ఫ్రెంచి స్వాతంత్ర్యవిజయము/మొదటి అధ్యాయము

వికీసోర్స్ నుండి


ప్రెంచిస్వాతంత్ర్యవిజయము


మొదటి అధ్యాయము

ఫ్రాన్సు దేశ మను పేరు


ఉపోద్ఘాతము

ప్రస్తుత కాలమున మానవ సంఘములను మహత్కార్యములకు పురికొలుపుచున్న భావములలో ముఖ్య నగునవి మూడు. మొదటిది జూతీయ భావము, ప్రతి దేశములోని ప్రజలందరును వారిలో వారి కెన్ని 'భేదములున్నను - ఓకే జాతీయనియు, ప్రతి జాతియుతన యదృష్టమును తనయభివృద్ధిని తన బాగోగులను తానే నిర్ణయించుకొనవ లేననియు నేను భావము. ఇది మొదటిది. రెండవది ప్రజాపాలనము. ప్రతి దేశములోని ప్రజలును. అదే శమును పరిపాలించుకొనుటకు హక్కు దారులనియు, ఆప్రజల యిష్టము లేనిది వారిపై రాజ్యాధికారము చలాయించుట కెవ రికిని హక్కు లేదనియు రెండవ భావము. మూడవది మానవ

సమానత్వము. మానవులందరును పుట్టుక వలన సమానులని
2.

ప్రెంచి స్వాతంత్ర్య విజయము

యు, రంగువలనగాని, కులమువలసగాని, ధనమువలని గాని, వృత్తివలన గాని, మతమువలన గాని ఎవరును తక్కినవారికన్న, నధికులు కాజూలరనియు, సమర్థత, యోగ్యతలు మాత్రమే గౌరవార్హమయినవనీయు నను భావము మూడవది. నూట ఏబది యేండ్ల కిందట ప్రపంచము నిరంకుశత్వములోను స్వార్థ పరత్వములోను, మతదుస్సహసములోను మగ్నమై యుండిన పుడు ఫ్రాన్సు దేశము పైమూడు భావములను లోకమునకు ప్రసాదించి వాని స్థాపనకొరకై గొప్ప త్యాగములు చేసినది . ప్రాస్సు దేశమునుండియే ఈ భావములు ఇతర దేశములకు వ్యా పించి యిపుడు మానవకోటిని ఉద్రేకించుచున్న ప్రథాసభావ ములుగ నిలచినవి. ప్రయత్నములు చేయుటలోను, కార్యా చరణలో 'బెట్టుటలోను పరాసు దేశీ యు లనేక పొర బాటులు, తప్పులు చేసిరనుట నిర్వివాదాంశము. వానిని సవరించుకొను టకు గూడ ప్రయత్నించిరి. తప్పులు చేసినపుడు . సత్రములను, సవరించుకొనినపుడు అభివృద్ధిని, సౌఖ్య మును పొంది. ఉదార భావములచే ప్రేరేపింపబడి, కష్టపరంపర లను 'ధైర్యముతో నెదుర్కొని, మహత్కార్యములను సాధించినయొక జాతి యొక్క అనుభవము లిందు కొంతవరకు విశదపరచబడినవి.

గాలు దేశము,

ఫ్రాన్సు దేశ మునకు పూర్వకాలము 'గాలు దేశ, మని పేరుండెను. పశ్చిమము నను ఉత్తరము నను అట్లాంటికు మహాసముద్రము, దక్షిణ మున మధ్యధరా సముద్రము, నైరుతిమూల పెరినీసు

కొండలు, ఇవి ఫ్రాన్సు దేశమునకు నైసర్గికమగు ఎల్లలు. పూర్వ

మొదటి అధ్యాయము

'కాలమున 'గాలు దేశము' తూర్పుదిక్కున రైనునదివరకును అల్బ్సుపర్వతములపరకును వ్యాపించి ఇప్పటి ఫ్రాన్సుకన్న నయి 'దవవంతు పెద్దదిగ నుండెను. ఇటుతరువాత తూర్పున కొంత దేశమును ప్రాన్సు పోగొట్టుకొనినది. ఫ్రాన్సు దేశము తక్కిన యూరవుఖండములోని దేశములవలెనే సవీనముగ వృద్ధి జెంది సది. కాని హిందూ దేశము, ఈజిప్టు, చైనా, అరేబియా దేశ ములవలె ప్రాచీన నాగరిక తగలది కాదు. క్రీస్తుశక ప్రారంభమున హిందూదేశము ప్రపంచక ములో కెల్ల మిగుల నుత్కృష్టనుగు నాగరికతచే విరాజిల్లుచుం డెను. ఆ కాలమున “గాలు దేశము”న స్వల్పసొగరిక తగల నాలుగువందల జూతులు నివసించి యొకరి తో నొకరు కలహించుచుండిరి. పారి గురువులకు డ్రూయిడులని , పేరు. వారు తమ దేవతలకు సాధారణముగ నరబలు నిచ్చు చుండిరి. మతగురువుల సలహాతోడ రాజులు పాలించుచుండిరి. రాజుల కింద ప్రభువు లను జూతియుండెను. దేశ మంతఃకలహ ములకును రక్తపాతమునకు లోనై యుండెను. వ్యవసాయము కొంతవరకును, బట్టలు నేయుటయు, రంగులు వేయుటయు కొన్ని లోహములు వాడుటయు “ గాలు" దేశీయులకు తెలి యును. వ్రాత వాయుట తెలియదు. శత్రువులతో పోరాడి వారినోడించి పట్టుకొనినవుడు వారీ శిరములను ఖండించి యిం డ్లకు తీసికొనిపోవుదురు. గొప్పవాడైన శత్రువు యొక్క తల దొరికినచో దానిని నూనెలో వేసి దాచియుంచెదరు. "గాలు” లోని గొప్పవాడు మరణించినచో ఆతడు ప్రేమించిన జంతువు లను నౌకరులను ఆతనితో గూడ పాతి పెట్టెదరు. ప్రతివురుషు

4

ప్రెంచిస్వాతంత్ర్యవిజయము


నికిని తన భార్యను పిల్లలను చంపుటకుగూడ హక్కుగలదు. గాలు దేశీయులు మిగుల ధైర్యశాలు ఆ గుఱములమీద తండా లుగా వెళ్ళి పక్కనున్న దేశములను దోచుకొని వచ్చుచుం డివారు. ఒక్కొ కప్పుడు మీకు నూతన ప్రదేశముల నాక్రమించి యచట నివసించుచుండెడివారు. ఆ కాలమున నింగ్లాండు దేశము గాలు దేశము న కన్నగూడ మిగుల మోటుస్థితి ముందును హీన స్థితి యందును నుండెను.

రోమనులు జయించుట


సోమకలా ఇట్టి స్థితిలో, గాలులున్నపుడు క్రీస్తుకు పూర్వము 125 రోమసులు సంవత్సరము మొదలు 50 సంవత్సరము వరకును గాలు పై రోమనులు దండెత్తిరి. రోమక సామ్రా జ్యమునకు "ఇటలీ దేశములోని "రోము”ముఖ్య పట్టణము. అప్పుడు రోమక రాజ్యము యూరపు ఖండములో ప్రసిద్ధి కెక్కియున్నది. రోమక రాజ్యము యొక్క సర్వసేనాధి పతియగు జూలియసుసీజరు గాలు దేశమును జయించుట కేడు సారులు దండయాత్రలు సలిపెను. రోమనులకును గాలులకును ఘోర యుద్ధములు జరిగెను. తుదకు గాలు దేశ మంతయు రోమను లచే జయించబడినది. గాలు దేశము రోమనుల పాలనము క్రింద క్రీస్తు' తరువాత 395 సంవత్సరము వరకును నుండెను. ఆ దేశమును రోమను ప్రభువులు పదునేడు రాష్ట్రములుగను నూటయిరువది పట్టణములుగను విభ వించిరి. పట్టణములలో మ్యునిసిపాలిటీలను నెలకొలిపిరి. పాకశాలలను స్థాపించి కళలను చేతిపనులను వాణిజ్యమును కొంతవరకు ప్రోత్సహించిరి.

గొప్ప అందమైన కట్టడములను నిర్మించిరి. రోమనులు నాగరికు

మొదటి ఆధ్యాయము

5

మనము అణచుట, గాలుల లుగావున కొంతవరకు గాలు దేశములోని ప్రజలకును నాగరిక తను నేర్పిరి. రోమనుల భాషయగు లాటినును పాఠశాలలలో నేర్పిరి. లాటీను భాపలో పండితులు కవులు చరిత్ర కారులు వక్తలు గాలులనుండీ బరులు దేరిరి.రోమనుల ఆచార వ్యవహారములను గాలులు నేర్చుకొనిరి.

మతమునణుచుట

కాని రోమములు గాలుల మతము నణచి వేసి తమ మతమును వ్యాపించుటకు యత్నించిరి. రోమ కచక్రవర్తులు గాలుల మతగురువులగు డ్రూయియిడులను మతబోధ చేయగూడదని శాసించిరి. డ్రూ యిడుల మతము సవలంబంచువారికి మగణశిక్ష విధించెదమని కూడ శాసించిరి. డ్రూయియిడు మతస్థులకు ఘోర శిక్షలు విధించి అమత మును రూపుమా ఫుటకు యత్నించిరి. ఇంతలో క్రైస్తవ మత బోధ గాలులో కూడ బయలు దేరెను. రోమక చ క పగులప్పటికి క్రైస్తవులు గారు. 'క్రైస్తవమతమును స్వీకరించిన వారికి ఘోర శిక్షలు విధించుచుండిరి. క్రీస్తుశకము 177 సంవత్సరమున లయన్సు పట్టణములోని నలుబది యెనిమిది మంది క్రైస్తవులను సింహముల కాహారముగ సర్పించిరి. ఒక స్త్రీని శిశువుతో కూడ నురిదీసిరి. ఇంతటితో క్రైస్వ మతబోధ ఆగెను. " తిరిగి క్రీస్తు శకము 250 వ సంవత్సరమున నేడుగురు మతాచార్యులు గాలులో క్రైస్తనమతబోధను ప్రారంభించిరి. వీటి నందరను రోమక ఉద్యోగస్థులు ఘోరహత్యలపాలు చేసిరి. ఒకరిని ఆంబోతు చేత చంపించిరి, కొందరిని బావులలో పడదోసిరి.

మరి యొకరిని ఎఱ్ఱగా కాలిన యినుపగొలుసులచే జంధించి,
6

ప్రెంచిస్వాతం త్య విజయము

.


తాత్కాలికముగా క్రైస్తవ బోధ యణచి వేయబడినది. పవిత్రమయిన క్రైస్తవమతబోధ నిర్బంధములచే చిరకాల, మణచివేయుట దుస్సాధ్యమయ్యెను.

మత సహనము లేకుండుట

తుదకు క్రీస్తుశకము 330 వ సంవత్సరమున రోమక చక్రవర్తి యగు కాంస్టాంటైన్ క్రైస్తవమత మును స్వీకరించెను. దీనితో క్రస్తవమత మునకు గొప్పు రాజ పోషణము కలిగెను. కాని క్రైస్తవమత మును స్వీక రించక పూర్వము రోమక రాజులే దుష్ట శాసనములచే క్రైస్తవమతము నణచయత్నించిరో ఆదుష్టశాసనములవలన నె క్రైస్తవ నుతమును స్వీకరించిన రోమక రాజులు క్రైస్తవ మతముకాని యితర మతములను నాశనము చేయయత్నించిరి. క్రీస్తుశ కము 386వ సంవత్సరమున థియోరోసియను చక్రవర్తి తనరాజ్యములో క్రైస్తవమతముతప్ప నేయితరమతము నవ లంబించినను యజ్నములు చేసినను మరణశిక్ష విధించబడు శాసించెను. రోములో చిరకాలమునుండి యారాధించబడు చున్న దేవతలయా రాధనను బలపంతముగా నాపు చేయించెను. రోమక రాజ్యములోని క్రైస్తవులు కాని వారి సుందరమగు దేవాలయములన్నియు పడగొట్టించి యాచలువ రాళ్ళతో క్రైస్తవ దేవాలనుములను నిర్మించెను. కొన్ని దేవాలయములలోని విగ్రహములను పీకీ వైచి వానిలో క్రైస్తవారాధసను నెలకొల్పెను. ఇతర మతస్తులు వ్రాసిన కవిత్వము, చరిత్రలు, తత్వ శాస్త్రము, మొదలగు గ్రంథములను క్రైస్తవ చక్రవర్తి నాశ

నము చేయించెను.

మొదటి అద్యాయము

ఫాస్కులు,

రోమకసామ్రాజ్యము కిందనుండి గాలులు కొంత నాగరికతను నేర్చుకొనిరి. కానీ తమస్వతం త్రశక్తిని ధైర్యసాహసములను గోల్పోయిరి. రోమక చక్రవర్తులు గాలులను తుపాకి, కత్తి మొదలగు ఆయుధములను ధరించగూడదని ఆయుదచట్టము నొక దానిని చేసిరి. తమ మీద తిరగబడి గాలులు తిరిగి స్వతంత్రమును పొందకుండ నుండుటకై ఇట్టి శాసనము చేయబడెను. నాలు గవ శతాబ్దములో రోమను రాజ్యము మిగుల బలహీనమై ఆ నాగరికులగు జర్మను జాతులచే ముట్టడించబడి ఇటలీ దేశమునే రక్షించు కొన లేని స్థితియఁ దుండెను. గాలు మొదలగు రాష్ట్ర ములకు తగిన సంరక్షణ నీయ లేక పోయెను. అప్పుడు గాలు మీదికి జర్మను జాతులగు ప్రాన్కులు దండెత్తుచు దోచుకొను చుండిరి. ఇంతలో కాన్ స్ట్రాటిన్" చక్రవర్తి. ఫ్రాన్కుల నోడించి కొంతవరకు గాలులను సంరక్షించెను.

ప్రాస్కుల రాజ్య స్థాపన

కాని కొలది వత్సరములలోపలనే రోమక రాజ్యము నలు వైపులనుండియు ననాగరికులగుజాతులచే దండెత్తబడి విచ్ఛిన్నము చేయబడినది. గాలుమొదలగు రాష్ట్రము లలోని సైన్యములను ఉద్యోగస్తులను రోమకు పిలిపించుకొనిరి. రోమక 'రాజ్యముచే చేయబడిన ఆయుధ చట్టమువలన నాలుగువందల సంవత్సరములు ఆయుధములు ధరించుటకు వీలు లేక , గాలులు స్వసంరక్షణ చేసికొనజూలని నిస్సహాయ స్థితియందుండిరి.

రోమనులు దేశమును వదలగనే గాలు దేశము పైకి పాస్కులరాజగు
8

ప్రెంచి స్వాతంత్ర్య విజయము


క్లోవిసు దండెత్తి దేశము సంతను నాక్రమించుకొనెను. ఈయన క్రైస్తవమతమును స్వీకరించెను. ఫాన్కులు గాలును జయించి ఆక్రమించుకొనుటవలన గాలునకు ఇంతటినుండియు ప్రాస్సు, దేశమని పేరు వచ్చెను.

మేయర్లు

మరణించిన తరువాత సాన్కుల రాజ్యవై భవము .క్షీణించెను. నూరు సంపత్సరముల వరకును రాజకుటుంబము అంతఃకలహములతోను చెప్పవలనిగాని కల్లోలములతోను నిండియుండెను.. క్లోవిసు యొక్క వంశమువారు ఆయన సామర్ధ్యమును కలిగి యుండినందున కొలది కాలములోనే పలుకుబడిని పోగొట్టుకొనిరి. వీరి తాబేదార్లగు మేయుర్సు ఆప్ ది పాలస్, రాజసగర పాలకులను ఉగ్యోగస్థలు క్రమముగా రాజ్యాధికారమును చలాయించసాగిరి. వీరి ప్రమేయమున రాజనగరుకు 'సంబందించిన ఉద్యోగస్తులు. రాజులు బలహీను లైన కొలదియు వీరు బలపంతులై రాజుల పేర యావత్తు ఆధకారమును చలాయిం చుచువచ్చిరి. శివాజి చత్రపతి యొక్కవంశీకుల పేర పేష్వాలు మహారాష్ట్ర సామ్రాజ్యము నేలినటుల ఫ్రాన్సు దేశమును రాజుల పేర మేయర్లు పరిపాలించిరి. రాజుల హక్కులు వంశ పారం పర్యముగ నున్నటులే ఈ మేయర్ల హక్కు లుగూడ వంశ పారంపర్యముగ స్థిరపడినవి. ఈ యుద్యోగమునకు 687 వ సంవత్సరమున పిప్పిన్ అనునాయన వచ్చెను. ఈయన బహు సమర్థుడు. ఈయన రైను నదీ ప్రాంతముననున్న ఫ్రాన్కులను

జయించి రాజ్యమును విస్తరింపజేసెను. పిప్పిన్ చనిపోయిన తరు

మొదటి ఆధ్యాయము

వాత ఆయన అధికారము కుమారుడగు ఛార్లెసు మార్టిలుకు సంక్రమించెను. నామమా త్రావశిష్టుడగు రాజు పేర ఛార్లెసు 'మార్టిలు యావత్తు రాజ్యాధి కారమును వహించి మిగుల సుప్ర సిద్ధుడై , ఫ్రాన్సు దేశపు సరిహద్దులను రైసునదికి తూర్పున గొంతదూరమువరకు విస్తరింప జేయుటయే గాక తన రాజ్యము లోని ప్రభువులనుసామంతరాజులను అణచిరాజు యొక్క అధికారమును బలపరచెను.. క్రైస్తవమతమునకును రోము లోని క్రైస్తవ ప్రధానమతాచార్యునికిని (పోపుకును); చేయూత నొసగెను.

మహమ్మదీయులతో యుద్ధము

732 వ సంవత్సరమున చార్లెసు మార్టెలు మహ మ్మదీయులను టూర్సు యుద్ధములో నోడించెను. మహమ్మదీయులు 640 వ సంవత్సరమున ఈజిప్టును జయించిరి.. ఈ సంవత్సరమున కార్తెజుని స్వాధీన మును పొంది ఉత్తర ఆప్రికానంతను ఆక్రమించుకొనిరి. 711 వ సంవత్సరమున స్పెయిన్ . దేశ ముసు జయించి రాజ్యమును స్థాపిం చి యుండిరి. కొలది కాలములో పెరినీసు పర్వతములను దాటి ఫ్రాన్సులో ప్రవేసించి కొన్ని పట్టణముల స్వాధీనమును పొం దిరి. ఇంద్దు మీద క్రైస్తవ పంచములో సంక్షోభము జనిం చెన. మహమ్మదీయలు ఫ్రాన్సును జయించి క్రైస్తవ నాగ రికతను నాశనము చేయుదురను భయము. పుట్టెను. ఫ్రాన్సులోని ఆక్విటైన్ మండలములో మహమ్మదీయులు ప్రవేశించగ ఆమం డల ప్రభువు పారిపోయెను. అంతే ముసల్మానులు లాయిరు నదీ

ప్రాంతము నాక్రమించిరి. ఆమండల ప్రభువు ఛార్లెసుమార్టిలు
10

'ఫ్రెంచి స్వాతంత్ర్య విజయము

యొక్క. సహాయము కోరగ నాయన ఫ్రాన్కుల సైన్యము లను 783 వ సంవత్సరమున ముసల్మానుల పైకి నడపెను. టూర్పువద్ద క్రైస్తవ సేసలుసు ముసల్మాను సేనలను తారసిల్లెను : దినమంతయు యుద్ధము బహు తీవ్రముగా జరిగెను. ఉభయు పక్షముల వారును మతావేశముతో పోరాడిరి. కానీ ముస ల్మానుల కెక్కువ నష్టము కలిగినఁదుస ఆ రాత్రి ముసల్మానులు యుద్ధభూమి విడిచి వెనకకు మరలిపోయిరి. ఛార్లెసు మార్టలు వారిని వెంబడించి వారు స్వాదీనము పొందిన ప్రతిపట్టణమును తిరిగి స్వాదీనము పొంది ఈ ప్రాన్సు యొక్క నైరుతి సరిహద్దగు పెరిన్నీ పర్వతములవరకును "దేశమంతను తిరిగి జయించెను. మహమ్మదీయులు పెరిన్నీసు కొండలు దాటి తిరిగి స్పెయిను లో ప్రవేశించిరి. ఈ విధముగా , కార్లెసుమార్టెలు ఫ్రాన్సు దేశము ను కాపాడెను. 741 న సంవత్సరమున ఆయన చనిపోయెను. ఆయన కుమారులగు కాల్లిమాన్, పిప్పిర్లు ఫాన్సను పంచుకొనిరి. ఫాన్సయొక్క ఐఖ్యత చెడునట్లు కనబడెను. కొలది కాలములో కార్లో మాను తన భాగమును త్యజించి తన ఆత్మాభవృద్ధి కొరకైక్రైస్తవమత ప్రవేశము చేసెను. 747 వ సంవత్సరము నుండియు పిప్పిన్ ఒకడే యావత్తు దేశముయెక్క రాజ్యాధికారమును చలాయించెను.


మేయర్లు రాజులగుట

రోములో నున్న క్రైస్తవ ప్రధాన మతాచార్యులగు పోపుకు పిప్పీన్ చాల సహాయము చేయుచుండెను. పిప్సిన్ పది సంవత్సరముల కాలము మేయ

రుగ దేశమును పాలించెను.ఇంతలో నితనికి తానే రాజు

మొదటి అధ్యాయము

11

కాగూడదను ఆశపుట్టెను. తాను రాజు కాగలడు. అడ్డము వచ్చు వారు లేరు. కాని రాజు యొక్క బిరుదము ఒక విధమగు 'ప్రత్యేక గౌరవముగ చూడబడుచు వచ్చినది. అందువలన క్రై స్తవ ప్రధానమతాచార్యుని అనుజ్ఞను పొందనెంచెను. తాను రాజ బిరుదమును ధరింతునాయని సలహా నడిగెను. ' ప్రధాన మతాచార్యుడు నిజమైన అధికారము చలాయించువాడే రాజు గాన పిప్పిన్ రాజబిరుదము ధరించుట న్యాయ మేనని చెప్పె ను. మెటనే రాజగు మూడవ పిల్టరిక్కును తీసి వేసి క్రైస్తవ మతములో ప్రవేశ పెట్టి పిప్పిన్ రాజుగా పట్టాభిషిక్తుడయ్యెను. రెండుసంవత్సరముల తరువాత పోపు స్వయముగా పారిసుకు వచ్చి పిప్పిన్ కు తేనహస్తములతో కిరీటధారణగావించెను. పిప్పీన్ వంశమువారు అడ్డు లేకుండ ఫ్రాన్సునకు రాజులుగ పాలించిరి. 768 సంవత్సరమున పప్పిన్ చనిపోయెను.