ఫ్రెంచి స్వాతంత్ర్యవిజయము/రెండవ అధ్యాయము

వికీసోర్స్ నుండి

ప్రెంచిస్వాతంత్ర్యవిజయము


రెండవ అధ్యాయము

సార్ల మేను చక్రవర్తి

షార్ల మేను చక్రవర్తి

షార్లమేను

ఫ్రాన్సు దేశము యొక్క పూర్వరాజులలో షార్ల మేను చక్రవర్తిక న్న సుప్రసిద్ధులు లేరు. షార్ల మేను ప్రెంచివారి కెంత ముఖ్యుడో జర్మనులకు కూడ నంతే ముఖ్యుడు. ఈయన పిప్పిన్ రాజుయొక్క కుమారుడు. పిప్పిన్ చనిపోయిన తరువాత రాజ్యభారమును వహించెను. షార్ల మేసు కూడ తక్కిన ఫ్రాస్కులవ లెనే జర్మను భాష మాట లాడువాడు, మధ్యమ యుగములో యూరఫుచరిత్రలో నీయన పాలనము మిగుల ప్రాముఖ్యతను వహించినది. తన రాజ్యములో జర్మనీని చేర్చుకొని జర్మనీ కై క్యతను కలుగ

చేసెను. ఇటలీని జయించి స్పెయినులో కొంతభాగ మాక్ర

రెండవ ఆధ్యాయము

13

03 మించెను. ఈ అన్ని దేశములలోను ఆయన చేసిన పనులు, ఏర్పరచిసవిధానములు కొన్ని తరములవరకును నిలిచినవి. ఆయన 'పండిత పోషకుడు. క్రైస్తవమతమునకు పట్టుకొమ్మ. ఆయన యొక్క గొప్పతనమునకుగాను పోపు ఆయనకు చక్రవ ర్తి యను బిరుదము నొసంగెను. ఈయన పాలనముతో యూరపు ఖండ మున ప్రాచీనయుగమంతమై రోమక రారాజ్యము పడిపోయిన తరువాత నేర్పడిన అరాజక మంతరించి నూతనశకము ప్రారంభ మయినది.


శాంతిస్థాపన,

ప్రతి గొప్ప రాజ్యమును బలవంతమయినదై తనయేలు బడిలోని ప్రజలలో కట్టుదిట్టముల నేర్పరచి శాంతిని స్థాపించును. శాంతి స్థాపన రాజ్యము సాగుటకు మిక్కిలి ఆవశ్యకము. అరాజకములో ఏరాజు యొక్క.. పాలనమును సాగదు. పన్నులు వసూలగుటకును రాజ్యలాభము ను పొందుటకును వీలుండదు. ఎల్లప్పుడును అరాజకుల వలనసు బందిపోటు దొంగలవలనను ప్రభుత్వపు బొక్కసము లకును ప్రభుత్వోద్యోగులకును భయముండును. కావున శాంతిసాపనము, ప్రజలకన్న నెక్కుడుగ ప్రభుత్వముల కావశ్య కము. ప్రతి గొప్ప రాజ్యమును తాను స్థిరముగ నిలుచుట కై ముందుగ శాంతిస్థాసనను చేయును. కాని ఆ రాజ్యము పడిపో గనే కొంత కాలము కట్టుదిట్టములన్నియు పోయి దేశములో నరాజకము ప్రబలును. హిందూ దేశమును 1526 మొదలు 1707 వరకును మొగలాయి చక వర్తులు రాజ్యము చేసి మిగుల

నాగరికమైన కట్టుదిట్టములను చేసి శాంతిని స్థాపించిరి. ఒంట
14

ప్రెంచి స్వాతంత్ర్య విజయము

రిగా ఎంత సొమ్ముతో ప్రయాణము చేసినను అపాయము లేనంత నిర్భయముగ నుండును. విదేశీయులు హిందూ దేశము పై దం డెత్తుటకు వెఱచిరి, ఆకాలమున హిందూదేశము లోకములో కెల్ల నగ్రస్థానము వహించినది. యూరపు ఖండవాసుల నిచటి కాకర్షించినది. 1707 సంవత్సరమున 'మొగలాయి రాజ్య మస్తమించెను. వెంటనే హిందూ దేశములో కొంత కాల మరాజకము ప్రబలెను. ఈ అరాజక కాలములో ప్రెం చివారును ఇంగ్లీషు వారును స్వదేశ రాజుల అంతఃకలహములలో ప్రవేశించి తమరాజ్యమును స్థాపించుటకు పోటీగ కృషి సలిపిరి. కాని ప్రెంచివారి సంకల్పము విఫలమై ఆంగ్లేయులు సొమా జ్యమును స్థాపించిరి. తమరాజ్య స్థిరతకొరకు కొన్ని కట్టుదిట్ట ములను చేసి అరాజకమును పోగొట్టి శాంతిస్థాపనము చేసిరి. అటులనే రోమక రాజ్యము కొన్ని శత్వాములు యూరపులో సాగరికతకు శాంతికి కట్టుదిట్టములకు తోడ్పడినది. అది అయి దవశతాబ్దములో కూలిపోయినది. మూడువందల సంవత్సర ములకాలము యరపుఖండమంతయు అరాజకముగమ అశాం తిగను ధర్మము, న్యాయము లేక బలవంతులదే హక్కుగను ఉండి వివిధ జాతుల పోరాటములలో మునిగియుండెను. తుదకు 770 వ సంవత్సమున బలవంతుడగు షార్లమేను రాజు బయలు దేరి ఫొస్సు, జర్మనీ, ఇటలీ, స్పెయిను దేశ ములను లోబరచు కొని శాంతిస్థాపన చేసెను. ఈయన ఏర్పరచిన పద్ధతులు కొంత కాలము బాగుగాసాగి ఈయన మరణించగానే తిరిగి అరాజక

మేర్పడెను.

రెండడ అధ్యాయము

15


ఆరాజకమునకు
సిద్దౌషదము

నిరంకుశ రాజ్యముల రహస్య మేమనగా పాలకులు బల వంతులుగ నున్నంత కాలము మాత్రమే సాగును.. వారి బలము క్షీణించగనే రాజ్యము కూలిపోయి అరాజక మేర్పడును. కాని దేశములోని ప్రజ లలో జాతీయ భావ మేర్పడి ప్రజాపాలన ముండినచో దేశము లోని నిరంకుశ రాజ్యములు పుట్టుటయు, కూలిపోవుటయు, తిరిగి అరాజకము ప్రబలుటయు తటస్థించ నేరదు. ప్రజా పాలన మే అరాజకము రాకుండుటకు సిద్దౌషదము. శాశ్వత శాంతికి పునాదియగు ప్రజా పాలనముకొర కే ప్రస్తుత ప్రపంచము పరిత పించు చున్నది.

షార్లమేను
జయములు

షార్ల మేను అజాను బాహువు, కడు 'ధైర్యశాలి.గుఱ్ఱపు సవారి చేయుటలోను, వేటాడుటలోను మిగుల నేర్పరి. తినుటలోను, త్రాగుట లోను మితమైన అలవాటులు గలవాడు. అనేక భాషలు నేర్చినవాడు. పండితపోషకుడు. ఉదారస్వభావుడు, రాజ్యమును బాగు చేయుటకు దీక్షవహించిన వాడు. ఆయన అనేక ప్రదేశములను జయించి కీర్తివడ సెను. ఫ్రాన్సు దేశ స్వతంత్రముగ నుండిన అక్విటైనును. తన రాజ్యములో కలుపుకొ నెను. పిదప స్పెయిన్ దేశములోని మహమ్మదీయుల పై దండెత్తి కొన్ని జయములను బడసెను. స్పెయిన్ లోని మహమ్మ దీయులలో కలిగిన అంతఃకలహముల యవకాశమును తీసి కొని షార్ల మేను రాజు పెరిన్నీసు పర్వతములను దాటి స్పెయిన్

ప్రవేశించి 797 వ సంవత్సరమున వార్సిలోనా పట్టణమును
16

ఫ్రెంచి స్వాతంత్యవిజయము

ఆచుట్టు ప్రాంతమును జయించి యచట క్రైస్తవరాజ్యమును స్థిరముగ స్థాపించెను. ఈ ప్రాంతమునుండి క్రైస్తవులు మహమ్మ దీయులను ముట్టడించుచు తుదకు చాల కాలమయిన తరువాత స్పెయిన్ నుండి మహమ్మదీయులను వెడల గొట్ట గలిగిరి. తారువాత షార్ల మేనురాజు శాక్సనీపై దాడి వెడలెను. శాక్సనీ ప్రజలు క్రైస్తవమతమును స్వీకరించ లేదు. క్రైస్తవ మతబోధకులను వారి సహాయముగ వెళ్ళిన క్రైస్తవ సేనలను వెడలగొట్టిరి.తమ స్వమతమును దీక్షగా నవలంబించి యుండిరి. అట్టి శాక్సను ప్రజల పై షార్ల మేను దండెత్తి ప్రధమమున వారిచే నోడింప బడెను. ఉభయుల మధ్యను తీవ్రమగు పోరు జరిగెను, షార్ల మేసు జయమొందెను. వారి నాయకుడగు విడుకిండు చే బలవంతముగ క్రైస్తవమత స్వీకారమును చేయించెను. కొల దికాలములో శాక్సనులు మరల తీరుగబాటు చేసిరి. షార్ల మేను తిరుగ బాటును మిగుల క్రూరముగ నణచి నాలుగు వే లమంది తీరుగుబాటుదార్లను శిర చ్ఛేదము గావించెను. శాక్స నీలో కత్తి బట్టి బలవంతముగ ప్రజలను క్రైస్తవులుగా గావించె ను.. ఆ రాష్ట్రము నందంతట క్రైస్తవ మందిరములను నిర్మించె సు. ఈ విధముగా కఠినమగు పద్ధతులతో ప్రాన్కుల రాజ్య మును క్రైస్తవమతమును శాశ్వతముగ శాక్సినీలో స్థాపించెను. అటుతరువాత షార్ల మేను రాజు బవేరియా రాష్ట్రమును, యా వత్తు జర్మము దేశమును, అటు పైన - హమియా దేశమును జయించెను. అక్కడనుండి ఇపుడు ఆస్ట్రియూ హంగెరీయని పిలువ బడు దేశమునంతను అపుడచట నివసించియున్న అవారులను

'

రెండవ అధ్యాయము

17

. పోపునకు జూతులనుండి జయించి, అవారుల ముఖ్య నాయకులను క్రైస్తవ మతమును స్వీకరించునటుల చే సెను.


పోపునకు సహాయము

పోపు (రోములోని క్రైస్తవ ప్రథాసమతాచార్యు) నకను ఇటలీలోని లంబార్డి రాజునకును విరోదము ప్రబలియుండెను. పోపు షార్ల మేను యొక్క సహాయ మపేక్షింపగ 773 వ సంవత్సరమున షార్లమేను ఇటలీ పై దండెత్తి లంబార్డినంతను జయించి , తన రాజ్యములో కలుపుకొనెను. 797 వ సంవత్సరమున చనిపో న పోపు యొక్క బంధువులకును కొత్తగావచ్చిన పోపు మూడవలియోకును కలహములు కలిగి వారు పోపు లియోను ముట్టడించి పోపు యొక్క, ఒక కన్ను పొడిచి వైచి ఆయనను ఖయిదు చేసిరి. కాని పోపులియో తప్పంచుకొని పారిపోయి షార్ల మేసు రాజువద్ద చేరెను. 800 వ సంవత్సరమున షార్ల మేను రాజు రోము పై దండెత్తి పోపు యొక్క శత్రువులను వెడలగొట్టి పోఫులియోను ప్రధాన క్రైస్తవపీఠ మలంకరింప జేసెను, పోపు షార్ల మేసుకు మిగుల కృతజ్ఞుడై యుండెను.


షార్లమేను చక్రవర్తి యగుట

800 వ సంవత్సరము క్రిస్టమసు పండుగనాడు రోము లోని సెంటుపీటర్సు దేవాలయమునకు పార్ల మేను 'రాజు వెళ్ళెను. క్రైస్తవ ప్రార్థన లయిన తరువాత పోవు మూడనలియో లేచి వెళ్లి షార్ల మేను తల పైన కిరీటమునుంచి యాశీర్వదించి చక్రవర్తి యను బిరుదము నిచ్చెను. రోమక సామాజ్యము పడిపోయిన తరువాత యూరపుఖండమున చక్రవర్తి బిరుదాంకితులు లేరు. ఇపుడు

.

18

ప్రెంచి స్వాతంత్ర్యవిజయము

షార్ల మేను రోమునగరముననే చక్రవర్తి యయ్యెను. దీనివలన షార్ల మేను యొక్క రాజ్యమునకుగాని అధికారమునకుగాని గలిగిన యాధిక్యత లేదు. కానీ షార్ల మేను సంతతివారు ఈ చక్రవర్తి బిరుదము మిగుల గొప్పదని భావించి, ఇందువలన తాము యూరఫు ఖండములో లెల్ల అధి కులమని తలంచుచుం డిరి. ఈ బిరుదము కలిగియుండుటనలన తాము షార్ల మేను చక్రవర్తి యొక్క వారసులేగాక, రోమశ సామ్రాజ్య చక్ర వర్తులగు జూలియసు సీజరు, అగస్టసు, కాన్ స్టాంటైన్, మొద లగు సుప్రసిద్ధ చక్రవర్తులకును వారసులమని గర్వపడుచుం డిరి. మధ్య మయుగ చరిత్రలో సచక్రవ ర్తిత్వము చాల ప్రాము ఖ్యతను వహించెను.

రాజ్య పాలనము

షార్ల మేను చక్రవర్తి రాజ్యపాలనమునందు సమర్దుడని ప్రసిద్ధి బడసెను. తన రాజ్యము విశాలమైనది. ఆయా ప్రాంతములలోని ప్రభువులును ప్రజలును ఎపుడై నను. తిరుగబాటు చేయవచ్చును. అట్టివి జరుగకుండ చేయుటకై తాను తఱుచుగా సంచారము చేయుచుండెను. తనయుత్తరువులను అమలు జరుపుటకు రాజు ప్రతినిధుల నేర్పఱచెను. సంవత్సరమునకు రెండుసారులు-- వేసవికాలమున నొక సారియు, ఆకురాలు కాలమున నొకసా రియు — తన రాజ్యపాలనమును గూర్చి ముఖ్య విషయములలో ప్రజాభిప్రాయము కనుగొనుటకు గొప్ప సభలను సమావేశము చేయుచుండెను. ఆ సభలలో మతగురువులు వేరుగను, ప్రభువులు

వేరుగను, సామాన్య ప్రజల లోని ముఖ్యులు వేరుగను, సమా

రెండపఆద్యాయము

19

వేశమగుచు తమతమ యభిప్రాయములను 'వెలిబుచ్చుచుండిరి, ఈసమావేశములతో బాటు తన సేనలన్నిటినీ సమావేశపరచి తన బలమునుకూడ ప్రదర్శించుచుఁండెను. తరువాత ఫ్రాన్సు దేశ పు రాజులు సమావేశ పరచిన స్టేట్సు జనరలు కిది పునాది. రాజ్యమునంతను జిల్లాలుగా విభంచి జిల్లాపైన సివిలు, క్రిమి నలు, సైనిక అధికారములను చలాయించు కౌంటు (ప్రభువు) లను నియమిం చెసు పాఠశాలలను స్థాపించి విద్యావ్యాపకము చేసెను. గ్రంథకర్తలకు ప్రోత్సాహము కలుగ జేసెను. మంచి కట్టడములను కట్టించెను. రైను, డాన్యూబు నదులను కలుపు టకై గొప్ప కాలువను తవ్వించెను. ఈ గొప్ప చక్రవర్తి 814 సువత్సము జనవరి నెల 28వ తేదీని చనిపోయెను.


నార్మనులు

షార్ల మేను చనిపోయిన తరువాత ఆయనమనుమలు రా జ్యము యొక్క పంపిణీ కొరకై తమలో తాము యుద్ధములు గావించి కొనిరి. తుదకు 843వ || సం. మున వెల్డన్ వద్ద జరిగిన సంధివలన జన్మనీ యొక మనుమనికిని, ప్రాన్సు మరియొకరికిని, ఇటలీ స్విడ్జర్లాండులు మూడవవానికిని పంపకములో వచ్చెను. ఇటలీ దేశ మును పాలించువారికే చక్ర వర్తి బిరుదము చెందెను. చార్లెసు ది బాల్డు ఫ్రాన్సు దేశమునకు రాజయ్యెను. ఫ్రాన్సు దేశము చాలకాలము వరకును మిగుల బలహీనులగు రాజులచే పాలించబడెను. నార్వే మొదలగు నుత్త రదేశముల నుండి మిగుల క్రూరులగు ఓడదొంగలు పరా సురేవులకు వచ్చి దోచుకొనుచుండిరి. రాజు లేమియు చేయజూ

లకుండిరి. ప్రజలు నిస్సహాయులుగ నుండిరి. ఈయోడదొంగల
20

ప్రెంచిస్వాతంత్ర్య విజయము

బాధ క్రమముగా ఎక్కువయినది. వీరు తండోపతండములుగు ప్రాన్సు దేశములో ప్రవేశించి ప్రజలను హింసించియు దోచు- కొనియు పైరుపంటలను నాశనము చేసియు పోవుచుండిరి: వారి నెదిరించిన వారిని క్రూరముగ వధించుచుండిరి. ఈ యోడ దొంగలకు నార్మనులని పేరు. వీరికి కొంతకాలము ఫ్రెంచి రాజు లువిశేష ధనమిచ్చి పంపి వేయుచుండిరి. లంచమిచ్చిన కొలది మరల వచ్చి బాధించుచుండిరి. 885 వ సంవత్సరమున వీరు ప్రెంచి రాజధాని యగు పారిసు పట్టణమును ముట్టడించిరి

. వారి సుప్రజలును, ప్రభువులును మిగుల ధైర్యముతో పోరాడి నార్మముల నోడించి తరిమి వేసిరి. కాని ఇంతటితో నార్మసుల దండ యాత్రలాగ లేదు. ఫ్రెంచి దేశములోని ప్రభు వులందరును అమతమ కోటలను బాగు చేసికొని కొత్తకోట లనుగూడ నిర్మించవలసినదని పరాసు రాజు ఉత్తరువు చేసెను. నార్మనులనుండి దేశ సురక్షణము గావించుకొనుటకు ప్రభు పులు ప్రతి చోటను కోటలను గట్టి. తాత్కాలికముగా పరాసు ప్రభువులు నార్మనుల నోడించుచు వచ్చిరి. 112 వ సంవత్సర మున పరాసురాజు నార్మసులతో సంధి చేసికొని ఫ్రాన్సు దేశ ములోని నార్మండి రాష్ట్రమను వారికిచ్చెను. నార్మనుల దోపిడీలు ఆగిపోయెను. నార్మను ప్రభువులును నార్మను ప్రజలును ఫాస్సులో కావుగమేర్పరచుకొని ఫ్రెంచి భాషను నేర్పికొని' తక్కిన ఫ్రెంచి ప్రభువులతోను ప్రజలతోను కలసిపోయిరి. నార్మండీ రాష్ట్రము కొలదీ కాలములో మిగుల శాంతియుతమై నట్టియు భాగ్యవంత మయినట్టియు రాష్ట్ర మయ్యెను.