Jump to content

ప్రజ్ఞా ప్రభాకరము/శ్రీ మాస్టరుగారు

వికీసోర్స్ నుండి

౨౭

శ్రీ మాస్టరుగారు

అప్పుడు శ్రీవారి జీవితచరిత్రము తెలిసి కొనఁ గోరి యక్కడి వారి నడిగితిని. పూర్వ మెప్పుడో శ్రీకృష్ణ దేవరాయల పాలన కాలమునఁ గాఁబోలు తెలుఁగు దేశమున నుండి తంజావూరి రాజ్యసంరక్షణకై విచ్చేసిన వారిలో వీరి పూర్వులు ముఖ్యుల నియు, కుంభకోణము, భగవద్ఘట్టమునఁ జాల యిండ్లు వీరి పూర్వులవే యనియు, వీరి పూర్వు లొకరు కావేరితీరమున కుంభకోణము ననే భక్తి పురి యను నగ్రహరము వెలయించిరనియు, వీరు బాల్యమున చాల ఐశ్వర్య వంతు లనియు, నప్పటికీ జాలినంత సంపత్తి కలవారే అనియు, ఇంటి పేరు కంచుపాటివా రనియు, శ్రీ వెంకా స్వామిగా రని శ్రీ వారినామ ధేయ మనియుఁ దెలిసికొంటిని. అప్పుడు వారికి సంస్కృతము తెలియనా యని యడిగితిని. సాంఖ్య యోగ వేదాంతాది శాస్త్రములు సంస్కృతమునే కలవు యాసంస్కృతము రాక యాయా శాస్త్ర విషయములు తెలియఁ గా దన్న తలఁపుతో నే నట్లడుగుట. వారికి సంస్కృతము రా దనియు చిన్న నాఁడాయాశాస్త్రాంశ ముల నాంగ్ల భాషతోఁ జదివి వాని సారార్ధ మెల్ల గ్రహించి రనియు, సంప్రదాయముతో శాస్త్రములఁ జదివిన వారి కంటె నెంతో యపూర్వార్ధము లెఱుఁగుదురనియు, నతిలోకానుభూతి లెన్నో యనుభవించి రనియు, శాస్త్ర పండితులతోడి వారినిగా వీరిని దలఁపరాదనియు, క్రమ ముగా నెల్ల విషయములు నీకే తెలియఁగల వనియు నక్కడివారు చెప్పిరి.

ఇంగ్లీషుభాషతో నుప దేశార్ధము లుండు టేమి? పవిత్రమయిన సంస్కృతము కలదు గదా! అది రాక యిట్లు చేయుటా? శ్రీవారు మహనీయులగుట దర్శన మాత్రము చేతనే యెఱుక కందుచున్నది. నిజమే కాని వారికి మీసలుండు టేమి? ప్రాచీన మహనీయులు సాంప్రదా యమునకు విరుద్ధము గదా! యని నాలో నేవేవో కొంత సేపు చీకాకులు కూడ కలిగినవి. కొంత సేపటికి వాని కన్నింటికిని సమాదానములును తోఁ చినవి. తర్వాత గోన్నాళ్ళకు విచారింపఁగా నా సమాధానములను శ్రీ వారే పలుతూరులు చెప్పుచుండి నట్లు తెలియ వచ్చెను__

' యన్య నాస్తి స్వయం ప్రజ్ఞా శాస్త్రం తస్య కరోతి కిమ్ లోచానాభ్యం విహీనస్య దర్పణః కిం కరిష్యతి '

అన్నట్లు స్వయం ప్రజ్ఞ కలవారే శాస్త్రనిర్మాతలు. అట్టివారికి ప్రాచీన శాస్త్రదిపఠనము తమ ప్రజ్ఞకుఁ గల యపూర్వతను గుర్తించుట కుపయోగపడునుగాని ప్రజ్ఞోద్బోధము స్వయము సమకూడవలసినదే. ప్రాచీన శాస్త్రములు దానికి జనకములు కాఁజాలము.

   " శాస్త్రాణాం విషయ స్తావ ద్యావ న్మందరశా జనాః 
      ప్రవృత్తే రస శాస్త్రే తున చ శాస్త్రం నచ క్రమః
   " త మేవ ధీరో విజ్ఞాయ ప్రజ్ఞాం కుర్వీత బ్రాహ్మణః 
     నానుధ్యాయా ద్బహూ౯ ఛబ్దా ౯ వాచో విగ్లాపనం హి తత్ "
   "విహాయ శాస్త్రజాలాని యత్సత్యం త దుపాస్యతామ్ " 
   ఇత్యాది సూక్తులు స్ఫురణకు వచ్చి భాషలో నే మున్నది? విషయము గదా ప్రధాన మయినది! ఏ భాష యయిన నేమి? అందును జాతిమాత దేశాదికృత మయిన పరిచ్చేదము లేకుండ సర్వసమానముగా సాగవలసిన యిట్టి మహ త్తర యోగ పద్ధతికి- నేఁడుప్రపంచవ్యాపకముగా నున్న యాంగ్ల భాషయే సరిపడి యుండు నేమో! మఱియును సంస్కృతమున కట్టి పూజ్యత మహార్షలు తమ యుద్బోధములునందే వెలయించు చేతను ఉపనిషత్తులును, వేదములును నందే యుండుట చేతను వచ్చినది- అట్టి వానిని నిపుడును వెలయింతురో యా భాషకుఁ గూడ నట్టి యోగ్యత కలదని యంగీకరింపక  తప్పదు. నేఁ డెందరో మహనీయు లా భాష ద్వారమున ననే కాపూర్వ శాస్త్రా ర్ధములు వెలయించుచున్నారు. దీనిని పరిగణింపక త్రోసి పుచ్చుట సాధ్యము కాదు. కనుక శ్రీ వారి యోగో పదేశ భాషాదు లాంగ్లమున నుండుట కొఱఁత గాదు. 
   మఱియు వారి యాకృతి మహనీయతకు మీసము లుంచుకొనుట, మొగమున బొట్టు పెట్టు కొనకుండుట కొఱఁత పఱుపఁ జాలవు. శైవ వైష్ణ వాది మత భేదములను బాటించు వారు గాన వారు మొగమున తన్మత చిహ్నముల ధరింప కుండ వచ్చును. వారు నెలకొల్పినది మహా రాజ యోగముగాన దీనికి బోడితల కాషాయవస్త్రములు మొదలగునవి యుండ నక్కఱలేదు. మీసము లుండుట లేకపోవుటలో న్యునాధికత లుండవు. ఈ సమాధానములు తోఁ చి నా మనసులోని యప్పటి మకిలను దొలఁ గించినవి.

కొంత కాలమయిన తర్వాత నేను మరల కుంభకోణము వెళ్ళి యుండఁ శ్రీ వారే నే నడుగ కుండనే యీ విషయమును గూర్చి యిట్లనిరి.' నాకు శిష్యులుగా నుండువా రెవరు గాని లోకమునకు విడ్డూరముగా తోఁచదగిన వేష భాషలతో నుండుట బాగుగాదు. నలుగురతో పాటుగానే యుండ వలెను. ఈ యోగమున నెవఁ డుగాని ప్రత్యేకముగా కడ తేరఁ జాలడు. తాను, తన చుట్టుపట్టుల వారు, తన యాప్తులు నను క్రమమున ప్రేమ వ్యాపకమగు తీరు ననుసరించి తాను, తన చుట్టుపట్టుల వారు, తన యాప్తులు నను క్రమముగా లోకము నంతను బ్రేమించి లోక మునంతను గడతేర్చు వాఁడు కావలె తన ప్రేమ సర్వలోక వ్యాపకము కానంత వఱకు నెవ్వఁడు గాని కడ తేరఁ జాలడు. ఆ ఖండము, సర్వ వ్యాపకుఁడు కాక తప్పదు. దేశకుల జాతిమతాది పరిచ్చేద ములతో వేఱు పడిపోవు సర్వ ప్రజతో సామరస్యము కుడు ర్చుకోలేని వాఁడు సంసార బంధమున కొట్టు కాడవలసినవాఁడే! బహిర్ముఖముగా సాగుచున్న బహుత్వమును సాగనిచ్చుచునే అంతర్ముఖముగాఁ దిరిగి అం దేకత్వమును గుర్తించి వర్తించుట ఈ యోగ సాధనమున కొక ఫలితము. మన పరిపూర్ణత భవిష్యత్తులో నున్నది గాని భూతము కాలేదు.కనుక భూత మను పీఠిక పై నెలకొని భవిష్యత్తున పరమార్ధ మను భవింపవలసి యున్నది.'

   శ్రీవారి దివ్య ప్రజ్ఞలలోనొక్కటి  యిది. ఎవ్వరుగాని లోనేదేని సందేహమో, వ్యాకులపాటో చెందుచు సన్నిధికి వచ్చినప్పుడు వారి నడుగకే, వా రడుగకే వింతగా దానికి సమాధానము యాదృచ్చిక సంభాషణ సందర్భమున వెల్ల డించుట-ఒండె-ఆ సమాధానము నడిగి తెలిసి కొనఁగోరి వారి సన్నిధికి వచ్చు నంతలో నాపృచ్చకు తీరులోనే యాసమాధాన మాప్రష్టల కెఱుకపడకుండనో, అంతలోనే యెఱుక కందుచునో శ్రీవారు నోరెత్త నావశ్యకత లేకుండనే బాహిరపడుట__
   ఒక చిన్న దృష్టాంతము. ఇంజనీయరింగ్ డిపార్టు మెంటులో ఉద్యోగిగా నున్నయొక  శిష్యుని ఢిల్లీలో హెచ్చు జీతముతో నుద్యోగించుటకు సమ్మతింతువా యని పైయధికారులడిగిరి. నాఁటి సాయంకాలపు టపాలో దానికి బదులు వ్రాసి పంప వలెను. దీని నడిగి తెలిసికొనుటకే ఉదయ మాతఁడు మద్రాసు నుండి వచ్చి వెంటనే తన విషయమును శ్రీ వారికీ విన్నవించెను.' సరే! టపా వేళలోగా యోచించి బదులు చేప్పుదు' ననిరి. సాయంకాలము టపావేళ దాటి పోవచ్చినది. శ్రీవారాతనిఁ బిలిచి బదులేమి గాని చెప్పరయిరి.
   ఆతని యోచనలు తీవ్రముగా రేగెను. అనుకూల ప్రతికూల పక్షముల యుక్తులు గుప్పుగుప్పు మని లోనుండి వెల్వడఁ జొచ్చెను. త్రాసున తూపగా ' వెళ్ళవలదు' అన్న పక్షము బరు  వెక్కువ గలదిగా గాన వచ్చెను. ఆత్రపాటుతో నదే సమాధానము జాబులో వ్రాసెను.' శ్రీవారు బదులు పలుక రైరి గదా! ఇక నాలసింపరాదు, కనుక దీనినే పోస్టు చేయుదు' నని యాతఁడు యోగశాల నుండి బయల్వెడలెను.
   శ్రీవారు తమ యింటివాకిట నుండిరి. రమ్మని కనుసైగ చేసిరి. చేరబోగా ' చేతిలో ఏమిటది?'అనిరి.' బదులు వ్రాసితిని. అనుకూల ప్రతికూల పక్షములు యోచించి చర్చింపఁగా ప్రతికూలపక్షము బలవంతముగా తోఁచెను. తామేమి సెలవిచ్చిన నట్లు చేసెదను. టపావేళ దాటు చున్నది. కాన నాకు తోఁచినది వ్రాసితిని. తద్విరిద్ధముగా మిరు సెలవిచ్చిన నట్లు వెంటనే చేసెదను' అనెను.' ఈజాబే పోస్టులో వేసిరమ్ము' అనిరి. ఆతఁ డట్లే చేసెను.
   తర్వాత సమయాంతరమున నిట్లు చెప్పిరి.' మి కేవి గాని సందేహములు తోచినచో తోచినవానికి బదుళ్ళు యోచింపక వెంటనే వాని నట్లే నాకు వ్రాయుటో, అడుగుటో చేయవలదు. మీ చేత నయినంతవఱకు వాని సమాధానములను మిరే కనుగొన యత్నింపుఁడు. ఎంతకును సమాధానము దొరకని వానినే నన్నడుగుఁ డు. న్యాయమైన, సంగత మైన ప్రశ్న మెవరికి గాని తోచినచో, నా ప్రశ్నపుఘనత ననుసరించి దానికి తగినంత త్నము చేసినచో సరి యయిన సమాధానము దొరకఁ గలదు. ఆ యత్నము బహిర్ముఖ మగు ప్రాచీన గ్రంధాదుల వల్ల తనకు విజ్ఞు  లుగా తోచు నాప్తులవల్ల తెలియఁ దాగిన దగును. అంతర్ముఖ మగుచో ఆత్మోద్బోధ రూపక మగును. ఈ యోగ మట్టిత్మోధమును గోల్పుటకే.

బహిర్ముఖముగా సమాధానము తెలియఁగోరుచో,' అనంత శాస్త్రం బహువేదితవ్యం ' ఆయా శాస్త్రములును, దత్ కర్తలును బహుభేదముల వారు. అం వరిదిగ్రాహ్యమోతేల్చువలసినది మరలనాత్మోద్బోధమే. ఘట్టకుటీ ప్రభాత న్యాయమున నెల్లరునెట్లు గాని యాత్మోద్బోధములు నను వర్తింప వలసిన వారే,అనువర్తించు వారే కాక తప్పదు. బహిర్ముఖముగా లభించు విజ్ఞానమును దోడు చేసికొని యాత్మోద్బోధములు నందుకొనఁ గల్గినచో పరమార్ధముల సులువుగాఁ బడయ వీలు పడును.

ఆ నాఁటి సాయంకాలము నా చేతి వాపు చాల తగ్గినది. యోగ సాధనానంతరము రామజపము వలె కొంత దడవుత దేకా నుధ్యానము చేయఁబూనితిని. ఒడలెల్లమంటలెత్తినట్లయ్యెను. అది శ్రీ వారితో చెప్పితిని. నియత సమయములలో తక్క నితర సమయములలో నా యనుష్టానము చేయరా దనియు, ఏ దేని యావశ్యకత కల్గినచో నప్పుడొక క్షణము స్మరించినంత మాత్రమున దానికి జరగఁ దగిన సౌకర్యము జరుగు ననియు, నోటి మాటను చెవి విన్నట్టే మి యభ్యర్ధనముల నది వినఁగల దనియు, ఒక తూరి ప్రార్ధించి నంత నే సర్వసిద్ధముగా నను గ్రహింపఁ గా నది చూచుచుండ గా మరల మరల నడుగు టేల యనియు ననిరి. టెలిఫోనులో ఒక తూరి పిలువగా నవతలి వారు సిద్ధముగా బదులు పలుకు చుండగా దానిని వినక యూరక పిలుపులే పిలుచువాని తీరువంటిది పదింబదిగా స్మరించుచుండుట యనిరి. ఈ యుప దేశపు యాదార్ధ్య మటుతర్వాత పరసహస్రపర్యా యములు నాకును నా మిత్రులకును ననుభూతి కందినది.

1925వ సం, ప్రాంతముల నొక మిత్రుఁడు నిరంతరము శ్రీవారి స్మరణమే రామనామజపమువలె జరుపుట సాగించెను. కొన్నాళ్ళకు శరీర మెల్ల నగ్నిజ్వాల వలె నెయ్యెను. నిద్రలో నరములు బిగించిన ట్లయి త్రుళ్ళిపడుట, క్రమముగా నిద్ర పట్టకుండుట యేర్పడెను. బంధువులు పలు వైద్యములు చేయించిరి. యోగము నే మాన్పించిరి. ఏమియు లాభము లే దయ్యెను. జరపిన తప్పిదమునకు పశ్చాత్తాపము సెంది క్షమింప ప్రార్ధించి సక్రమముగా నడచుకొన సాగించిన తరువాత నారోగ్యము చక్క బడెను. ఆ మిత్రుఁడు నేఁడును క్షేమముగా యోగ సాధనము చేయుచున్నాఁడు.అనధికారముగా, అక్రమముగా సాధనములు సాగించిన వా రింక నెందఱో పశ్చాత్తప్తు లయి బాగు పడవలసిన వారైరి.

                                            ---