ప్రబోధ తరంగాలు/699-730

వికీసోర్స్ నుండి

జవాబులను వెదకకనే తెలియని దానిని లేదనువాడు హేతువాది ఎలా అవుతాడు?

699. మూఢనమ్మకము గలవారిని, గాఢనమ్మకము గలవారిని వదలి, వారి మాటను నమ్మక, స్వయముగ దేవుడు అబద్దముగ ఎలా ఉన్నాడని ప్రశ్నించుకొని, పరిశోధన చేసి కనిపెట్టినవాడు నిజమైన హేతువాది.

700. మామగార్లందరు చందమామ కాలేరు. అలాగే దేవతలందరు దేవుడు కాలేరు. ఎంతమంది మామగార్లున్నా భూమివిూదనే ఉంటారు. కానీ చందమామ ఆకాశములోనే ఉంటాడు. అలాగే ఎందరు దేవతలున్నా వారంతా భూమి విూదనే ఉంటారు. కానీ దేవుడు శరీరములోనే ఉంటాడు.

701. జరుగబోవు తన బ్రతుకు తెరువును గురించి చింతించుట వలననే మనిషిలో భయము ఏర్పడుచున్నది.

702. తన భయమును తీర్చుటకు మనిషి దేవతలను సృష్ఠించుకొన్నాడు. కానీ తనను ముందే దేవుడు సృష్ఠించాడని అనుకోవడము లేదు.

703. తనను సృష్ఠించిన దేవున్ని మరిచి తాను సృష్ఠించుకొనిన దేవతలను ఆరాధించడము మనిషికి ముఖ్యమైన పని అయినది.

704. మనుషులు సృష్ఠించుకొన్న దేవుళ్ళను గురించి నాస్తికులు మూఢనమ్మకమని వాదిస్తున్నారు. కానీ మనుషులనే సృష్ఠించిన దేవున్ని గురించి వారు ఆలోచించడములేదు.

705. ఎద్దు ఈనిందంటే గాటికి కట్టివేయమన్నట్లు, దేవుడు అంటేనే నాస్తికులు మూఢనమ్మకమనుచున్నారు. ఎద్దు ఈనదు, ఆవు ఈనుతుంది అని వివరము తెలిసినవాడు ఎద్దు ఈనడమును ఖండించి, ఆవు ఈనుతుంది అని సమర్థించును.

706. ఆవు, ఎద్దు వివరము తెలియనివాడు ఎద్దు ఈనిందంటూనే దూడను కట్టివేయమంటున్నాడు. అలాగే దేవుడు దేవతల వివరము తెలియని నాస్తికులు భక్తి అను పదము వినిపిస్తూనే మూఢనమ్మకము దానిని కొట్టివేయమంటున్నారు.

707. దూడ అంటూనే ఆవుకు పుట్టినదా? ఎద్దుకు పుట్టినదా? అని ఆలోచించక కట్టివేయిమనువారూ, భక్తి అంటూనే దేవుని ఎడల పుట్టినదా? దేవుళ్ళ ఎడల పుట్టినదా? అని ఆలోచించక కొట్టివేయమను ఇద్దరూ మూఢనమ్మకము కలవారే!

708. నాస్తికులు "ఏ దేవుళ్ళను" ఖండించి మాట్లాడాలో, ఆస్తికులు "ఏ దేవున్ని" ఆరాధించి పూజించాలో తెలియనంత వరకు ఇద్దరూ మూఢనమ్మకస్తులే!

709. మొదట పుట్టినపుడు మనిషిగ ఉన్నవాడు, కొంత చదివిన తర్వాత తాను బి.ఎస్‌.సి అనో, యం.ఎ అనో అనుకొనును. తర్వాత ఉద్యోగము చేయుచున్నపుడు తాను కమీషనర్‌ననో, సూపరెంటెండెంట్‌ అనో అనుకొనుచుండును. వాస్తవానికి నేనొక జీవుడనను మాట మరచి పోవుచున్నాడు.

710. ఏ రోగమూ నీ హోదాను కానీ, నీ ఉద్యోగమునుగానీ చూడదు. ఏ రోగమైన నిన్ను ఒక సాధారణ మనిషిగానే లెక్కించి బాధించునని మరువద్దు.

711. నీకు ఎంతో సన్నిహితముగనున్న నీ భార్యగానీ, నీ బంధువుగానీ నీవు రోగముతో బాధపడుచుంటే ప్రక్కనే ఉండి చూడగలరు. కానీ నీ బాధను కొద్దిగ కూడ వారు తీసుకోలేరు.

712. బయటి విద్యలలో ఎంతటి స్పెషలిస్టులైనాగానీ శరీరములోని తుస్సువలెనున్న మనస్సునుగానీ తస్సువలెనున్న అహమునుగానీ తెలియలేకున్నారు.

713. గాజు అద్దము బయటి నీ శరీరమును మాత్రము చూపుతుంది. కానీ అహమను అద్దము లోపల ఏకంగా నీ భావమును చూపుచున్నది. దానితో నేను మాత్రమున్నాననుకొంటున్నావు.

714. పాటను బాగా పాడితే నేను గాయకుడిననీ, బొమ్మను బాగా గీస్తే నేను చిత్రకారుడిననీ అనుకొను నీవు నిన్ను పాట పాడించింది, నీతో బొమ్మ గీయించింది మరొకడని తెలియకున్నావు.

715. ఒక మనిషి ఒక విద్యలో ప్రావీణ్యుడైనాడంటే ఆ ప్రావీణ్యత వానిదికాదు. శరీరము లోపలనున్న వాని ప్రక్కవానిది.

716. శరీరమను ఊరులో నీ ప్రక్కనే నివాసమున్న వాడే నిజమైన నీ పొరుగువాడు. అయినా నీవు వానితో స్నేహము చేయడములేదు.

717. ఉన్నతమైన ఉద్యోగములో ఉండేవాడే నీతో మాట్లాడక వాని హోదాకు తగినట్లుండును. అయినా స్వప్నములో ప్రధానిమంత్రియే స్వయముగ నీతో మాట్లాడును. స్వప్నములో ఆ సంఘటన ఎలా సాధ్యమైనదో నీకు తెలుసా?

718. వి.సీ.డీ ప్లేట్‌ను గమనిస్తే అందులో ఏమి కనిపించదు. కానీ అది ప్లేయర్‌లో తిరుగుచున్నపుడు అందులో ఉన్న దృశ్యములూ మాటలూ బయటపడును. అలాగే తలలో కనిపించకుండిన కర్మ జీవితములో జరుగుకొలది బయటపడును.

719. ఒక డి.వి.డి ప్లేట్‌లో తొమ్మిది గంటలకాలము మూడు సినిమాలు నిక్షిప్తమై ఉన్నవి. అలాంటపుడు స్పెషల్‌ డి.వి.డి లాంటి నీ తలలో ఎంత కాలము? ఎంత సమాచారము ఇమిడియున్నదో.

720. మానవుని చేత తయారు చేయబడిన కంప్యూటర్‌లోని చిన్న భాగమైన హార్డ్‌ డిస్క్‌లో వేయి పేజీల పుస్తకములు వేయికంటే ఎక్కువ ఇమిడి ఉన్నపుడు, దేవుడు చేసిన కంప్యూటర్‌ అయిన మానవుని తలలో కోట్ల సంవత్సరముల సమాచారముండగలదు.

721. నీలో ఐదు ప్రాణములున్నవి. వాటిలో ఒక్క ప్రాణము కూడ నీవు కాదు. నీవు వేరు, నీప్రాణము వేరు. నీవు జీవాత్మవు.

722. ఏదయిన దేవుని సొమ్ముగ లెక్కించినపుడు దానిలో ఎంత భాగము కూడ పంచుకోకూడదు. అలాచేస్తే దేవున్ని కూడ భాగస్తునిగ లెక్కించినట్లగును.

723. మనము చేసే వ్యాపారములో మనుషులను భాగస్తులుగ పెట్టుకోవచ్చును. కానీ దేవున్ని భాగస్థునిగ పెట్టుకోకూడదు. అలాచేస్తే దేవుని గొప్పతనాన్ని తగ్గించినట్లగును.

724. దేవునికి ఎవడైన సేవకునిగానే ఉండవలెను, అట్లున్నపుడే దేవున్ని గౌరవించినట్లగును. అందువలన నీ వ్యాపారములో దేవునికి ఎప్పుడు వాటా పెట్టవద్దు. 725. ఒక మనిషి సొమ్మును మరియొక మనిషి వాని అనుమతి లేకుండ తీసుకొంటే లేక దోచుకుంటే అది పాపమవుతుంది. దేవుని సొమ్మును మనిషి తీసుకొంటే అది ఎంతపాపమౌనో.

726. ఒక గుడిలోని ఉండిలోనికి నీ డబ్బులు వేసి తర్వాత దానిని నీవు తీసుకుంటే ఆ గుడిలోని దేవునికి నీ విూద కోపము వస్తుంది. అలా జరిగిన సంఘటనలున్నాయి. కావున అసలైన దేవాది దేవుని విషయములో జాగ్రత్తగ ఉండాలి.

727. ఇప్పటికి 60 సంవత్సరముల పూర్వము తిరుపతి వెంకటేశ్వరుని సన్నిధిలో ఉండీలో డబ్బులు వేసి కొంత మిగుల్చుకొన్నందుకు ఆ వ్యక్తిని అరగంట తర్వాత వెంకటేశ్వరుడే శిక్షించాడు.

728. బయటి చదువులకు ఫీజులు చెల్లిస్తాము. లోపలి చదువు అయిన జ్ఞానమును దేవుడు అందిస్తే, చేతనైనది చేసేదో, ఇచ్చేదో చేయవలెను. లేకపోతే నీవు ఎన్ని జన్మలకైన ఆయనకు బాకీ ఉందువు.

729. విషము శరీరములోని ఆత్మనూ, విషయము శరీరములోని జీవాత్మనూ ఇబ్బంది పెట్టును. విషమును ఔషధము, విషయమును జ్ఞానము నిరోధించగలవు. విషములోని ప్రభావమును, ఔషధములోని నిరోధకశక్తి రెండు ఒకే పరమాత్మ వలన కలుగుచున్నవి.

730. దేవుడు ఇటు విషములోనూ అటు ఔషధములోను. ఇటు అగ్నిలోనూ అటు కట్టెలోనూ, ఇటు దేవతలోనూ అటు రాక్షషునిలోనూ, ఇటు జ్ఞానములోనూ అటు మూఢత్వములోనూ,