Jump to content

ఫ్రెంచి స్వాతంత్ర్యవిజయము/పదునాఱవ అధ్యాయము

వికీసోర్స్ నుండి


ప్రెంచిస్వాతంత్ర్యవిజయము

పదునాఱవ అధ్యాయము

అతివాదులు

1

యూరపు వారి
శతృమండలి

లూయీ రాజు మరణించిన తరువాత ఫ్రాన్సు దేశము యొక్క కష్టము లంతరించ లేదు. జాతీయసభలో గిరాండిస్టుల కును అతివాదులకును సుధ్య తగాదాలు హెచ్చినవి గాని తగ్గ లేదు. యూరోపులోని శత్రుమండలి యొక్క పట్టుదల ద్విగుణీకృతమయ్యేను. ఆగష్టు 10 వ తేదీన లూయిని రాజ్యభ్రష్టుని చేసినప్పటి సుండియు సంగ్లాండు ప్రభుత్వమువారు ఫ్రెంచిచి రాయ బారిని వెడల గొట్టిరి. నూతన ప్రభుత్వము నంగీకరించనని ఆంగ్లేయ ప్రథానమంత్రి , విలియంపిట్టు చెప్పెను. ఫ్రెంచి జాతీయసభ వారు 1793 వ సంవత్సరము ఫిబ్రవరి 1 వ, తేదీన 'బెల్జియముసు

కలుపుకొని ఇంగ్లాండు విూద - యుద్ధమును ప్రక
238

ఫ్రెంచి స్వాతంత్ర్యవిజయము

టించిరి. ఇంగ్లాండు ఫ్రాన్సు దేశము నణచుటకు యూ వచ్చ క్తిని విని యోగించెను. ఆ కాలమున ఫాన్సుదేశము సాగరికతలో యూ రవుఖండమునం దగ్రస్థానము వహించియున్నది. ప్రపంచము యొక్క, వర్తకములోను పలుకుబడిలోసు ఇంగ్లాండుకు పోటీగా నున్న దొక్క ఫ్రాస్సు దేశమే, అప్పటి తక్కిన దేశములు తగ్గు స్థితిలో నున్నవి. ఇట్టి మంచి యవకాశమును జార విడువక యూరోపులోని రాజులనందరను పోగు జేసి ప్రాస్సును వెడల గొట్టిన యొడల తనకు ప్రాన్సు దేశపు పోటీ పోయి అమెరికా ఖండములోను హిందూ దేశములోను అడ్డు లేకుండ రాజ్యమును వ్యాపింప వచ్చు సనియు యూరోపు ఖండమున తానగ్రస్థానము వహించ వ చ్చుననియు, ఇంగ్లాండు యొక్క ఆభిప్రాయము. అప్పటికి హిందూ దేశములో కొద్ది భాగము మాత్ర మాంగ్లేయుల క్రిందికి వచ్చి నది. స్వదేరాజులు ఇంకను పెక్కు మంది యుండిరి. ఎంత ద్రవ్య ము నైన ఖర్చు పెట్టి ఫ్రాన్సును కూల దోయవలెననియే ఇంగ్లాండు యొక్క పట్టుదల. ఆరు నెలల లోపల ఫాన్సుకు . వ్యతిరేకముగ యురోపులోని వివిధ ప్రభుత్వములలో ఇంగ్లాండు దేశము యొడంబడికలు చేసికొనెను. అనేకమంది రాజులకు ద్రవ్యమిచ్చి ఇంగ్లాండు యుద్ధము లోనికి తెచ్చెను. మార్చి 4 వ తేదీన ఇంగ్లాండునకును హనోవరుకును వడంబడిక ; మూర్చి 25 వ తేదీన ఇంగ్లాండుకును రష్యాకును సంధి.,మే 2 వ తేదీన స్పైయిన్ తో సంధి; జూలై 12 వ తేదిన :ఇటలీతో సంధి; జులై 14 వ తేదీన ప్రష్యాతో సంధి; ఆగష్టు 30 వ తేదీన ఆస్ట్రియా చక్రవర్తితో సంధి; సెప్టెంబరు 21 వ తేదీన పోర్చు

పదునారవ అధ్యాయము

గలుతో సంథి. ఇన్ని సంధులను ఇంగ్లాడు ప్రత్యేకముగా చేసికొనెను. ఇంతేగాక ఇంగ్లాడు యుద్ధవ్యయము భరిం చునట్లును ఆయాప్రభువులు సైన్యములను బంపి ఫ్రాస్సు మీద పడునట్లును, ఏప్రిలు 10 ఏ తేదీన 'హస్సి కాసిలు ప్రభువుతోను, ఏప్రిలు 25 వ తేదీన సార్డినియాప్రభుత్వము తోసు సెప్టెంబరు 21 వ తేదీన 'బే డెన్ ప్రభువుతోసు, యొడంబడికలు చేసికొనెను. ఆస్ట్రియాకును ప్రష్యాకును యుద్ధ వ్యయమునకై ఇంగ్లాండు చాల ధనమిచ్చెను. ఈ విధముగా నింగ్లాండు ఫ్రెంచి జాతి యొక్క స్వయంనిర్ణయమునకు బద్ద శత్రు వై యుద్ధము నడిపినది.

ఇంత మంది శత్రువులు ఫాస్సు యొక్క అన్ని సరి హద్దులను ఒక్కసారి వేలకొలది సైన్యములతో ముట్టడించెదరు.. ఫ్రెంచి జాతీయసభవారు సరిహద్దుల నన్ని వైపులను కాపాడు కొనుటకు వెంటనే మూడు లక్షల సైన్యములను తయారు చేసిరి. ఏప్రిలు 6 వ తేదీన యుద్ధమును జయప్రథమముగా సడుపుటకై . పండ్రెండు మందిగల (కమిటీ ఆఫ్ పబ్లిక్ సేప్టి). దేశ సంరక్షణ సంఘము నొక దానిని నేర్పరచిరి. దేశములోపల జాతీయ ప్రభుత్వమునకు వ్యతి రేకులని యనుమానిం పబడినవారిని పట్టుకొనుటకు పండ్రెండుమందిగల దేశపుకాపుదల సంఘము (కమిటీ ఆఫ్ జనరల్ సెక్యూరిటీ) నొక దానిని స్థాపించిరి. వీరు పంపిన వారిని

విచారించి శిక్షించుట కొక విప్లవ న్యాయస్థానము నేర్పరచిరి.

240

ఫ్రెంచి స్వాతంత్య విజయము


గిరాండిస్టు కక్షి
పడిపోవుట

సెప్టెంబరు నెలలో హత్యలుగావించిన కొందరిని విచా రించుటకు గిరాండిస్టులు ప్రారంభించగా సతివాదుల విచారణ కూడదని యాపిరి. రాజుసు రక్షింప యత్నించి నందుకు గిరాండిస్టులను ఆతీనాదులు క్లబ్బులలోతీవ్రముగా ఖండించిరి. వర్తకులు సరుకులమ్మక దాచుకొనగా ధరలు పెరిగినందున ప్రజలు వెళ్లి దోచుకొనిరి. ఇది అతివాద నాయకుడగు మారటు సలహామీద జరిగినదని గిరాండిస్టులు జాతీయసభలో కఠినముగా విమర్శించిరి.


ఇంతవరకును మంఫ్రెంచి సేనలను నడిపిన డ్యూమరో సేనాని లూయరాజుమరణమునకు చింతించి నూతన ప్రభుత్వమునకు వ్యతిరేకుఁ డయ్యెను. ప్యారిసు మీదికి పోయి తిరిగి రాజరికమును స్థాపించ నుద్దేశించెను. ఆస్ట్రియా సేనా పతితో కుట్రలు సలిపి. తన స్వాధీనములోని కొన్ని కోటలను ఆస్ట్రియా వారికి వశము చేసెను. కాని ఆయన క్రిందనున్న నేతలు ఆయనతోకూడ శత్రువులతో చేరుటకు సమ్మతించలేదు. డ్యూమరో సేనానిని జూతీయ ప్రభుత్వము వారు సేనాధిపత్యమునుండి తొలగించిరి. ఆయనయు మరి యిద్దరు సేనానులును మాత్రము లేచిపోయి శత్రువులతో చేగిరి. ఆయస క్రిందనున్న 'సేనలన్నియు ఫామర్సు కువచ్చి మురియొక సేనాధిపతి కిందనున్న మిగిలిన పరాసు సైన్య ములతో చేరెను. డ్యూమరొ గిరాండిస్టుల కక్షీకి చెందియుం

డెను. ఆయన యొక్క కుట్రలో మిగిలిన గిరాండిస్టులును గల

240

పదునాఱవ అధ్యాయము

రని యతివాదులు నిందలు మోపిరి. ప్యారిసు ప్రజల సహాయ మున గిరాండిస్టులను జాతీయసభ నుండి వెడల గొట్టవలెనని యతివాదు లాలోచించు చుండిరి. గిరాండిస్టు లతివాద నాయకు డగు మారటు మీద వర్తకులను దోయించి నాడను నేరా రోపణ చేసి నూతన విప్లవ న్యాయస్థానమునకు విచారణకు బంపిరి. ప్యారిసు పట్టణము లోను క్లబ్బులలోను గొప్ప యాందోళనము కలిగెను. ప్యారిసుపుర పాలకాధ్యక్షుడు వెంటనే గిరాండిస్టు ముఖ్యులను జాతీయసభ నుండి రాజీనానూ నిచ్చి పోవ లెనని ప్యారిసు పురపాలక సుఘము తరఫున కోరెను. మా రటు మీద కేసు కొట్టి వేయబడెను. మారటును ప్యారిసుప్రజ లూరేగించిరి. జేకొబినుల పక్షమువారు. జాతీయ సభను చూడ వెళ్లి కూర్చొని గిరాండిస్టులు మాట్లడుచున్నఫు డల్లరిచేయుచుం డిరి. ప్యారిసు మ్యునిసిపాలిటీ యొక్క ప్రవర్తనను విచారించుట కొక కమిటీని గిరౌండిస్టులు నియమించిరి. వీరి విచారణమూ లమున మ్యునిసిపలు సభ్యులకు చాల భయముక లిగెను. 'మే 22 వ తేదీని అమలుజరుప సున్న మరియొక కుట్ర గలదని తేలెను. మ్యునిసిపలు సంఘములో చేరిన హెబర్టును, మరి కొందరిని కుట్ర క్రింద పట్టుకొనిరి. అతివాదులు, జెకోబినులు, మ్యూనిసిపలు సభ్యులు ప్రజలలో సుద్రేకమును ఫుట్టించిరి. ఈ విచారణను సంఘము వారు జాతీయ సభలో యుండిన యతివాదుల సందరును ఖయిదు చేసి గిరాండిస్టుల నిరంకుశత్వమును స్థాపించెద రను నపోహ ప్యారిసు ప్రజలలో కలిగెను. మే 27 వ తేదీన ప్యా రిసుపుర

పాలక సంఘమువారు హేబర్టు మొదలగువారిని విడుదల చేయ
242

ఫ్రెంచి స్వాతంత్ర్య విజయము


వలయుననియు వెంటనే విచారణ సంఘమును రద్దుపర్చవలసిన దనియు జాతీయసభ వారిని కోరిరి. వేలకు వేలు ప్యారిసుప్రజలు జాతీయసభను చుట్టుకొనిరి. “ఇటువంటి యల్లరులు చేసినయెడల ప్యారిసు పట్టణమును నాశనము చేసెదమని జాతీయ సభాధ్య క్షుడు చెప్పిన దానిమీద ప్రజలయాగ్రహము మరింత హె చ్చెను. అల్లరికి మేర లేదు. కొంతమంది గిరాండిస్టులు సభను విడిచిపోయిరి. మిగిలిన జూతీయ సభ్యులు ప్రజల కోరికలను మన్నించి హెబర్టు మొదలగు వారిని విడిచిపుచ్చుటకును విచా రణసంఘమును రద్దుపరచుటకును తీర్మానించిరి.


మరునాడు జాతీయసభకు గిరాండిస్టులందరును హాజరై కిందటిరోజున చేసిన తీర్మానమును రద్దు పఱచి తిరిగి విచా రణసంఘమును నెలకొలిపిరి. జాతీయ సభ పై ప్ర ప్రజలలో తిరుగు బాటు ప్రారంభ మయ్యెను. జూన్ 2వ తేదీన యెనుబది వేల మంది ప్యారిసుప్రజలు జాతీయసభను ముట్టడించిరి. వెంటనే గిరాండిస్టు ప్రముఖుల సందరను ఖైదు చేయ సలసిసదని కోరిరి. “ఇరువదు నలుగురు దేశద్రోహులను మా కప్పగించవలె” సని ప్రజల నాయకుగు హెన్రియట్టు కోరెను, ఈ కల్లోలములో సగము మంది జాతీయ సభ్యులు లేచిపోయిరి. అతివాదసభ్యులీ కుట్రలో చేరియుండిరి. మిగిలిన గిరాండిస్టులు భయపడిరి. అతి వాదసభ్యు లిచ్చిన జాబితా దాఖలా ఇరుపది మంది గిరాండిస్టు లను ప్రజలు ఖైదు చేయుటకు హాజరుండిన జాతీయ సభ్యులనుగ్న నిచ్చిరి. ఆ ఇరువదినలు గురును వారివారి యిండ్లలో సుండగా

ప్రజలు ఖైదు చేసిరి. ప్రజ లంతటితో తృప్తినొంది వెళ్ళిపోయిరి.

243

పదునాఱవ అధ్యాయము

(3)

మారటు యొక్క
హత్య,

గిరాండిస్టులలో కొందరు ఖయిదులో నుండిరి. కొం దరు దేశమును విడిచి పారిపోయిరి. "పేషన్ మొదలగు కొందరు రాష్ట్రములకు బోయి. జాతీయ ప్రభుత్వము పై తిరుగు బాటులు చేయించిరి . ఎర్రీలోను, కైను లోను స్థావర మేర్పఱచుకొనిరి. బ్రిటనీ వీరితో చేరెను. సైన్యములను పోగుచేసికొని 'ప్యారిసు మీద దండెత్తవలెనని యత్నించుచుండిరి. ఆ వైపుల నున్న యతివాదులను ఖయిదుచేసిరి .. ఇచటనుండి యొక ధైర్యశాలి యగు యువతి, మిగుల సౌందర్యవతి, చార్లెటికార్డి యనునామె, జూన్ 2 వ తేదీన గిరాండిస్టులను వెళ్లగొట్టిన వారిలో ముఖ్యు డగు మారటును చంపుటకు బయలు దేరెను. మారటు సుప్ర సిద్ధ వైద్యుడు. ఎం. డి. పరీక్షలో తేరినవాడు. అతివాదులలో కెల్ల పలుకుబడిగలవాడు . "ప్రజా స్నేహితు” డను పత్రికకు సంపాదకుడు. ప్యారిసు జుల కీయనయం దత్యంత గౌరవము గలదు. గొప్ప రక్తపాతము లేనిది. స్వతంత్రము స్థాపించబడ నేరదని ఈయన సిద్ధాంతము.మారటు జబ్బుగా నుండుటవలన యూవిరిస్నానము చేసి కూర్చుండి యుండిగా గిరాండిస్టు కుట్ర లను గూర్చిన కొంత సమాచారము తెలుపుటకు వచ్చితిని చార్లెటి కబురంపి లోనికి వచ్చుటకు అనుజ్ఞపొందినది. లోనికి వెళ్ళినది. కొంత సమాచారము మారటుడు చెప్పినది. "ఆమె చెప్పుచున్న దాని నాయన జాగత్తగా వ్రాసికొనుచుండెను. ఈసమయమున తాను తెచ్చియున్న కత్తితో ఆమె మార

టును పొడిచి చంపెను. వెంటనే ఆమెను పట్టుకొనిరి. న్యా
244

ఫ్రెంచి స్వాతంత్ర్య విజయము

యాధిపతుల యెదుట విచారణకు "బెట్టిరి. “ నేను ప్రజాస్వామ్య మును కోరుచున్న దాననే. వేలకొంది ప్రజలను సంరక్షించుట కీదుర్మార్గుని చంపితిని. అమాయుకులను కాపాడుట కీద్రోహిని నాశనము చేసితిని. నా దేశమునకు శాంతి నిచ్చుట కీయడవి మృగమును వధించితిని,” యని యామే మిగుల ధైర్యముతో చెప్పెను. ఆమెకు మరణదండన విధింపబడెను. మారటు చని పోయిన తరువాత ప్రజలకొరకు ప్రాణములర్పించిన ధీరుడని ఆయని యందు ప్రజల గౌరవ మతిశయించెను .

తిరుగుబాటులు.

ఇంతలో లైన్సు, మార్సెల్సు, బోర్డో పట్టణములును అరువది రాష్ట్ర ములును తిరుగుబాటు చే రెను. రాజరికపు పక్షవాదులుకూడ తిరుగు బాటులను పురిగొలిపిరి. సైన్యములు తయారయ్యెను. సార్డీనియా ప్రభు వు వీరికి సహాయమును బంపెను. టూలూను, నైమ్సు మాంటు బాన్ పట్టణములును వీరితో చేరెను. జూన్. 6 వ తేదీన నలుబది వేలమంది తిరుగు బాటుదారుల సైన్యములు లా వెండి నుండి బయలు దేరి నామూరును పట్టుకొనెను. తరువాతనాన్ టెన్ సు మీద పడెను. బయట శత్రుమండలి వారు పెరినీసు వద్ద ఫ్రెంచి సైన్యముల నోడించి వాలన్ షీను, కాండీలను స్వాధీనపర్చుకొనిరి. మైన్సు పట్టణము శత్రువుల వశ మయ్యెను.ప్యారిసులోను, 'రాష్ట్రములలోను కరపు బాధ అధిక మగుట చూచి, ఇంగ్లీషు వారు ఫ్రాన్సుకు సముద్రముమీద నాహార సామగ్రులు రాకుండుటకైట సముద రేవులను

ముట్టడించిరి, ఎటు

245

పదునారవ అధ్యాయము

గానము. చూచినను ఫ్రెంచి ప్రజా ప్రభుత్వము విపత్పరంపరలలో చిక్కి కొనియున్నది.

4


1793 రాజ్యాంగ
విధానము

అతివాదులు జాతీయసభలో ముఖ్యులైరి. ఒక నూతన రాజ్యాంగవిధానమును తయారు చేసిరి. గొప్ప కుటుంబములో పుట్టినను, సామాన్యకుటుంబములో పుట్టినను, ఆస్థి యున్నను లేకున్ననూ, విద్య యన్నను లేకు న్నను, "దేశములోని ప్రతిమనష్యుడును -ప్ర త్వములో సమాన భాగస్వామియని వీరి సిద్ధాం తము. ఇదే రూసో పండితుని మతము. ఈ సిద్ధాంతమును బట్టి యాస్థి గాని విద్యగాని యుండవలెనను నిర్బంధము లేక యం దరు పౌరులకును ఎన్నుకొను హక్కు నిచ్చిరి. ప్రతి సంవత్సరము శాసనసభను ప్రజలెన్ను కొనవలెను. ఎప్పటికప్పుడు శాసన సభ్యులు ప్రజాభిప్రాయము ననుసరించి నడుచుకొనుట కే ప్రతి సంవత్సర మెన్నికలు పెట్టిరి. ఎన్నుకొను వారు స్వయము గా శాసనసభ్యుల నెన్ను కొనెదరు. ఎన్ను కొనువారి (వోటర్ల) సంఘము లేర్పరుపబడును. ఈసంఘములవారు సంవత్సరము లోపల ఇష్టము వచ్చినపు డెల్ల సమా వేశమై శాసనసభలోని తమ ప్రతినిథులు నడుచుకొనవలసిన పద్ధతులను తీర్మానించు చుండును. వీరు తమప్రతినిధులను రాజీనామా నియ్య వలసినదని కోరిన చో శాసన సభ్యులు రాజీనామా నియ్యవలెను. వోటర్ల సం ఘముల సలహాల ననుసరించి శాసనసభ్యులు సంపూర్ణముగా నడుచుకొనవలెను. ఇది 1793 సంవత్సరపు రాజ్యాంగ విధాన

ము, నలుబదినాలుగు వేల మ్యునిసిపలు సంఘముల ప్రతినిధులు
246

ఫ్రెంచిస్వాతంత్ర్య విజయము

ప్యారిసులో సమావేశమై దీని నంగీక రించిరి. "నిరంకుశత్వ మును నిర్మూలించెదము. లేని యెడల నశించెదము,” ఆసు ప్ర 'మాణము నందరును గైకొనిరి..

దేశోపయుక్త
కార్యములు

జాతీయసభ వారు 'దేశము కష్టస్థితియం దుండగనే దేశోపయోగకరమగు పెక్కు కార్యములను చేసిరి. విద్యను, వ్యవసాయమును అభివృద్ధి చేయుటకును, నీళ్ళు నిలిచెడి ప్రదేశమ్ములోని నీళ్ళను తీయించి వ్యవసాయము సకు అర్హముగా చేయుటకును, ముసలి వారికిని, తల్లిదండ్రులు లేని పిల్లలకును సహాయము చేయుటకును తీర్మానించిరి. ఎక్కువ స్పష్టమగు నట్టియు చిక్కులు లేనట్టియు సివిల్ కోడ్డుసు, ధర్మస్మృతిని తయారు చేసిరి . నీగ్రోలను "బానిసలుగ పట్టకొనుట మానిచి వేసిరి. ఫ్రాన్సు దేశపు వలసరాజ్యము లలోని నల్లజాతులవారి కందరకును ఫ్రెంచివారితో సమానముగ పౌర సత్వపు హక్కుల నిచ్చి . నిర్బంధముగ ఉచిత ప్రారంబభ విద్యను నెలకొలిపిరి. మతవిద్యను పాఠశాలలో గరపగూడదని. ప్యారిసు పట్టణము లో మూడు వైద్య విద్యాలయములను, నొక ప్రకృతి శాస్త్రము శోధనాలయమును, నొక సంగీతవిద్యా శాలను స్థాపించిరి .


కొత్తపంచాంగము,

జూతీయసభ వారి చే మూడు నెల కొకమారు దేశ సంరక్షక సంఘ మెన్నుకొన బడు చుండెను. ఈ దేశ సంరక్షక సంఘమే యావత్తు ప్రభుత్వము యొక్కయు కార్యనిర్వాహక వర్గ మయ్యెను. జాతీయసభ

యు, దేశ సంరక్షక సంఘమును అతివాదులకు

247


పదునాఱవ అధ్యాయము


పూరిగా పూర్తిగా వశ మయ్యెను. రాబిస్పీయరు. అతివాదులలో ముఖ్యు డు. బారి, సెంటు జస్టు లీయనకు శిష్యులు. కార్నటు యుద్ధ మంత్రిగ నుండెను. వీరికి ప్రజాసమూహములలోను, క్లబ్బులలోను పలుకుబడి యుండెను. జాతీయ ప్రభుత్వమువారు క్రైస్తవ పంచాంగమును తీసి వేసి విప్లవపంచాంగము నేర్పర చిరి. పెంచి తీయప్రభుత్వ ముసకును క్రైస్తవమతమునకు నెట్టి సుబుధము లేదని తీర్మానించిరి. మొదటి సంవత్సరము ఏసుక్రీ స్తు ప్రభువు పుట్టినదినము నుండి ప్రారంభించుటకు మారుగ, ఫ్రెంచి ప్రజలు పూర్తిగా స్వతంత్యమును పొందిన ఫ్రెంచిప్ర జాస్వామ్యమే (రిపబ్లికు) ఏర్పడినప్పటినుండియు పాకంభము కావ లెనని శాసించిరి. ఇందువలస ఫ్రెంచి (రిపబ్లికు) ప్రజ స్వామ్య 'మేర్పడిన క్రీస్తుశకము 1702 వ సంవత్సరము సెప్టెంబరు 22 వ తేదీ నుండియు 'ఫ్రెంచి శకము ప్రారంభము చేయ బడినది. సంవత్సరము ముప్పది దినములుగల పండ్రెండు నెలలుగా భాగించబడును. "నెలలకు జనవరి మొదలగు క్రైస్తవనామ మటను తీసి వేసి క్రొత్త నామముల నిచ్చిరి. మూడు వందల అరువది రోజులకు పైగ నుస్ను అయిదు రోజులను జాతీయ పండుగలుగ నేర్పరచబడెను. ఒక దినము ప్రతిభ (బుద్ధి సూక్ష్మత)యొక్క పండుగ. రెండాదినము కాయ కష్టము యొక్క పండుగ. మూడవ దినము సత్కర్మలయొక్క పండగ. నాలుగవ దినము ఫలముల ననుభ వించుటేఅను గూర్చిన (సత్కర్మలు చేసిన మంచి ఫలముల ననుభవించుట) పండగ. అయిదవ దినము ఉత్కృష్టమైన భావముల పండుగ. ఈ అయిదు

పండుగలను ప్రెంచి
248

ఫ్రెంచి స్వాతంత్ర్య విజయము

జాతి సలుప వలసిన జాతీయపండుగలని శాసించబడెను. ప్రతి నెలకును మూడు వారములుండును. వారము నకు పదిరోజులుం డును. పదియవదినము విశ్రాంతి దినము. ఆదినమున కచ్చే రీలును దుకాణములును మూయబడును. వారములోని దిన ముల పేర్లు కూడ మార్చుబను.

యుద్ధముకై
సంసిద్ధమగుట,

శత్రుమండలిగా నేర్పడిన యూరపు రాజుల పైకి తగిన సైన్యములను బంపుటకు దేశ సంరక్షక సంఘము వారు గట్టి ప్రయత్నములను చేసిరి, “ప్రతి పౌరుడును తా సనుభవించదలచిన స్వతంతరము యొక్క రుణ మును తీర్చుకొనవలసి -యున్నాడు. స్వతంత్ర మును సంరక్షించుటకు దేశములోని వయస్సు యొక్క విచక్షత లేకుండ స్త్రీ పురుషులందరును కృషిసలుప వలెను. యువకులు యుద్ధములో పోరాడుటకు బోవలెను. వివాహితులైన పురుషులు ఆయుధములు తయారు చేయుట ను, ఫిరంగులను సామానులను ఒక చోటునుండి మరియెక చోటికి చేర్చుటలోను తోడ్పడివలెను. మరియు నాహార సామగ్రులను తయారు చేయవలెను. స్త్రీలు డేరాలను సైనిక దుస్తులను తయారు చేయవలెమ. కొందరు స్త్రీలు గాయ ములు తగిలిన వారికి చికిత్సలు చేయవలెను. పిల్లలుగూడ దూది మొదలయినవి తీయవలెను, వృద్ధులైన వారు బహిరంగ స్థలముల లోనికి తీసికొనిపోబడి రాజులయందు ద్వేషమును, ప్రజా స్వామ్య ముసం దాసక్తిని బోధించి పడుచు వారిని సైనికులుగా

చేరునట్లు పురికొల్పవలెను. ప్రతివారి యుద్దనున్న ఆయుధములను

249

పదు నాఱవ అధ్యాయము

గుఱ్ఱములను బండ్లను సమర్పింపవలెను. ఫ్రెంచి దేశ మంతయు, నవరసములను బట్టి యొక సైనిక ప్రదేశముగా భావిం చపలెను,” అని ప్రచురించిరి. ఫ్రాన్సు దేశములోని పదునెనిమిది ఇరువదియైదు సంవత్సరముల మధ్య వయస్సుగల యువకు లందురును మాతృదేశము యొక్క సంరక్షణకొరకు చెప్పనలవి గాని యుత్సాహముతో సైన్యములోచేరి యాయుధములను ధరించిరి.. యుద్ధసామగ్రులను, అహర సామగ)లను దుస్తులు మొదలగువానిని ఫ్రెంచి స్త్రీలు , పురుషులు తయారు చేసిరి.. అతి శీగ్ర కాలములో పండ్రెండు లక్షల మంది ఫ్రెంచి సైనికులు పదునాలుగు సేనలుగు విభజించబడి, దేశ రక్షణదీక్ష పరులగు సేనానులక్రింద ఫ్రాన్సుయొక్క యన్ని వైపుల సరిహద్దు లకు బయలు దేరి వెళ్లిరి.


మొదటి సంపుటము సమా ప్తము