూడ వర్సేల్సు వదలి ప్యారి

సులో సమావేశమయిరి. రెండు సంవత్సరముల కాలమువరకు
184

ఫ్రెంచి స్వాతంత్ర్య విజయము

ఫాన్సు దేశ ప్రభుత్వము (Crowned republic) రాజు పేరునకు గల 'సంపూర్ణ ప్రజాస్వామ్యముగా నుండెను. రాజును, ఆయన కుటుంబమును ట్యూలరీమందిరములో కావుదలలో నుంచబడిరి, రాజు పేర ప్రజాప్రతినిధులే దేశమును పాలించుచుండిరి. యరువాతకూడ లూయూ రాజు నామమాత్రావశిష్టుడగు రాజుగా నుండులతో తృప్తి పొంది యున్న యెడల తమరాజును శిరచ్ఛేద ముచేయు దురదృష్టము ఫ్రెంచిజాతికి పట్టెడిది కాదు. కాని దూరాలోచన లేని రాణియొక్క కుటట్రలుఫ్రెంచి చరిత్రను మార్చెను.

2

గొప్ప సంస్క
రణములు,

జూతీయ సభవారు ప్యారసులో సమావేశ మై మొదట శాంతిని నెలకొల్పిరి. ఒకానొక సమయమున సైనిక శాసన మునుపెట్టి ప్యారి సుప్రజల యల్లరుల సణపవలసి వచ్చెను.

వచ్చెను. తరువాత గొప్ప రాజకీయసంస్కరణ

ములను గావించిరి. (1) ఫ్రాంస్సు దేశమునంతను 83 రాష్ట్రములు (డిపార్టుమెంబులు) గా విభజించిక. వానికి పర్వతముల యొక్కయు, నదుల యొక్కయు 'పేర్లు పెట్టుబడెను. ప్రతి రాష్ట్రమును కొన్ని జిల్లాలుగను ప్రతి జిల్లాను కొన్ని కాంటనులుగను, ప్రతి కాంటసును కొన్ని మ్యుని సిపాలిటీలుగ సు విభాగించిరి. మొత్తము మూడు పందల డెబ్బది నాలుగు జిల్లా లేర్పడెను. ప్రతి రాష్ట్రమును, జిల్లాను ఒక జన రల్ కౌన్సిలును, ఓక డైరెక్ట రీయును (కార్యనిర్వాహక సభ )

పాలించును. (2) మ్యునిసిపాలిటీలో 25 సంవత్సరముల వయ

185

పదుమూడవ అధ్యాయము


స్సుగలిగి సాలు కొక రూపాయి పన్ను నిచ్చు. ప్రతివారికిని ఎన్ను కొను (వాటిచ్చు) అధికార మేర్పడెను. మ్యునిసిపల్ సభ్యుడగు వాడు ఆరుపాయల పన్నును,జాతీయశాసనసభలో సభ్యుడగు వాడు ముప్పది పాయలవన్నును చెల్లించువాడుగ నుండ వలెను. ఎన్ని కాధికారముగలవా రందను (వోటర్లందురును) జాతీయ సైన్యములో చేరితీరవలెను. (3) కార్యనిర్వాహక శాఖ (texecutive), విచారణ శాఖలు (judicial) వేరు చేయబడెను. న్యాయాధిపతులు పదిసంవత్సరముల కొక సారి ఎన్నుకొనబడ వలెను. జ్యూరి విచారణ హక్కు క్రిమినల్ కేసు లన్నిటిలో నేర్పాటు చేయబడెను. శాసనము అందరును సమానముగ వర్తించునట్లును, ఏమనుజునిగాని సరియైన విచారణ లేకుండ ఖైదులో నుంచకుండునట్లును చేయబడెను. (4) పీనల్ కోడ్డు (శిక్షాస్మృతి) లో ముఖ్యమైన మార్పులు చేయబడెను. ప్రతి మనుజుడు తసయిష్ట మయిన మతము నసలంబించ వచ్చును. మతవిశ్వాసముల కెట్టిశిక్షయు నుండదు. మరణశిక్ష చాల నేరములకు తీసివేయబడెను. ఏనేరమునకుగాని నేరస్థునియావ దాస్తిని ప్రభుత్వము వారు తీసికొనగూడడు. నేరస్థునికే శిక్ష విధించవలెను గాని, అతని కుటుంబము బాధపడగూడదు. వాక్స్వోతంత్యము పత్రికా స్వాతంత్యమును నిర్బంధించు చట్ట ములన్నియు రద్దుపరచబడెను. (5) అన్ని మతముల వారుసు, అన్ని యుద్యోగములకును అర్హులుగ చేయబడిరి. వెనుకటి ప్రభు త్వము వారు ప్రొటెస్టెంటు మతస్థులనుండి బలవంతముగ తీసి

కొనిస ఆస్తి తిరిగి యిచ్చి వేయబడెను. యూదులుకూడ సమస్త
186

ఫ్రెంచిస్వాతంత్ర్య విజయము

పౌరహక్కులకును, నుద్యోగములకును అర్హులు. (6) దేశ ములో వర్తక స్వేచ్ఛ, పరిశ్రమల స్వేచ్ఛ నెలకొలుపబడెను. రహదారి సుంకములు, టోల గేట్లు తీసివేయబను. విదేశ వర్తక విలులో కొన్ని సరుకులమీద సుంకములు వేయబడెను. 7) ఫ్రాన్సు దేశములోని మతాచార్యుల ప్రతిష్టాపనలకును, మఠములకును పదికోట్ల సవరనుల ఆస్తి యుండెను. సాలుకు ముప్పదియైదులక్షల సవరనుల ఆదాయము వచ్చుచుండెను. ఈ ఆ స్తియంతయు జాతీయప్రఖత్వమువారు వశపరచుకొని, మతాచార్యుల కందరుకును జీతముల నేర్పరచిరి. మఠములను స్వాధీనపడచుకొని, వానిలోని సన్యాసులగు స్త్రీలకును, ఫురు షులకును, ఉపకార వేతనములనిచ్చి పంపి వేసిరి. {8} ప్రభుత్వ "బొక్క-సములో ధనము లేనందున, ప్రతివారును. తన ఆ స్తిలో నాలుగవ వంతు తెచ్చి యియ్యవలెనని జాతీయ నాయకుడగు మిరాబో కోరగ, మిక్కిలి యుత్సాహముతో ననేకు లాప్రకార ముగా తెచ్చియిచ్చిరి. ఇంతియె గాక రాజు యొక్క స్వంత భూములను, మతాచార్యులనుండి తీసికొన్న కొన్ని ఆస్తులను, దేశమును వదలి పోయినవారి సొత్తులను, కొంతవరకు జాతీయ ప్రభుత్వము వారు విక్రయించి షుమారు రెండుకోట్ల సవరను లను సంపాదించిరి. తత్కాలికముగా కొంతపరకు కాగితపు దవ్యమును (కరెన్సీనోట్లను) కూడ నిర్మించి సొమ్మును స్వీక రించిరి. న్యాయముగ ఆదాయమును బట్టి పన్నులు వేయబడెను . బాధకరముగ నున్న అన్ని పన్నులును తీసి వేయబడెను. దేశమంత

టను ఒకేవిదమగు కొలతలుసు తూనికలుసు వాడుకలోనికి తేబ

187

పదమూడవ అధ్యాయము

డెను. ప్రజలు మిక్కిలి సంతోషముతో గౌరవోద్యగములను స్వీకరించిరి. ప్రభుత్వముసకు మిగుల తోడ్పాటు గావించిరి. (9) జూన్ 26 తేదీన బిరుదములు, నైటుహుడ్డులు (సర్ బిరుద ము వంటివి), పతకములు, ఫిరంగులు కాల్చుట, పతాకము లెత్తుట మొదలగు దంభ చిహ్నము లెల్లను తీసి వేయబడెను...

(3)

ఫ్రెంచి విప్లవము
యొక్క సంవత్స
రోత్సవము.

1790 వ సంవత్సరము జులై 14: తేదీన ఫ్రెంచి విప్ల వము యొక్క ప్రధమ సంవత్సరోత్సవమును, పరాసు ప్రజలు ప్యారీసులోని శాండిమార్ మైదానములో ఆ త్యుత్సాహములో జరిపిరి. ఫ్రాంన్సు దేశము యొక్క వివిధ భాగములనుండియు నొకలక్ష మంది ప్రతినిధులు సమావేశ మయిరి. లూయి అధ్యక్షత వహించెను. ప్రధాన సేనాని లఫహయతు జాతీయసభవారు నూతనముగా నేర్పరచిన రాజ్యాంగ విధానమునకు లోబడి నడుచుకొందునని ప్రమా ణముచే సేసెను. వచ్చిన లక్ష మంది ప్రతినిధులును, నాలుగు లక్షల ప్రజలును, అట్లే ప్రమాణములను గావించిరి.. తన సిం హాసనము నుండి లూయి రాజు, "ఫ్రెం చి రాజు నైన నేను, జాతీయ సభవారు గావించిన నూతన రాజ్యాంగ విధానమును, నాయా వ చ్ఛక్తితోను కాపాడెదను. దాసి ననుసరించి చేయబడు అన్ని చట్టములు సమలులో బెట్టెదను..” అని బిగ్గరగా శపధము చేసెను. రాణిగూడ అంగీకార సూచకముగ తన చేతిలోని

రాజకుమారుని ప్రజలకు చూపెను. ఈ సమయములో అది
188

ఫ్రెంచిస్వాతంత్యవిజయము


వర కావహించియున్న మేఘములు విడి పోయి, సూర్యుడు తన కిరణములను ప్రసరింప చేసిను. ప్రజల మసులు సంతోష షముతో నుప్పొంగెను. "దేవతల యాశీర్వచనము కలిగెనని ప్రజలు తలచిరి. 'మా రాజు దీర్ఘాయు పగుగాక! మాదేశము సౌఖ్యముగా నుండునుగాక యను జయజయ ధ్వానములు మిన్ను ముట్టెను. దేశాభిమానములోను రాజభక్తిలోను సోద రత్వములోను ప్రజలో లలాడిరి..నేలమట్టముగావింపబడిన బాస్టిలు కోట ప్రదేశములో, నాటి రాత్రి ప్రజలు సంతోషముతో నృత్యములు సలిపిరి.. కొన్ని రోజులవరకు బాణాసంచు కాల్చుట,ఆటలు మొదలగు వినోచదములు ప్యారీసులో జరిగెను.


ఇంతవరకును విప్లవము సరిగా నడచెను. రాజు యొక్క- యు ప్రభువుల యొక్కయు నిరంకుశత్వము నకు బదులు: ప్రజల రాజ్యము స్థాపింపబడెను, శతాబ్దములనుండి. ప్రజులను పీడించు చుండిన ప్రతిస్థాపనములు, ప్రత్యేక హక్కులు, మామూళ్ళు నిర్మూలనము గావింపబడి న్యాయము , నీతి, సమానహక్కు బాధ్యతలు,స్వేచ్ఛ నెలకొలుపబడెను. కాని ఇంత త్వరలో ఫ్రెంచిజాతి యొక్క కష్టము లీ డేర లేదు. నూతన రాజ్య తంత్ర మును నాశనము చేయుటకు, దేశ ము బయటను, దేశములోపు లను, సరంకుశత్వము, స్వార్థపరత్వము కుట్రలు సలుపుచున్నవి. యూరప్ లోని తక్కిన దేశములన్నియు నిరంకుశత్వమునకు లోబడియున్నవి. ఆ దేశ ముల ప్రజ లింకను మేల్కొస లేదు. ఆ దేశముల పాలకులు ఫ్రెంచి జాతిపొందిన స్వేచ్ఛను సహించ లేకుండిరి.తమక్రింది. ప్రజలు ఇట్టి స్వాతంత్యములనే కోరుచు

189

పదుమూడవ అధ్యాయము

క్లబ్బులు

రని వారికి భయము. ఆ పాలకు లెల్ల ఫ్రాంన్సుస్వాతంత్యము నకు వ్యతిరేకముగా కక్ష వహించిరి. అప్పుడప్పుడు ఫా'న్సు, ప్రజల యజ్ఞానము, ఫ్రెంచి యతివాదుల తీవ్రగమనము, కూడ ఫ్రెంచిజాతియొక్క కష్టములకు తోడ్పడెను. ఇన్ని యాపదలు గడచి ఫ్రాన్సు స్వాతంత్రోద్యా నవనమగుటకు చా ల సంవత్సరములు పెట్టెను. ఈలోపల ఎంతమంది యో సా స్వాతం త్య పీఠముల మీద ప్రాణము లర్పించవలసియుండిరి

(4)

ఫ్రాన్సులో విప్లవము జరుగుచున్న కొలదియు ప్రజలు లో నూతనాశయములు, నూతనాభిప్రాయములు వ్యాపింప జేయుటకును ప్రజాభిప్రాయము తమ వైపున బల పరచుకొనుటకును ,కొత్తసంఘములు (క్లబ్బులు) స్థాపింపబడెను. వీనియన్నింటిలో 'బర్టను క్లబ్బు అనునది మిగుల ప్రాముఖ్యత వహించెను. జాతీయ సభలో కూడ నెర్సేల్సునుండి ప్యారినుకు తీసికొనివచ్చి దానిని బిన్సు అను పాతమఠ పుగృహములో నేలకొల్పిరి. అంతట నుంచి దానికి ' జేకో బినుక్లబ్బు' అను సుప్రసిద్ధ నామ మేర్పడెను. క్రమముగా ప్రతి రాష్ట్రములోను దీనికి శాఖ లేర్పడెను. ఈ జెగొబిను క్లబ్బులు ప్రజాభిప్రాయమును అమ వైపునకు తిప్పు కొని, ప్యారిసులోను, రాష్ట్రములలోను అధి కారులు తమ తీర్మా నముల ప్రకారము నడచు కొనునట్లు నిర్బంధించుచు వచ్చిరి. కొంతకాల మీక్లబ్బులే నిజముగా దేశ ప్రభుత్వమును తమ

యభిప్రాయానుసారముగ తిప్పుచుండెను. ఈ జెకోబిను క్లబ్బు
190


ఫ్రెంచిస్వాతంత్ర్య విజయము

ప్రధమములో లామొత్తులు, గార్నేన్ మొదలగు మితవాద నాయకుల పలుకుబడిలో నుండెను, తరువాత రాబిస్పేయయరు మొదలగు సతివాదుల యాజమాన్యము కిందికి వచ్చెను. '89 క్లబ్బులలో, అబీ సైసు, లఫయతు ముఖ్యులు. కారిడిలీన్ అను క్లబ్బులు తీవ్రవాదులగు డాస్టన్ మొదలగు వారుస్థాపించు కొనిరి. రాజుపక్షముననున్న ప్రభువులు కూడ క్లబ్బులు స్థాపించిరిగాని, విశేష కాలము నిలువలేదు. మితవాదులకు వేరొకక్లలబ్బు కలదు., పత్రికలు ప్రధాన స్థానము నాక్ర మించు కొని యున్నవి. కొందరు తీవ్రవాదులు తమపత్రిక లలో జాతీయసభా చర్యులు తగిసంత తీవ్రముగ లేవని ఖండించు చుండిరి. ఆ కాలములో మిక్కిలి ప్రసిద్ధి కెక్కిన పత్రికాధిపతి బ్రిస్సో, ఈయన తీవ్ర వాది. గికాండిస్టు లను కక్షికి నాయకుడు. ఈయన రాజు లేని ప్రజాస్వామ్యము కావలెనని తమ పత్రిక లో వ్రాయు చుండెను, వాణిజ్య స్వేచ్ఛ, పత్రిస్వేచ్చ ప్రజలందరకును విద్య, మత స్వాతంత్యము, కాయక ష్టమునకు గౌరవము మొద లగుచిషయముల నీయని బలపరచుచుండెను. ప్రతివాడును తన జీవితములో నీతిమంతుడుగా నున్నగాని జాతి గొప్పది కానే రదనియు, నీతి, ధర్మము ప్రధానములనియు, నీయన బోధించు చుండెను. కమీల్ డిమొలి” అను నాయన తెన “లి రివల్యూ షన్ " పత్రికలో రాజును తీసివేయవలసిన దనియు, వోట్లు అం దరికి నుండవలెననియు శతాబ్దములనుండి హీనస్థితిలో సుడిన ప్రజలు మేల్కొనునప్పుడు కొంతవరకైనను అల్లరులు, రక్త

పాతము జరుగక తప్పదు గావున అల్లరుల సణచుటకు జాతీయ

190

పదుమూడప ఆధ్యాయము

సభవారు క ఠిన, శాసనములను చేయకూడదనియు నీయన వ్రా యుచుండెను. “ప్రజల స్నేహితు"డ ను పత్రిక యొక్క అధిపతి 'డాక్టరుమా రెటుగా రింకను రక్తపాతమై స్వాతంత్యమునకు వ్యతి రేక ముగనున్నవా రందరిని చంపువరకును దేశమునకు మోక్ష ముండదని వ్రాయుచుండెసు.

5

మతగురువులలో
రెండు కక్షలు

జూతీయసభ వారు బిషప్పుల (మతా చార్యుల) యొక్క యు సామాస్య మతగురువుల యొక్కయు సంఖ్యను తగ్గించి. రాష్ట్ర మున కొక బిషప్పుం డుట చాలుననిరి. ఈ మతాచార్యులను గురువులను శాసనసభ నెన్నుకొనెడి ఓటర్లే ఎన్ను కొనునట్లేర్పరిచిచి. వీరందరికిని జీతముల నేర్పఱచిరి. నూతన బిషపులును మతగురువులును కొత్త రాజ్యంగమునకు విధేయుల మగుదుమని శపథములు చేయవలెనని శాసిం చిరి, పరాసు దేశము ముఖ్యముగా రోమసు కాథలిక్కు దేశము. రోమను కాథలిక్కు మత పీఠాధిపతి రోములోని పోపు పరాసు దేశములోని మతగురువులను తాను నియమించవలెనే గాని ఫ్రెంచి ప్రజలెన్ను కొనగూడదనియు, మతగురువు లెవరు ను ప్రభుత్వమునకు లోబడుదుమని శపధములు తీసికొనగూడ దనియు నాజ్ఞాపించెను. అందుమీద కొందరు మతగురువులు

మాత్రమే శపథములు తీసికొనిరి. తక్కినవారు విప్లవమునకు
192

ఫ్రెంచి స్వాతంత్ర్య :విజయము

వ్యతి రేకులై మత మపాయకరమగు స్థితిలో సున్నదని రోమను కాథలిక్కు ప్రజలకు బోధించుచు, నూతన ప్రభుత్వముపై నాగ్రహమును పురికొల్పు చుండిరి. శపధములుగై కొనని వారు మతబోధలు చేయకూడదని యసభవారు "శాసించిరి. వారు రహస్యముగా బోధించు చుండిరి .. మతగురువులలో రెండు కక్ష లేర్పడెను.. ప్రభుత్వపక్ష మువారు, పోపు పక్షమువారు . కొన్ని చోట్ల వారికి, కొన్ని చోట్ల వీరికే పలుకుబడి గలిగియుండె ను. కలహములు తరుచుగా గలుగుచుండెను. పోపు పక్షవాదులు ప్రభువులలో చేరి స్వాతంత్యవిద్వేషు లై కుట్రలుసలుప వారం భించిరి. కొంతమంది ప్రభువులు మాత్రము ప్రజలపక్షము చేరి. కొంతమంది దేశ మువిడిచి వెళ్ళిరి. మరికొందరు ప్రభు వులు దేశములో నేయండి కుట్రలు చేయుచుండిరి. కష్టముల వలన జాతీయసభ లొంగిపోవునని వేచియుండిరి. కొన్ని చోటులు కుట్రదారులు తిరుగు బాటులు చేయించిరి. నాన్ సీలోని సైన్య ము లెక్కుపజీతములు కావలెనని తిరుగుబాటు చేసిరి. బౌలీ సే నాని తిరుగు బాటుల నన్నింటిని అణచివేసెను. సైనికుల జీతము లెళ్కువ చేసెను. 1790 సెప్టెంబరు నెలలో నెక్కరుమంత్రి తసకెట్టియధి కారము లేదని గృహించి, రాజీనామా నిచ్చెను. మొత్తముమీద ఫ్రాన్సు దేశములోని యధిక సంఖ్యాకులగు ప్రజలు, జాతీయసభ వారు చేయుచున్న సంస్కరణములకు సంతోషమును తృప్తిని కనబఱచి. నూతన రాజ్యాంగవిధాన

ముసు మనస్ఫూర్తిగా సంగీకరించిరి.

193

పదుమూడవ అధ్యాయము

6

మీరాబో పరలోకగతు
డయ్యెను.

ఇట్టి స్థితిలో మీరాబో పరలోకగతు డయ్యెను. ఈయన పుట్టుక వలన ప్రభువయ్యును ప్రజల పక్షమున చేరి విప్లవములో ఏప్రధానస్థానము నాక్రమించుకొనెను, చిన్నతనములో మిక్కిలి దుడుకువాడై తనభార్యను వదలి పరుల దారల వసహరించెను. ఈయసతండ్రి మిక్కిలి కఠినమయిన శిక్షలకు పాల్సేసి, యనేకమారులు కారాగృహములో పెట్టించెసు. కాని మిరాబో యద్భుత మేధావి. గొప్ప విద్వాంసుడు. మితి లేని సాహస ధైర్యములు గలవాడు. నిష్కళంకదేశాభిమాని. యిరువదిగంటల కాలము గ్రంథ పయ్హనము చేయు చుండెను. అసామాన్యవక్తయు లేఖరియు నై, ప్రజారంజ కుడుగ నుండెను. మిక్కిలి ధైర్యముతో రాజును, తోడి ప్రభువులను ఎదిరించి, జాతీయసభలో ప్రధాననాయకు డయ్యెను. స్టేట్సుజనరల్ కూడినప్పటినుండి మరణించు వరకును విప్లవమును మీరాబో నడిపెను. అటుమిత వాదులలోను, ఇటు తీవ్ర వాదులలోను చేరక జాగ్రత్తగ తీసికొనివచ్చెను. రాజును పూర్తిగ తీసి వేయుట ఈయన కిష్ట ము లేదు. అనేక సార్లు రాజుతోను, తోను ఆయన ముచ్చటించుచుండెను. రాణి ప్రథమములో మిరాబోయందు మిక్కిలి అయిష్టము గలిగియుండెను. క్రమముగా ఉభయు లును .స్నేహితు లైరి. జాతీయ రాజ్యాంగ విధానము నంగీక రించ

వలసినదనియు, లేనియెడల ప్రమాదము కలుగుననియు

194

ఫ్రెంచిస్వాతంత్ర్యవిజయం

నకు మిరాబో గట్టిగా సలహా నిచ్చెను. “దీనికి వెనుకకు బోవుట యునగా, నొకతరమువారు కష్టపడి చేసిన పనియంతయు నాశ ముచేయుటయు, రెండుకోట్ యేబది లక్షల ప్రజలు జ్ఞాపక ముంచుకొన్నాదంతయు తుడిచి వేయుటయు నగు”నని మిరాబో రాజు తో చెప్పెను. రాజును, రాణీయును మిరాబో వలన తా మింతవరకై సురక్షితముగా నున్నామని తలంచుచుండిరి... మిరాబో "మరణమువలన ప్రజల యొక్కయు, జాతీయ సభ యొక్కయు, రాజుయొక్కయ : విశ్వాసమును పొంది, దేశ మును సురక్షితముగ నడిపించుచు. ప్రజల కవసరమగు సమస్త సంస్కరణములను గానించుచుండిన గొప్ప రాజ్యాంగ వేత్తను ఫ్రాస్సు దేశము గోల్పోయెను. ఇట్టి రాజకీయధురంధరుడు ఫ్రాన్సుకు తిరిగి చిర కాలమువరకు లభించ లేదు. చనిపోవువరకు ఈయసపయుస్సు నలుపడి రెండువత్సరములు మాత్రమే గలవు. చిన్న తనములో ఈ దురభ్యాసములకు లోబడి తన యా రోగ్యమును గోల్పోయెను. తన శక్తి నశించువరకును వ్రాయు చును, మాట్లాడుచును, ఆందోళనపడుచును నుండుటవలన అకాలమరణమునకు లోనయ్యెను. ఈయనకు చాల జబ్బుచేసి నదని తెలియగానే ప్రజలు గుంపులు గుంపులుగా నీయన ఆరో' గ్యస్థితి సరయుటకై యాతురతతో నెడ తెగక గృహము చుట్టును మూగియుండిరి. గంటగంటకును ఈయనజూడ్యస్థితినిగూర్చి వైద్యులు ప్రత్యేకముగ వార్తలను ముద్రించి ప్రక టించుచుండిరి. ప్రతిదినమును రాజు మనుష్యులనుబంపి వర్త

మానము తెప్పించుకొనుచుండెను. చనిపోవు దినమున తాను

195

పదు మూడవ అధ్యాయము


చనిపోవుట నిశ్చయమని తెలిసికొని, మంచిపుష్పములను సువా సనదవ్యములను పక్కలో వేయించుకొనెను. మంచి సంగీ తమును పాడించి వినెను. “పాపము! రాజు యొక్క అధికార మును కూల్చి వేసినాము. ప్రజలు అంతఃక లహములు లేకుండ నీనూతనాధికారము నెటుల వినియోగించుకొనెదరో నను నాత్రతవలన నాహృదయము బరువుగానున్న ”దని యాఖరు మాటలు చెప్పెను.


1791 సంవత్సరము 2 వ ఏప్రిల్ తేదీన మిరాబో పరలోక గతుడయ్యెను. జాతీయసభ్యు లెల్లరును, ప్యారీసు నగర వాస్తవ్యు లెల్లరును ఆయన శవము వెంట వెళ్ళిరి. ఆయన శవమును పాన్ ధియను ప్రదేశములో పాతి పెట్టిరి. ఆప దేశములో నే తరువాత ఫ్రాన్సు దేశములోని గొప్పవారు మృతక కేబర ములను పాతి పెట్టుచుండిరి.

7

రాజు యొక్క
కుట్రలు.

మిరాబో చనిపోయిన తరువాత లూయీరాజునకు ద్దుర్భోద లెక్కువయ్యెను.1790 డిశంబరు నుండియే లూయీ

రాజు క్పర రాజులతో రహస్యాలోచనలుయ్ నడుపుచుండెను. కాని 

కియా రూపకము దాల్చలేదు. ఇంతటి నుండియు రాజు రాణి యొక్క పలుకు బడిలో పూర్తిగ నుండెను. దేశము విడిచి పారి పోయి పర రాజుల సహాయమున తన రాజ్యమును పొందవలెనను ఆలోచనలు బలమయ్యెను. రాజుతరఫున ఆయన సోదరులగు

ఆర్టాయి ప్రభువును కాఁన్ డిరా కొమారుడుసు ఆస్ట్రియా రాజు
196

ఫ్రెంచి స్వాతంత్ర్య విజయము

నొద్ద చేరి కుట్రలు చేయుచుండిరి. ఆస్ట్రియా రాజు లియోపాల్డు ఫెంచిరాణికి సోదరుడు. ఫెంచి ప్రభువులును మతగురువు లున ఫాన్సు దేశము విడిచి బయట సరిహద్దున జర్మనీలో గుమిగూడుచుండిరి. లూయీరాజు పారిపోయి వీరితో చేరు నేమోయని ప్యారిసువజలు భయపడుచుండిరి. రాజు తన మేన త్తలను ఇటలీకి పంపెను. ప్రజలసం దేహము మరింత హెచ్చెను. ప్యారీసు నుండి సెంటు క్లాసుడు వెళ్ళవలెనని రాజు యత్నించగా ప్యాసుపజలు అడ్డుపడి వెళ్ళకుండ చేసిరి.

యూరపు రాజుల
సమావేశము

1791 సంవత్సరము 20 వ మే తేదీన ఇటలీలోని యూరపులోని రాజుల సమావేశ మయ్యెను. ఆస్ట్రియా, ప్రష్యా, రుష్యా, స్వీడెను, జర్మను. రాష్ట్రములు, సార్డియా, స్పెయిన్ ,ఇం గ్లాండు, పైడి మాంటు రాజుల ప్రతినిధులు కలిసి, ప్రెంచి ప్రజల మీది కొక లక్ష సైన్యములను పంపి, లూయిరాజు యొక్క, యధికారమును పునరుద్ధరించవలయునని రహస్యముగా తీర్మానించుకొని. తమ తోడి రాజగు లూయీ రాజును ఫ్రెంచి ప్రజలు అవమానపరచి యిబ్బంది కలుగ జేయు చున్నందుకు తమ అసమ్మతిని ముందుగా ఖండితముగా ప్రచు రెంచి జులై నెలలో వివిధ రాజుల సైన్యములు నలువైపులనుం డియు నొకసారిగా ఫ్రాన్సును ముట్టడించవలె ననియు, అంత వరకు నీ సంగతి రహస్యముగా నుంచవలెననియు నిశ్చయించు కొనిరి. కొంత రాజ్యము కలుపుకొనవలెనని ఆస్ట్రియా యొక్క

ఆశ. అమెరికాకు ఫోన్సు సహాయము చేసినందులకు ఫాస్సు

197

పదమూడవ అధ్యాయము


పైన నీసమయములో కసిదీర్చుకొనవలెననియు, విప్లవమును తమదేశములో వ్యాపింపకుండ చేయవ లెననియు నింగ్లాండు యొక్క అభిప్రాయము. ప్రష్యా రాజునకు నిరంకుశత్వమును తన రాజ్యములో స్థిరపరచుకొనుట కుద్దేశ్యము. యూరఫు. యొక్క దృష్టి ఫ్రెంచిపోరాటములో మగ్నమయి యుండగా పోలండును కాజేయవలెనని రుష్యా యొక్క ఆలోచన, తమ తోడి ప్రభువులు కోల్పోయిన హక్కులను తిరిగి నిలువ బెట్టుట జర్మనీ రాష్ట్రాధిపతుల కోరిక. 'స్పెయిన్ మొదలగు బోర్బోన్ వంశస్థులు తమవంశీయుడగు ఫ్రెంచి రాజునకు కలిగిన యవ మానమును తొలగించవలెనను తల పు. ఇట్టి వివిధ యూహలతో వివిధ రాజు లేక మై ఫ్రెంచిజా తిని నాశనముగావింప నిశ్చయిం చిరి . యూరపులోని నిరంకుశత్వమంతయు, ప్రజల స్వాతంత్ర నిర్మూలము గావించుటకు ఏక మయ్యెను. ఫ్రాన్సునుండి దేశ బ్రస్టు లైన వారు ఫ్రాన్సులో సైన్యములు లేవనియు, సరి యైన నాయకులు లేరనియు, అంతఃకలహములతో నిండియున్నా రినియు, బొక్క సమ లో దవ్యము లేదనియు, ప్రజలకు రాజునందు భక్తి యింకను గలదనియు, అల్లరులు చేయుటకు. సిద్ధముగా నున్నా రనియు, జాతీయసభయం దందరుకును విసుగు పుట్టినదనియు, ఫ్రెంచి జాతీయ ప్రభుత్వము వారు స్వ సంరక్షణము చేసికొనలేరనియు, రాజు లందఱితోను చెప్పి, వారిని ప్రోత్సాహపరచిరి. మాంచువా సమావేశ ముసంగతి రహస్యముగా ఆస్ట్రియా రాజు చారులచే ఫ్రెంచి రాజుకు కబు

రంపెను.
198

ఫ్రెంచి స్వాతంత్యవిజయము

(8)

రాజు పారి
పోవుట,

1791 సంవత్సరము జూప్ 20 వ తేదీన లూయిరాజు ప్యారిసును విడిచి పారిపోవ నిశ్చయించెను. జనరల్ బొయిలీ యను ఫెంచి సేనాధిపతి రాజునకు పరమ మిత్రుడు. ఫ్రాన్సు సరిహద్దున శత్రువులు సైన్యములు పోగు చేయుచున్నా రను మిష మీద తన సేనలను సరిహద్దుకు దగ్గిర నున్న మాంటుమ-డీలో నుంచెను. రాజు కుటుంబముతో మాంటుమడీకి వచ్చి ఈ సేన లను చేరుట కేర్పాటు చేసిరి. రాజు షాలోను మీదుగా వచ్చును.త్రోవలో ప్రతిచోటను రాజు యొక్క సురక్షితము కొరకు బోయి కొంతమంది సైనికుల నుంచెను. మాంటుమడీ లోని సేనలకు ప్యారీసునుండి కొంత సొమ్ము తీసికొని వెళ్ళి భద్ర ముగా నొప్పగించుటకై సైనికులను త్రోవలో పెట్టినట్లు బొయిలీ నటించేను. జూన్ 20 వ తేది రాత్రి, రహస్యముగా నొకరి తరువాత నొకరు రాజును రాణియును మారు వేషములతో ట్యూలరీ మందిరమునుండి తప్పించుకొని పోయిరి.రాజు యొక్క

తోబుట్టువు ఎలిజబెత్తును, రాజుయొక్క కుమారైయు,

కొడుకును, వారల దాదీయు కూడ ముందుగ నే పెళ్లిరి. వీరంద రుసు బోలివార్డులో సిద్ధముగ నుంచబడిన ఇద్దగుర్రవు బండిలో నెక్కి మాంటుమడికై వెళ్ళిరి.


ట్యూలరీమందిరమును కాపుదలచేయుచుండిన జాతీయ సైనికులు మైమరచియుండిరి. మరునాడు తెల్లవారగనే రాజు

కుటుంబము పారిపోయిన సంగతి కని పెట్టిరి. ప్యారిసులో గొప్ప
199

పదమూడవ అధ్యాయము

కలవరము ఫుట్టెసు. ఎక్కడ చూచినను ప్రజలు గుంపులు గూడి దీనిని గురించియే యాందోళనపడుచుండిరి, ఆరాత్రి కాప లాయున్న సైనికుల యజాగ్రత్తకు నిందించుచుండిరి. లఫయయతు దౌలీ సేనాధిపతులే యీపనిలో తోడ్పడిరేమోయను అనుమాన ముకూడ కొందరికి కలిగెను. ప్రాతనిరంకుశత్వమును, ప్రాతసాం ఘిక సాంప్రదాయములును తిగివచ్చుటకును, దేశ మధోగతి పాలగుటకును నిది దురదృష్టి సూచకమని ప్రజలు భావించ సాగిరి. వెంటనే జాతీయసభ వారు తగినచర్య పుచ్చుకొని ప్రజలను శాంతింప జేసిరి. జాతీయసభ సమావేశమై మంత్రు లను ప్రధానోద్యోగస్తును పిలిపించి రాజు యొక్క అధికార ములన్నీయు తమకు సంక్రమించిన వనియు, నింతటి నుండియు జాతీయసభ వారి పేరనేసమస్తకార్యములను జరుపవల సిన దనియు నాజ్ఞాపించిరి. సేనాధిపతులకు కబురంపి సేన లను జాతీ యసభ కే లోబడి నడిచుకొనునట్లు పదిలపచిరి. రాజు పారి పోవుటవలన ప్రెంచి ప్రభుత్వము విచ్ఛిన్నము కాలేదనియు, ఫ్రెంచిజాతి తరున తాము ఫాస్సు దేశ పుప ప్రభుత్వమును చేయు చున్నామనియు, నితర దేశముల ప్ర భుత్వములతో, సఖ్యముగా నుండుటయే తమ యుద్దేశమనియు ప్రకటనముగావించి, యూ రపులోని రాజుల కందరకును తెలియపలుచిరి. దేశ సంరక్షణ కొఱకు వెంటనే మూడు లక్షల ముంది. జాతీయ సైన్యములను పోగు జేయుటకు తీర్మానించిరి, “నాలుగుగంటల కాలములో ఫ్రెం చిజాతీయసభ సమ స్త అధికారములను పొందినది. ప్రభు

త్యసు యథాప్రకారము సాగినది. ప్రజలలో లేశమైనను

200

ఫ్రెంచి స్వాతంత్ర్య విజయము

రాజును . బయిటకు శాంతికి భంగము కలుగలేదు. ఈ యనుభవమువలన రాజు పేరుకు మాత్రమే కలడనియు, రాజు లేకపోయినను .ఫ్రెంచి జూతికి నష్టము లేదనియు, ప్యారిసు నగరమును, ప్రాన్సు దేశ ముసు గ్రహించినవి" అని ఫెర్రీరు ప్రభువు చెప్పెను.

రాజును
పట్టుకొని
తెచ్చుట

ఈలోపున లూయిరాజును ఆయనకుటుంబమును ప్రయాణము పూర్తిచేయుచుండిరి. ప్రథమదిసమున జయప్రదము గా సాగుటవలనను, ప్యారిసునుండిచాల దూరము వచ్చినామను సంతోషమువలన ను, లూయిరాజు అజాగ్రత్తగానుండి బండిలో నుండి అటునిటు చూడసాగెను. 21 వ తేదీ సాయంత్రము సెంటుమెనిహల్దువద్ద పోస్టుమాస్టరు జనరలగు డ్రూయి, రాజును గుర్తించి బండి వెంట పోయెను. ఆరు గంటలు కొట్టు సరికి రాజు బండిలో విర్రిసు చే రెను. గుఱ్ఱము లసియున్నందున అక్కడ సిద్ధముగా నుంచబడియున్న మరి యొక గుఱ్ఱము జతను బండికి కట్టుచుండిరి. బండి వెంటవచ్చిన డ్రూయి, నెర్రెసులోని మ్యునిసిపలు అధ్యక్షుడు మొదలగు వారిని పోగుచేసి, రాజు గారి బండి సటకాయించెను. వెర్రెను ప్రజలును అక్కిడి జాతీయ భటులును బండిని చుట్టుకొని ముం దుకు పోనియ్య లేదు. జాతీయ భటులు బొయిలీ సేనాని త్రోవలో నుంచిన సైనికుల నోడగొట్టిరి. ఆరాత్రి వెర్రెనులోని యొక - చిన్నయింటిలో రాజకుటుంబమునకు ఫలహారములు, తేయాకు నీళ్ళ నిచ్చిరి. జూ తీయటును ప్రజలును రాజు యొక్కబండిని

త్రిప్పించి ప్యారిసుకు తీసికొనిపోవుచండిరి. రాజున కెక్కడను

201

పదుమూడవ అధ్యాయము

సహాయము లేదయ్యెను. దేశములోని ప్రజలందరును ఏకమై యుండి, తోవలో ఎపెర్నియెద్ద జాతీయసభ వారు పంపిన ముగ్గురు ప్రతినిధులు రాజును కలిసి ప్యారిసునకు తీసికొని పోయిరి. ప్యారిసునకు రాజకుటుంబము చేరగనే వేలకు వేల ప్రజ లు రాజుబండిని చుట్టుకొని. "రాజునకు గౌరవము చూపిన వారికి దెబ్బల శిక్ష విధించబడును. రాజు నవమానపరచినవారికి మరణదండన నియ్యబడు" నని ప్యారిసు పురపాలక సంఘమువారు ప్రచురించి యుండిరి. ప్యారిసు ప్రజలు నిశ్శబ్దముగాను శాంత చిత్తముతోను రాజును చూచి వెళ్ళిరి. తిరిగి రాజకుటుంబమును రాజును ట్యూలరీమందిరములో నుంచబడిరి. ఎక్కువ బందో బస్తుగా కాపుదల చేయబడెను .


రాజు నీమిచేయవలెనని జాతీయ సభలో తీవ్రముగా, చక్చజరిగెను. ఇంతటినుండియు రిపబ్లికను పార్టీ (సంపూర్ణ ప్రజాస్వామ్యక క్షి) ముందుకు వచ్చెను. వెంటనే రాజును పద బ్రష్టునిచేసి విచారణ చేయవలసినదనియు, రాజు లేని ప్రజా ప్రభుత్వమును స్థాపించవలెననియు వీరు కోరిరి.గోడల మీద రిపబ్లికు కావ లేదని పెద్ద శాగితముల నంటించిరి. కాని ఎక్కువ మంది సభ్యులు రాజును తీసి వేయుటకు సమ్మతించ లేదు. తొం దర పడపద్దనియు పేరునకు రాజుండుట వలస జాతికి నష్టములే దనియు బార్నిల్ గంభీరోపన్యాసము గాంచెను. ఇప్పటికై సను రాజు నూతన ప్రభుత్వ విధానము సంగీకరించకపోయిసను, ఫ్రెంచి జాతికి విరోధులగువారితో చేరినను, జాతికి వ్యతిరేక ముగ సైన్యములను పోగు చేసినను రాజ్యమును కోల్పోవునని

తీర్మానించిరి.
202

ఫ్రెంచి స్వాతంత్ర్య విజయము

సంపూర్ణ ప్రజాస్వామ్య వాదులు దీనితో తృప్తినొందక ప్రజలలో నాందోళనమును పురిగొల్పిరి, మిరాబో చనిపో యిన తరువాత పేషన్, రాబిస్పీయరుల నాయకత్వము క్రింద జేకొబిన్ "క్లబ్బులు ఈకక్షి వారి పలుకుబడిలో చేరెను.జులై 17 వ తేదిన వెంటనే రాజును పదబ్రష్టుని చేయవసినదని జాతీయసభ వారిని కోరుచు, నొక మహజరును తయారు చేసి, ప్యారిసులోని షాండిమారు ప్రదేశములో కట్టబడియున్న వేదిక యొద్ద వేడు వేల దస్కృతులు చేయుచుండిరి. ప్యారిసు చుట్టు నున్న పల్లెలకు గూడ నీయాందోళనము వ్యాపించెను. జాతీయ సభ వారు, ప్రజలు గుమిగూడి దస్కృతులు చేయవద్దని "యుత్త రువులు చేసిరి . బాలీ బటులకును ప్యారిసు మ్యునిసిపాలిటికిని, ప్రజలగుంపులు ట్టవలసినదని యాజ్ఞాపించిరి. వీరు ప్రజలగుంపులను చెదిరిగొట్టగా ప్రజ లాగ్రహ వేశులై ఇంక నెక్కువగా చేరి దస్కతు చేయనారంభించిరి. లఫయతు సేనాని సైన్యములను తెచ్చెను. పోవలసినదని యుత్తరు విచ్చెను. ఆకాశమున కై తుపాకులను పేల్పించేను. ప్రజలు పోక రాళ్ళు రువ్విరి. అప్పుడు సైనికులను ప్రజలమీద కాల్చుట కుత్తురువు చేసెను. తుపాకులను కాల్చగా ప్రజలలో చాలమంది చని పోయిరి. చాలమందికి గాయములు తగిలెను. ప్రజలు పారి పోయిరి. ఈసంగతి జరిగిన తరువాత సంపూర్ణ ప్రజాస్వామ్య కక్షి యొక్క. పలుకుబడి ప్రజలలో నింకను ఎక్కువదృఢముగా నాటుకొనెను. జాతీయసభలోని మిత వాదనాయకుల పొర

బాటు వారికక్షి యొక్క నిర్మూలమునకు తోడ్పడెను. ప్రజల

203

పదుమూడవ అధ్యానము

మీద నిర్బంధములు ప్రయోగించినకొలదియు ప్రభుత్వము యొక్క బలము క్షీణించును. ఆదినమున చనిపోయిన ప్రజల రక్తము రాజశిరచ్ఛేదమునకు కారణమయ్యెను.

9

యూరపు రాజులు
ప్రకటనము.

లూయీ రాజును పట్టుకొని తిరిగి తెచ్చినారనువార్త ఫ్రాన్సు బయటనున్న రాజు యొక్క స్నేహిత కందరకును కలవరము గలిగించెను. రాజునకు సహాయము చేసిన బొయిలీ సేనాని కొంత సైన్యముతో 'దేశమును పదలి దేశ భ ష్టులలో చేరెను. దేశ బ్రష్టులు తమయాశలనన్నిటిని ఇంతటి నుండియు యూరపు రాజుల మీదనే పెట్టుకొనిరి. ఆగష్టు 27వ తేదీన ఆస్ట్రియా చక్రవర్తియు, ప్రష్యారాజును, ఆర్టాయి ప్రభువును, కలిసికొని యూరపు రాజు అందరితరఫున నొక ప్రకటనము గావించి,రి. తమ తోడి రాజగు పడునారవ లూయీ యొక్క గౌరవము తమదేననియు, ఆయన యిష్టము వచ్చిన చోటికి పోవు స్వేచ్ఛ యుండవలెననియు, నాయన సింహాసనము నాయ నకు యిచ్చివేసి జాతీయసభ అంతరించవలెననియు, ఫ్రెంచి ప్రభువులకు తమతమ ఆస్తులను, హక్కులను తిరిగి యిచ్చివేయవ లెననియు, నిట్లు " ఫ్రెంచిప్రజలు చేయనియెడల యూరపులోని రాజులందరును. ప్రాన్సు మీదికి దండెత్తివచ్చి లూయీ రాజు యొక్కయు, ఫ్రెంచి ప్రభువుల యొక్కయు హక్కులను సంపూర్ణముగా పునరుద్ధరింతు మనియు నాప్రక

టనలో చెప్పబడెసు. దీనివలన ప్రెంచి ప్రజ లేమి, జాతీయ
204

ఫ్రెంచి స్వాతంత్ర్య విజయము

రాజులు సభ్యు లేమి, నిరుత్సాహపడుటకు మారుగ కోపోద్దీపితు లైరి. “మన దేశ వ్యవహారములతో నీ విదేశ రాజలు కేమిపని? ఒక గొప్పజాతికి సుత్తరువు లిచ్చుటకు వీరి కేమియధి కారము? మనజాతి యొక్క లాభ నష్టములు, మంచి చెడ్డలు, రాజ్యాంగ విధానములు మనమే నిర్ణం యించుకొనవలెనుగాని, యూరపు కేమిజోక్యము?” అని ప్రశ్నింపసాగిరి. వెంటనే ఫ్రాన్సు యొక్క సరిహద్దు లన్నియు సురక్షితముగ నుండుటకై తగు బందోబస్తును జేసిరి. ఒక లక్షజాతీయ సైనికులను తయారు జేసిరి. శత్రువుల ముట్టడికి బహు శాంతమనస్కులై సంపూర్ణ ముగ సిద్ధపడిరి. ఫ్రెంచి జాతి దేశాభిమానపూరిత మైయున్న ఈ సమయములో తమభూమిమీద ఎవరికిని జయింప నలవి గానిదని దృఢవిశ్వాసమును గలిగియుండెను.

10

జూతీయసభ
యొక్క ముగింపు.

జాతీయసభవారు నూతన రాజ్యాంగ విధానమును చట్ట ములను అన్ని టిని సరిజూచి, సెప్టెంబరు 14వ తేదీన 60 మంది ప్రతినిధులచే లూయిరాజు యొక్క దస్కతు నిమిత్తము పంపిరి. లూయి రాజు వానినన్నిటిని పరిశీలించి దస్కతు పెట్టెను. "నే నీ రాజ్యాంగ విధానము నంగీక రించుచున్నాను. నా దేశములో దానికి సం రక్షించుటకును, విదేశీయుల ముట్టడులనుండి కాపాడుటకును, వాగ్దదత్తము చేయుచున్నాను నాకున్న యావత్తు అధికారము లను వినియోగించి, దాని నమలులో బెట్టెద"నని రాజు

జాతీయ సభకు ఉత్తరము పంపెను. మరుసటిదినము రాజు

204

పదమూడవ అధ్యాయము

స్వయముగా జాతీయసభకు వచ్చెను. రాజ్యాంగవిధానము సంగీక రించెను. ప్రజలు జే జే ధ్వానములు సలిపిరి. జాతీయసభ్యు 'లమితోత్సాహపరవశులైరి. అదినమున రాజు ప్రజల యొక్క -- విశ్వాసమును గారవమును తిరిగి పొందెను. నూతన రాజ్యంగ విధానమును బట్టి నూతన శాసనసభలెజిస్లేటివ్ ఎస్సంబ్లి) అక్టో బరు 1వ తేదీన సమావేశ మగును. కావున సెప్టెంబరు 29 వ తేదీన జాతీయసభ యొక్క యాఖరుసమావేశము జరిగెను. రాజు హాజరయ్యెను. గంభీరోపన్యాసమును జేసెను. "సభ్యు లారా! మీరు చాలకష్టపడి యనేక దేశపయుక్తమయి చట్టములను చేసియున్నారు. మారిండ్లకు వెళ్లినప్పుడు మీరు చేయవలసిన కార్య మొకటి గలదు. ఈ చట్టముల నిజమైన యు ద్దేశ్యములను మీతోడి పౌరులకు చెప్పి, వినని నిర్లక్ష్యము చేయువారిని మందలించుటయు, మీప్రే వల్లను రుజు ప్రవార్త నవల్లను దేశములోని వివిధాభిప్రాయములు గలవారినెల్ల నేకీభవింపజేయుటయు నై యున్నది. మీరాజు ప్రజలకు నెల్ల ప్పుడును విశ్వాసపాత్రుడైన స్నేహితులుగా నుండునని వారితో చెప్పుడు. ప్రజల ప్రేమనే గోరుచున్నా సనియు, ప్రజలపౌఖ్యమే నాసౌఖ్యమనియు, ప్రజలకు మేలుచేయుటవలస మాత్రమే నాకు తృప్తికలుగుననియు, మీతోడి పౌరులలో చెప్పుడు" అని రాజు సభ్యు లహర్ష ధ్వనుల మధ్య అంత్యోపన్యాసమును . చేసె సు. జాతీయసభవారు అదివరకు రాజుకు పారి పోవుటకు పోవుటకు ప్రోత్సహించిన వారిమీద బెట్టబడిన నేరారోపణలన్నియు నెత్తి వేసిరి. దేశ భ్రష్టులైనవా రెల్లరును తిరిగి దేశమునకు వచ్చి సౌఖ్య .

206

ఫ్రెంచి స్వాతంత్ర్య విజయము

ముగా నుండవచ్చునని ప్రకటించిరి ఫ్రెంచి ప్రజల కందరకును స్వాతంత్యము గలిగి, సోదర భావము ఐకమత్యము ప్రబలి, ఫ్రాన్సు దేశము వర్ధిల్లు వలెననికోరిరి. అధ్యక్షుడగు ధూరే గారు "జాతీయసభ తనయొక్క యుద్దేశ్యమును నెరవేర్చి దాని సమావేశములు ఇంతటితో ఆఖరై నవి" అని బిగ్గరగా చెప్పెను. ప్రేమపూరితమైన కోలాహలముతో 'ఫ్రెంచి జాతియొక్క పథము: జాతీయసభ ముగిసెను. రెండు సంవత్సరముల కాలములో నీయాదర్శపద మైనసభ, నిరం కుత్వమును నిర్మూలనము గావించి,జాతి భేదములను రూపు మాపి, ప్రజల రాజ్యమును స్థాపించెను. ప్రజలను బాధించు చున్న ప్రతిష్టాపన లెల్ల తీసి వేసి, ప్రజలలో సమానత్వము, న్యా యము నేర్పరచి, ప్రజాభివృద్ధి కారక మగు పెక్కుపనులను గావిం చెను. గొప్ప ఫ్రెంచి జాతిని నిర్మాణము గావించెను. ఉతృష్ట మైన సిద్ధాంతములను లోకమునకు ప్రకటిం చెను. "జాతీయత కుసు, స్వయంనిర్ణయమునకును, ఫ్రెంచి జాతిని ప్రపంచమునకు మార్గదర్శకము.గా చేసెను. ఇట్టి ఘనకార్యము నింతశీఘ్రకాల ములో ముగించిన జాతీయసభ మానవచరిత్రలో మరియెచ్చ టను లేదు.