ప్రబోధ తరంగాలు/731-757

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search

ఇటు ఆత్మలోనూ అటు మాయలోనూ అంతటా సమానముగా ఉన్నాడు. అయినా ఆయన గొప్పతనమును ఎవరు గుర్తించలేకున్నారు.

731. ఆహార పోషక పదార్థములు నాల్గురకములని గీతలో చెప్పాడు. అవికాక ఏమి తినినా త్రాగినా అవి రెండు రకముల పదార్థములుగా ఉన్నవి. ఒకటి విషము, రెండవది ఔషధము.

732. కడుపులోనికి వేయు మూలపదార్థములు మొత్తము ఆరు కాగా, వాటిని పోషకపదార్థములనీ, విషపదార్థములనీ, ఔషధ పదార్థములనీ మూడు రకములుగ విభజించవచ్చును. ఈ మూడురకముల పదార్థములు ఆత్మవిూదనే పని చేయుచున్నవి.

733. మనిషి పదార్థములను తింటున్నాడు, కానీ ఏది ఏ పదార్థమైనది కొన్నిటిని తెలిసి తింటున్నాడు. కొన్నిటిని తెలియక తింటున్నాడు. అవన్ని వాని కర్మానుసారమే లభిస్తున్నాయి. తినేది త్రాగేది ఏదైనా కర్మానుసారమే దొరుకుచున్నవి.

734. ఒకే పదార్థమే రోగమున్నపుడు తింటే ఔషధముగ, రోగము లేనపుడు తింటే విషముగ పని చేయుచున్నది. కొన్ని పదార్థములు రోగమున్నపుడు తింటే విషముగ, రోగములేనపుడు తింటే పోషకముగ పని చేయుచున్నవి. ఇంకొక విచిత్రమేమిటంటే ఒకే పదార్థము ఒకనికి ఔషధముగ, మరొకనికి విషముగ పనిచేయుచున్నది. దీనినిబట్టి చూస్తే అన్నిటికి కర్మేకారణమని తెలియుచున్నది.

735. ప్రపంచ కార్యముల విూద శ్రద్ధ కర్మప్రకారమే ఉండును. కానీ పరమాత్మ సంబంధ (దైవసంబంధ) కార్యముల విూద శ్రద్ధ నీ ఇష్టప్రకారమే ఉండును. అనగా జ్ఞానములో నీవు స్వతంత్రునివన్న మాట. అజ్ఞానములో ఎప్పటికి అస్వతంత్రునివేనని తెలుసుకో.

736. జీవితము సుఖ దుఃఖ సంగమము. అయినా మనిషి సుఖాలనే కోరుకుంటాడు. దుఃఖాలనువద్దనుకుంటాడు. కానీ అవేవీ నీ ఇష్టప్రకారము రావు, పోవు.

737. ఎంత జ్ఞానము వినినా మనిషి అజ్ఞానము వైపే మాట్లాడుతాడు. మనిషి ఎంత అజ్ఞానము వైపు మాట్లాడినా గురువు ఓర్పుగా మనిషిని జ్ఞానమువైపు పోవునట్లే చేయవలెనని ప్రయత్నించుచుండును.

738. అహము అద్దములాంటిది, మనస్సు సినిమాలాంటిది. మనస్సు ఎప్పుడు చూపినా బయటి విషయములనే చూపుచుండును. అహము ఎప్పుడు చూపినా నిన్ను నీకే చూపుచుండును. అహములో నీవు తప్ప ఎవరు కనిపించరు. మనస్సులో అన్ని రకముల విషయములు కనిపిస్తుండును.

739. స్త్రీలింగము, పుంలింగము అని అంటున్నాము. ఈ రెండు పదములలో లింగము అనునది సాధారణముగ ఉన్నది. దీనినిబట్టి స్త్రీలలోనైనా, పురుషులలోనైనా పరమాత్మ (లింగము) సాధారణముగా ఉన్నదని తెలియుచున్నది.

740. ఏనుగు ఎంత పెద్దదైనా శిక్షకుని మాటను బుద్ధిగా వింటున్నది. మనిషి ఎంత చిన్నవాడైనా గురువుమాటను బుద్ధిగా వినకున్నాడు.

741. అహము అద్దములాంటిదే, ఎదురుగున్న వాని దృశ్యమును వానికే చూపును. తనముందు ఉన్నవానిని ఉన్నట్లే చూపునది సాధారణ అద్దము. కానీ అహమనెడి అద్దము సాధారణ అద్దముకాదు, అది ఒక అసాధారణ అద్దము.

742. అహమనెడి అసాధారణ అద్దము తనముందున్న దృశ్యమును చూపదు. తనముందున్న వాని లోపలి దృశ్యమును చూపుతుంది. ఎవడినైన వానిలోపలి భావమును బట్టి ఏవిధముగానైనా చూపగలదు. ఒక మనిషిని రాజుగా గానీ, మంత్రిగా గానీ, మాంత్రికునిగా గానీ, ఆఫీసర్‌గా గానీ, గుమస్తాగా గానీ, వ్యాపారిగా గానీ, బికారిగా గానీ, ధనికునిగా గానీ, రైతుగా గానీ, డ్రైవర్‌గా గానీ, క్లీనర్‌గా గానీ ఎట్లయిన చూపగలదు.

743. ప్రపంచములో బయట ఎక్కడలేని విచిత్ర అద్దము మనలోపల ఉంది. ఎక్స్‌-రేలు మనిషి లోపలి ఎముకలను చూపినట్లు అహం-కారాలు మనిషి లోపలున్న భావాలను వానికే చూపును.

744. లోపలి అద్దము యొక్క పనితనమును చూచినా, వినినా ఎవడైనా "ఆహా" అనక తప్పదు. ఆహా అనిపించుకొన్న అది లోపల ఎట్లుందంటే! ఎవడికైన లేని దీర్గాలు కరిపించి చూపించే తాను మాత్రము తనకున్న దీర్గాలను తీసివేసుకొని నేను కేవలము "అహ" మునే అంటున్నది.

745. శరీరములోపల అహము ముందర వరుసగా చిత్తము, బుద్ధి, జీవుడు ఉండుట వలన బుద్ధి యొక్క యోచనలను, చిత్తము యొక్క నిర్ణయములను కలిపి జీవునిలో చూపుచున్నది. అందువలన జీవుడు నా యోచనా, నా నిర్ణయము అని అంటున్నాడు. 746. అహము ముందర చిత్తము బుద్ధి ఉన్నవనీ, ఆ తర్వాత నేనున్నాననీ, అహము ముగ్గురిని కలిసి చూపుతున్నదనీ, మా ముగ్గురికి ఎదురుగ అద్దముగవున్న అహములో బుద్ధి చిత్తము యొక్క భావములు నాయందున్నట్లు కనిపిస్తున్నవనీ, నిజముగ బుద్ధివేరు, చిత్తమువేరు, నేను వేరని ఏ జీవుడు తెలియకున్నాడు.

747. అహమను అద్దమునకు ఎదురుగా లేని మనస్సుయొక్క ఆలోచనలను మనిషి తనవనుకోలేదు. కానీ బుద్ధి చిత్తము యొక్క పనులను తనవే అనుకొంటున్నాడు. అందుకు కారణము అహము ముందర వరుసగా చిత్తము, బుద్ధి, జీవుడు ఉండడమే.

748. మనస్సు చూపు ఆలోచనా దృశ్యాలను జీవుడు తాను ప్రక్కనుండి చూచినట్లే అనుభూతి పొందును. కానీ బుద్ధి చిత్తము పనులలో మిళితమైపోయి అవి తనవే అనుకొన్నట్లు మనోదృశ్యాలను అనుకోడు.

749. మనో ఆలోచనా దృశ్యాలను జీవుడు తనవేననీ, తానేనని అనుకోకుండుట వలన స్వప్నములో మనస్సు చూపు దృశ్యములను తాను ప్రక్కనుండి చూచినట్లుండును. అందువలన మనస్సు చూపువాటిని "ఆలోచన" అంటున్నాడు, కానీ "నాలోచన" అనలేదు.

750. లోచన అనగా చూచుట అని, ఆలోచన అనగా దూరముగా చూచుట అని అర్థము. నీవు మనోభావమును ఎప్పుడు దూరముగానే చూస్తున్నావు. కావున మనస్సు అందించువాటిని ఆలోచనలే అంటున్నావు.

751. పరమతమును గురించి మాట్లాడాలనుకుంటే ముందు నీ మతమును గురించి నీవు యోచించు. పరమతములోని లోపమేమిటో? నీ మతములోని గొప్పతనమేమిటో? న్యాయముగా, నీతిగా నిర్ణయించుకో.

752. పరమతమును గానీ, నీ మతమును గానీ, స్వార్థబుద్ధితో గానీ, రాజకీయముగా గానీ, సమాజపరముగా గానీ యోచించవద్దు.

753. ఒకవేళ నీ మతము గొప్పగా, పరమతము నీచముగా కనిపిస్తే, మతమును గురించి వదలివేసి, మతము యొక్క ప్రసక్తి లేకుండ కేవలము దేవున్ని గురించే బోధించు, దేవుడు అన్ని మతములకు పెద్ద కావున ఏ మతస్థుడైనా నీ మాట వినగలడు.

754. ఒకవేళ పరమతము గొప్పగా, నీ మతము నీచముగా కనిపిస్తే, నీవు మతమును మాత్రము మారవద్దు. నిన్ను ఈ మతములోనే దేవుడు ఎందుకు పుట్టించాడో యోచించు. అపుడు మత చింతపోయి దైవ చింత కల్గుతుంది.

755. మతము అన్న పేరు ప్రతి వర్గములోను ఉన్నది. నీది ఒక పేరు కల్గిన మతమైతే, మరొకనిది ఇంకొక పేరు కల్గిన మతమై యుండును. మతములో నిన్ను దేవుడే పుట్టించాడు. కానీ నీవు కోరి ఏ మతములో పుట్టలేదు.

756. నిన్ను ఒక మతములో పుట్టించి, ఇంకొకనిని మరొక మతములో దేవుడే పుట్టించాడు. అలా నిన్నూ ఇంకొకన్నీ పుట్టించినది ఒకే దేవుడే! నీవు పుట్టిన తర్వాత దేవునికి నీవే పేర్లు పెట్టుచున్నావు. నిజముగా దేవునికి పేరులేదు, ఆకారము అంతకూలేదు.

757. మతాలకు అతీతముగా, పేర్లకు అతీతముగా, రూపములకు అతీతముగా, క్రియలకు అతీతముగా ఎవడైతే ఉన్నాడో వాడే నిజమైన దేవుడు. అతనే నిన్ను ఈ ప్రపంచమును సృష్టించినవాడు.