ప్రాణాయామము/ప్రార్థన

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search

ఓం

ప్రార్థన

ఓ అంతర్యామీ, హృదయకుహరవాసీ! దీనజన బాంధవా, అనాధరక్షకా! పతితపావనా! మా తప్పులను క్షమింపుము. మమ్ము దయజూడుము. సర్వోత్తమమైన పదవియగు శాంతినిపొందుటకు సులభమగు రాచబాటను మాకు చూపుము. నీ భక్తుడు, మిత్రుడునగు అర్జునునకిచ్చినట్టి ఆంతరికదృష్టి (దివ్యదృష్టి)ని మాకిమ్ము. ఆధ్యాత్మిక మార్గమున సుఖముగ పోవుటకై మాకు జ్ఞానజ్యోతినిమ్ము. ఈ మృత్యులోకమందలి మా లౌకిక జీవితబాధలను తేలికపరచుము.

ఓ స్తవనీయుడవగు ప్రభూ! సర్వవ్యాపకుడవగు సత్య స్వరూపుడా! దివ్యజ్యోతీ, మా అహంభావము, కామము, ఆగ్రహము, లోభము, గర్వము, దురహంకారము, మోహము, భార్యాపుత్రులు, ఆస్తి, శరీరములపైగల వ్యామోహములను తొలగించుము. మమ్ము పరిశుద్ధపరచుము. మా ప్రవర్తనను సరిచేయుము. మమ్ము పవిత్రుల నొనర్చుము. యోగమునందు జయమునుపొందుటకుగాను మా కాధ్యాత్మిక బలము నిమ్ము.

హరి ఓం తత్ సత్ ఓం శాంతి:

_______