ప్రథమ స్కంధ ఉపోద్ఘాతము
Appearance
←ముందరి అధ్యాయము | తెలుగు భాగవతము (ప్రథమ స్కంధ ఉపోద్ఘాతము) రచయిత: పోతన |
కృతిపతి నిర్ణయము → |
(1-1-శా.)
[మార్చు]శ్రీ కైవల్య పదంబుఁ జేరుటకునై చింతించెదన్ లోక ర | 1 | ||
క్షైకారంభకు భక్త పాలన కళా సంరంభకున్ దానవో | 2 | ||
ద్రేకస్తంభకుఁ గేళి లోల విలసదృగ్జాల సంభూత నా | 3 | ||
నా కంజాత భవాండ కుంభకు మహానందాంగనాడింభకున్. | 4 |
(1-2-ఉ.)
[మార్చు]వాలిన భక్తి మ్రొక్కెద నవారిత తాండవ కేళికిన్ దయా | 1 | ||
శాలికి శూలికిన్ శిఖరిజా ముఖ పద్మ మయూఖ మాలికిన్ | 2 | ||
బాల శశాంక మౌళికిఁగ పాలికి మన్మథ గర్వ పర్వతో | 3 | ||
న్మూలికి నారదాది మునిము ఖ్య మనస్సరసీరుహాలికిన్. | 4 |
(1-3-ఉ.)
[మార్చు]ఆతత సేవఁ జేసెద సమస్త చరాచర భూత సృష్టి వి | 1 | ||
జ్ఞాతకు భారతీ హృదయ సౌఖ్య విధాతకు వేదరాశి ని | 2 | ||
ర్ణేతకు దేవతా నికర నేతకుఁ గల్మష జేతకున్ నత | 3 | ||
త్రాతకు ధాతకున్ నిఖిల తాపస లోక శుభ ప్రదాతకున్. | 4 |
(1-4-వ.)
[మార్చు]అని నిఖిల భువన ప్రధాన దేవతా వందనంబు సేసి. | 1 |
(1-5-ఉ.)
[మార్చు]ఆదర మొప్ప మ్రొక్కిడుదు నద్రి సుతా హృదయానురాగ సం | 1 | ||
పాదికి దోషభేదికిఁ బ్రపన్నవినోదికి విఘ్నవల్లికా | 2 | ||
చ్ఛేదికి మంజువాదికి నశేష జగజ్జన నంద వేదికిన్ | 3 | ||
మోదకఖాదికిన్ సమద మూషక సాదికి సుప్రసాదికిన్. | 4 |
(1-6-ఉ.)
[మార్చు]క్షోణితలంబునన్ నుదురు సోఁకఁగ మ్రొక్కి నుతింతు సైకత | 1 | ||
శ్రోణికిఁ జంచరీక చయ సుందరవేణికి రక్షితామర | 2 | ||
శ్రేణికిఁ దోయజాతభవ చిత్త వశీకరణైక వాణికిన్ | 3 | ||
వాణికి నక్షదామ శుక వారిజ పుస్తక రమ్య పాణికిన్. | 4 |
(1-16-సీ.)
[మార్చు]మెఱుఁగు చెంగటనున్న మేఘంబు కైవడి | 1 | ||
నువిద చెంగట నుండ నొప్పువాఁడు | 2 | ||
చంద్రమండల సుధాసారంబు పోలిక | 3 | ||
ముఖమునఁ జిఱునవ్వు మొలచువాఁడు | 4 | ||
వల్లీయుత తమాల వసుమతీజము భంగిఁ | 5 | ||
బలువిల్లు మూఁపునఁబరఁగువాఁడు | 6 | ||
నీలనగాగ్ర సన్నిహిత భానుని భంగి | 7 | ||
ఘన కిరీటము దలఁ గలుగువాఁడు | 8 |
(1-16.1-ఆ.)
[మార్చు]పుండరీకయుగముఁ బోలు కన్నుల వాఁడు | 9 | ||
వెడఁద యురమువాఁడు విపులభద్ర | 10 | ||
మూర్తివాఁడు రాజముఖ్యుఁ డొక్కరుఁడు నా | 11 | ||
కన్నుఁగవకు నెదురఁ గానఁబడియె. | 12 |