ప్రజ్ఞా ప్రభాకరము/బాల్యస్మృతులు

వికీసోర్స్ నుండి

బాల్యస్మృతులు

ఒకనాఁడు తోడిబాలురుతో గోచికూడ లేక వీధిలో చింపిరి కాగితముల నేఱి యేదో పిచ్చి చదువు చదువుకొను చుండఁగా నన్నుఁ జూచి పుణ్యముర్తి కొట్టరువు సుందర రామయ్య పంతులుగారు (వారు మా యూర నేఁ బది యేండ్లకుఁ బైపడిన కాలము బడి పంతులుగా నెలకొని యూరి వారి కందఱకు ప్రాధమికఉదయ నేర్పిన సచ్చరిత్రులు.) నా చేయి పట్టుకొని ఇంటికి గొనివచ్చి మా మాతృ శ్రీ నడిగి గోచి గొని తానే మొలత్రాటికి దాని దగిలించి బడికి గొని పోయి రెండు మూడు నాళ్ళలోనే అక్షరజ్ఞాన మలవరిచిరి. తర్వాత వారిచేతనే మా తండ్రిగారు నా కక్షరాభ్యాసము జరపించిరి. నన్ను నే నెఱుగుటకు ఇది నా తొలిగుర్తు.

బడిలో నేదో చదువు సాగినది. అన్నింట నేనే మొన గాఁడను.లెక్కకు మాత్రము నిండుసున్న. తెలుఁ గన్న వెఱి తీపు. బడిలోని యుపాధ్యాయులు నాచే పద్యముల జదివించుచు సంతోషించుచుండెడివారు. సంగీతముతోడి చదువు నాఁటికి నేఁ టికిని గూడ నాకుఁ గొఱుకఁ బడని మెఱిక బియ్యమే! సంగీతము లేకున్నను సందర్భస్పూర్తి గలుగునట్లు పసినాట లెక్క కేక్కుడుగ పద్యములు నేను చదువఁ గల్గుట యుపాధ్యాయులకు ముచ్చట గొల్పెడిది. మా చుట్టుపట్టు గ్రామము లన్నింటి కంటె మా యూరనే మా యింటనే సంస్కృతాంధ్ర నిఘంటువులు ధర్మశాస్త్రాది గ్రంధ సంచయము నధికముగా నుండెను. గ్రంధములకై యనేకులు మా యింటికి వచ్చెడివారు. అర్ధ మయినంత వఱకు మా యింటఁ గల గ్రంధముల నెడ తెగక నేను చదువు చుండెడివాఁ డను. మా తండ్రిగారు తెలుఁగు మఱుఁగులు కొన్ని తెలియఁ జెప్పు చుండెడివారు. ఈ ముచ్చటలఁ బడి నేని ఇంగ్లీషుకు చదువు నిరాకరించితిని. సంస్కృతాంధ్రములగుచో స్వగ్రామముననే కొన్ని గంటలే చదువఁ డగుట, ఇంగ్లీషుకు తల్లిదండ్రులను, సుఖ భోజనమును విడిచి పెద్దయూరు బందరు పోవలయుట, పదొకొండు గంటలనుండి అయిదు గంటల దాఁక స్కూలుకు పోయి చదువవలయుట, ఊరిలోని మిత్రగోష్టిని విడువవలయుట దుఃఖకరములుగా నా కపుడు తోఁచినవి. నిర్బంధించి మా తల్లిదండ్రులు నన్ను గ్రామాంతరమునకుఁ బంపఁ జాలరైరి.పుత్రువాత్సల్యమును,భోజనాది సౌకర్యములు గ్రామంతరమున కల్గింపఁ గల ధనసంపత్తి లేమియు దానికిఁ గారణములు.

స్వగ్రామముననే బ్రహ్మణ్యులయిన మద్దూరి రామావ దానులుగారి దగ్గఱ సంస్కృతము, నింత తెలుఁ గు చదువ సాగితిని. పుణ్యమూర్తులు, ప్రాతస్స్మరాణీయులు మద్దూరి రామావధానులుగారు మా తండ్రిగారు నా బాల్య మిత్రులు. సమవయస్కులు. బ్రహ్మముహుర్తమున నిద్రలేచి సరిగా వేళకు సంధ్యా వంద నాగ్నిహోత్రాది ప్రాత రాహ్నికములు నిర్విర్తించుకొని ఒక గంట సేపు ఉంఛవృత్తి నెఱిపి, తొమ్మిది గంటలగుసరి కింటికి వచ్చి, మాధ్యాహ్నికము నిర్వర్తించు కొని పడి కొట్టక పూర్వమే సుఖముగా భోజనము చేసి, విశ్రాంతితో విద్యార్ధులకు పాఠములు చెప్పుటతో శ్రీ వారు సత్కాలక్షేపము జరుపుచుండిరి. పది గంటలలోగా భోజనము కానిచో వారి కొంటికణత తలనొప్పి వచ్చును. వా రతి సుకుమారశారీరులు. వారిని గూర్చి మా తండ్రిగారిని గూర్చి నాఁడుమా యూరి వా రిట్లు వాకొనుచుండు వారు. రామావధానులు గారికి తన కనారోగ్యము కలుగుట ఊరి కంతకు అనారోగ్యము కలుగుట- సుందరశాస్త్రిగారికి తన కుటుంబమున కనారోగ్యము కలుగుట యూరి కంతకు ననారోగ్యము కలుగుత-అని. తమ, తమ కుటుంబపు టనారోగ్యాములకు వీరు గజిబిజి పడునంతగా ఇతరుల యనారోగ్యముల గూర్చి వీరు గజిబిజి పడువారు కారనుట దీని తత్త్వము.

మా యింటి దగ్గఱ నే సాలెవీధిలో సాలెవారు వారి గురువగు భావనఋషికి ఉత్సవము జరుపుచుండరి. నా వయస్సప్పటికి ఎనిమిదో తొమ్మిదో ఉండును. సంజ వేళ 7, 8 గంటలప్పుడు భోజనము చేసి అక్కడ జరుగుచున్న యు త్సవమును జూచుట కేగి యట్టట్టే నేను మైమఱచి నెల వ్రాలి పోయితిని. అక్కడి వారు మైమరు పాటు కలుగుచుండుట నా వల్ల విని నన్నిం టికి గొని వచ్చిరి కాబోలును! ఎంత సేపయినదో! మా తండ్రిగారు దగ్గఱ శివకవచము పారాయణ చేయుచుండగా మెలకువ వచ్చెను. నా కేమియు బాధ గోచరింప లేదు. అంతే. అటుపై సాధారణముగా జాతర్లకు, దేవోత్సవములకు నే నంతగా వెళ్ళ నుత్సహింప కుండు టే జరుగుచు వచ్చినది. పై సందర్భమున నాకు మైమఱుపాటేల కలిగెనో అప్పు డెవ్వరికిని నెఱుక కందలేదు. పెక్కేండ్లకుఁ దర్వాత నాకే అది తెలియ వచ్చినది. అర్హ సందర్భమున దాని చెప్పుదును.

పదేండ్లవయసు రాక ముందే యిట్టిది మఱొక సంఘటన! మా యూర కలరా తీవ్రముగా వ్యాపించినది. ఊరిలో నీ దుర్యాధి వ్యాప్తికి చింతించుచు గుమిగూడి సంభాషించు పలువురలో నేఁడుమాటాడిన వారే రేపు దాని వాతఁ బడుట, మరణించుట జరుగసాగెను. గ్రామస్థు లేన్నెన్నో తంటాలుపడిరి. గ్రామ దేవతలకు ఇతర దేవతలకు మ్రొక్కు కొనిరి. వ్యాధి కొన్నాళ్ళుకు తగ్గిపోయినది. తగ్గిన వెంటనే పెద్ద యెత్తున నాయా దేవతలకు జాతరలు సాగించిరి. ఆ దేవతల యాకృతులు, వారిని గూర్చిన పంబ వారికధలు, జంతుబలులు నాకు చాల రోతను భీతిని గోల్పసాగినవి. దేవత లిట్టివారా? ఈ అర్చన లేనిటి? అని నేను పలుక సాగగా చుట్టుప్రక్కల వారు దేవతలు నాపై కోపగింతు రని ఊరికి చెఱువు చేయుదు రని మాటాడకు మని నాపై కోపగింపసాగిరి. ఆ జాతర తుదినాడు కొర్లంక యను పేరి దేవత కొక బండి గట్టి దాని మిఁద గసిగాలలో పందిపిల్లల నైదింటిని గ్రుచ్చి అవి గిజగిజ కొట్టు కొనుచు మరణయాతన మనుభవించు చుండగా నూరేగించి యూరి బయట ఆయా దేవతల కంపకములు చేసిరి.

నాఁటి దుర్దర్శనము నేఁటికి కనుల గట్టినట్లు గాన వచ్చుచున్నది. ఊరివారు జాతర సరిగా సాగె నని సంత సింపసాగిరి. గొప్ప సంక్షోభంముతో నేను దుఃఖింపసాగితిని. మరణమును గూర్చి, మరణానంతర స్టితినిగూర్చి, పుట్టుకను గూర్చి పుట్టుకకు పూర్వ స్థితిని గూర్చి, దేవతలను గూర్చి నిరంతరం చింత నాకు రేగెను. పెద్దల నడుగాజాల నైతిని. తోడి వయసువారికి నా గోడు తెలుపుట వ్యర్ధమయ్యెను. వీని యాధార్ధ్యము తెలియవలె నని రాత్రులందు భగవంతునికి మ్రొక్కి కనులు మూసికొని చూడసాగగా చిమచిమ చిమ్మ చీకటి నన్ను చుట్టుముట్టి మహాసముద్రమువలె గోచరింప సాగాను. దాని మధ్య భాగమున నే నున్నట్టు తెలియును. అనంతముగా నన్ను చుట్టుముట్టి యున్నట్టి యా యంద కారము పొడుగుగా నున్నదా, చతురస్రముగా నున్నదా అని కూడ జూడ దొడగితిని. అది యేదో గోళాకారముగా నున్నట్టు తోచును. దాని నడుమ నేను ఉన్నాను, ఉన్నా నన్న ప్రజ్ఞ మాత్రము మినుకు మినుకు మనుచు గజిబిజి పాటుతో దోచుచుండెను. ఎన్ని రాత్రులో యిట్లు నిద్రపట్టు నంతదాక చూచుచునే యుంటిని. ఒకటే యంధకారము నే నున్నానన్న యెఱుక, మెలకువ మాత్రము ధైర్య చ్చాయను గొల్పసాగినది. అట్లు కనులు మూసికొని బైటను జుచుచున్నట్లు చూచుటే కాని యప్పుడు నా దేహములోనికి జూచుకోనుటకు యన్నది నే నెఱుగను? అట్లు చూడ లేదు. బైటి యంధకారగోళమున నుండి నా ప్రశ్నలకు సమాధానములు దొరకలేదు. నేను చచ్చిపోయితిని. తర్వాత! అనుకొనెడి వాడను. అప్పుడీ చీకటిలో నేను లేను అని తోచెడిది. బ్రతికి ఉన్నాను అను కొనెడివాడను. ధైర్యము తోచి మినుకు మినుకు మనుచు అణుమాత్రుడను ఉన్నాను- అని తోచెడిది. ఎంత తంటాలు పడినను ఇంతే. ఒకనాడు నాలో చర్చ. ఎందుకు పుట్టితిని? చచ్చితిని గనుక ఎందుకు చచ్చితిని? పుట్టితిని గనుక చచ్చితిని సరే- మరల పుట్టుకుండరాదా? పుట్టితిని సరే-చావా కుండ రాదా? తోచదు ఇట్టు మనోమాధ నము జరగగా చివరికి తేల్చు కొన్నాను. నా పుట్టుక నే నేఱుగును. అంతా చీకటే ఇప్పు డేదో నేను ఇట్టు మినుకు మినుకు మనుచున్నాను. ఇది ఆరిపోతే ఏ మవుతుందో తెలియలేదు. వెల్తు రెక్కడు న్నది? నే నున్నా నని మినుకు మినుకు మను అణుమా త్రపు వెల్తు రే యున్నది, ఇది ప్రజ్వరిల్ల రాదా? ఈ చింత హెచ్చయినది. జాతరల మిఁద రోత మఱీ హెచ్చినది.

ఆ కాలముననే అప్పటికి నాకు పదేండ్ల వయ సుండ నో, ఉండదో మాయుర శివరాత్రృత్సవము గొప్పగా సాగును, మా చుట్టుపట్టుల యుళ్ళు కెల్ల మాయూర గోప్పశివ క్షేత్రము. అక్కడ నాగేశ్వరస్వామి యని శివలింగ మున్నది. అమరావతివలె నదియు బ్రాచీన శివ క్షేత్రము ఎంత ప్రాచీన మయినను నది బౌద్ధమత వినాశ చిహ్నముగా వెలసినదే యని నా నమ్మకము. అక్కడ శివలింగ మొక బౌద్దస్తూపశిలయే యని యిటీవాలి నా నిశ్చయము. అక్కడి దేవాలయమున అర్ధ ధర్మచక్రము గల బౌద్ద స్తూప శిలలున్నవి. కంటకనేల (గంటసాల) స్తూప విధ్వంసనానంతర మక్కడి స్తూప శిలలు చుట్టుపట్టుల దేవాలయ నిర్మాణముల గంటసాల స్తూపపు సూచిశిల యొకటి మంగి యువరాజు శాసనశిలగా మారినది. క్రీ. శ. 6,7 శ తాబ్దములకే బౌహద్ద్ స్తూపములు గొన్ని యైనను విద్వంసము చెందిన వనదగును. మా యూరి శివలింగంము జనమేజయ సర్పయాగస్దానమందు అనంత, వాసుకి, తక్షక కర్కోటక, మహానాగ కుమారుల చేత సుప్రతిష్ఠిత దివ్యలింగ మని పదు మూఁడువ శతాబ్ది నాఁ టి శాసన మున్నది.

ఒక శివరాత్రి నాఁడు జగజ్జ్యోతి వెలిగించు వేళకుఁ జాల ముందుగానే నే నక్కడకు జేరితిని. కొన్ని మణుగుల నేతి కుండులో గొప్ప జ్యోతి వెలిగించిరి. నేను తిరిగి వచ్చుటలో గోపుర ద్వారమున జనసమ్మర్దములో నలిగి పోయి క్రింది పడితిని. మా మిద నుండి యే జనము నన్ను చింపరిగుడ్డను దొర్లించుకొనుచు నడచినట్లు నడవజొచ్చిరి. చచ్చితి నను కొంటిని. ఊపిరాడదు ఎట్లో నన్ను కాళ్ళతోనే దొర్లించుచు గోపుర ద్వారము వెలికిపో పడదన్నిరి. బయటకు వచ్చిన తర్వాత నెమ్మదిగా ఒంటరిపట్టుకు దొరలి చాలాసేపు విశ్రాంతి గోన్నపై చక్క బడతిని. నాటినుండి గుళ్ళు గోపురములు జాతరలు నాకు దూరమయినవి.

మఱొకప్పుడు మా చుట్టుపట్టుల యూళ్ళ నెల్ల ఒకానొక యలజడి రేగినది. అది యిట్టిది- ఒక నాఁ డుదయమున నుండి సాయంకాలము దాఁక ఊరివా రెల్లరు ఊరి వెలుపల వసించి అక్కడ వంటలు చేసికొని దేవతలకు నైవేద్యము చేసి భుజింపవలయును. ఇంటి వాకిటితలుపుల మిద శ్రీ వైష్ణవ నామ మంటించవలెను. మెడలో సొరకాయ పెంచిక కట్టుకో వలెను. అట్లు చేయకున్నచో మహానర్దము వచ్చును. ప్రతి యింటి వాకిటి తలుపులమిద నామములు వెలయించిరి. ఎక్కడివో యెండు సొరకాయ బిళ్లలు (అమ్మిరిగాబోలును) వచ్చినవి. జందెములకు, మెడహరములకు.మొలత్రాళ్ళకు నందఱు వానిని కట్టుకొనిరి. ఊరి వెలుపల వంటలకు పయన మగుచుండిరి. మా నాయనగా రిందుకు ప్రతికూలురు- ఊరి వెలుపల కందఱును వెళ్ళిన పిదప దొంగ లూరు దోచుకోగల రని. మునసబు కారణాలు దైవభీతితో నే జాగ్రత్త వహింతు మని మాట యిచ్చిరి. కొంద ఱెవ్వరైన నూరు విడువకున్నచో తర్వాత నేదేని యాదృచ్చిక ముగానే ఆయెను- గ్రామమున కీడు దాపరిల్లినచో దాని తాకిడి ఊరు విడువని వారి మిఁ ద పడగలదు. కాన మాఱుమాటాక యూరు విడిచి వెళ్ళవలసి నదే యని యందఱు తీర్మానించు కొనిరి. మేము మాత్రము యింట పులిహొర చేసికొని యది మూట గట్టుకొని ఊరి వెలుపలకు వెళ్ళి అక్కడ దేవతకు దాని నివేదించి భుజించి యింత మజ్జిగ త్రాగి యింటికి రాదగు ననుకొంటిమి. నన్నందుకై కరివేపాకు తెచ్చి పెట్టు మనిరి. ఊరిలోని వారందఱు నాహరసామగ్రులతో నూరి వెలుపలకు వెళ్లుచుండిరి. దొడ్డిలో కరివేప చెట్టు గల బ్రాహ్మణుల యింటికి వెళ్ళి కరివేపాకు నడిగితిని. వారు నూరి వెలిపలికి పయనమగుచుండిరి.' కరివేపా కీయ వీలు లేదు. మేము వెళ్లుచింటి' మనిరి. నేను దొడ్డిలోనికి వెళ్ళి గోసికొని పోవుదు నంటిని.' తలుపులు తాళములు వేసినాము.వల్లగా'దనిరి - దొడ్డివైపున వెళ్ళి కోసి కొందు నంటిని. వల్ల గాదు పొమ్మని వారు వెళ్ళిపోయిరి. నేను దొడ్డివైపునకు వెళ్ళి చెట్టు కేసి చూచుచుంటిని. కొందఱు నన్ను జేర వచ్చిరి. కరివేపాకు కావలె నంటిని. ఎందుకు కనిరి? ఈ దేవతకు ద్వారమున కరివేపమండ కట్టవలె నట! అందుకు గావలెనంటిని. అంతే నాకొక మండ గోసి యిచ్చిరి. తర్వాత ఒకరొక రే ఒక్కొక్క మండ చొప్పున విఱుచుకొనిపోయి ద్వారతోరణముల కెక్కించిరి. చెట్టున ఒక ఆ కేని మిగుల లేదు. మరునాఁడింటి వారు వచ్చి ఆ దుండగము నేను చేసిన దని గుర్తించి నన్ను దండించినంత నిందించిరి. నే నబద్ధ మాదినందుకు ఫల మనుభవించితిని.

దైవముపేర సంఘమున అలజడి పుట్టించుట సుకరమనీ, అది దిద్దు టంత సుకరము గాదనీ. సంఘము విద్యా విజ్ఞానవంతమై మొత్తముమిఁద వర్దిల్లిననే గాని యిట్టి చేట్టలు దోలగింప సాధ్యముకాదనీ విన్నవించుటకే ఈ విషయముల నిక్కడ వ్రాసితిని. మతము, వైద్యము, జోస్యము, ధర్మము, ఆచారము ఇత్యాది సంప్రదాయ సంకేతములతో చెడుగు లేన్నెన్నో సంఘమున దిద్దఁ గుడురనివై మొద్దువారి కదల కున్నవి. వ్యాపించుచున్నవి. మూఢవిశ్వాసముతో వాని ననువర్తించులోక ముండ ట చేఁదత్ప్రు చారకులు వానిని స్వయము విశ్వసింపకపోయినను వాని వలని లాభముచే లోకముచే పలుకుబడి సాగించుకొను చున్నారు. కొందఱు సగ మెఱుకతో నన్నింటిని బాటించు చున్నారు.

ఇటీవల జరగినవిషయ మొకటి.

నామిత్రున కొకనికి ముక్కులో పెద్దకురుపు లేచినది. ఆతని కాయుర్వేద వైద్యమునఁ గొంత నమ్మకము. మిత్రుఁ డొక ఆంగ్లవైద్యుడు దానికి ఆపరేషన్ చేసి సులువుగా దొలగింతు ననుంచెడెను. వ్యాధితుఁ డు పిరికి వాఁ డు. కూరగాయ దేశీయవైద్య మెఱిగినమిత్రుఁ డొకఁ డు నఖమును అనగా చేతిగోటిని నువ్వుల నూనెతో గాచి గోర్వెచ్చగా ముక్కలో రెండు బొట్లు వేసిన నది మాను ననెను. తోడనే ఆతని తల దన్నినమిత్రుడు ఇతరులగోటికంటే తనగోరు కత్తిరించి వేసికోనిననే మాఱీ మంచిదనెను. నాకు వెఱులు వేకులు నెత్తసాగినవి. ఇట్లంటిని.' అతఁ డాపన్నుఁ డు గానున్నాడు. ఆ శాస్త్రీయముగా నెఱుక లేని మొఱకు వైద్యములఁ జెప్పకుఁడు'.' నే నెందఱకో ఈ వైద్యముచే ముక్కులో కురుపులు మాన్పితిని. ఎఱుక లేని వైద్యము కాదిది' యని తొలియాతఁ డనెను. రెండవ యాతఁ ' డిది య శాస్త్రీయము గాదు. కొన్ని వ్యాధులకు తన శరీరములోని రక్తమునే ఒక చోటనుండి మఱొక చోట ఇంజెక్షన్ చేసి వ్యాధుల కుదుర్చుటను ఆంగ్లేయులు గుర్తించిరి కాదా! ఇది ఎంతో పూర్వమే మన వారు కనిపెట్టి సాగించిన విధానము. నేను నాకే కురుపు లేవగా నా చేతిగోరే వేసి కాచిన నూనెతో కురుపు మాన్పికొంటిని' అని నన్ను మాటాడకుండఁ జేసెను. నాలో ఇంతంతనరాని యశాంతి. ఇది చేసిన రోగి చెడిపోక పోయినను గుణము కల్గక పోవచ్చునని యారాట పడ సాగితిని. మద్రాసులో ఉన్న నాళ్ళవి. ఓరియంటల్ లైబ్రరీకి వెళ్ళి 'నఖము'గణములకై వెదకితిని. అక్కడ ఆయు ర్వేద వైద్యశాలలో పని చేయుచున్న మిత్రున కిది తెల్పితిని. 'నఖ' మనఁ గా చేతి గోరు కాదనీ, అది సుగంధద్రవ్యమనీ, నత్తగుల్ల వంటి జలజంతువుల గుల్లల మూతచిప్పయనీ యాధార్ధ్యమును గుర్తించితిని. వెంటనే రోగిని దానినెఱిఁగించి మంచి వైద్యము చేయించుకో గోరితిని. తర్వాత ఆపరేషన్ జరగెను. ఆతఁడు స్వాస్ధ్యము చెందెను.

అంతంరంగంమున విస్పష్టపరిజ్ఞానపుతీరు గోచరింపని వారు చేయు సాహసకార్యము లిట్టివి! ఎఱుక కందనియౌషధమును జాలినంత యెఱుక లేనివారు ప్రయోగించుట, ఏదో జరుగు చుండుటయుఁ గా వైద్య విధాన మున్నది. అంతరంగమును పీల్చుకొని యంత రాత్మాభిముఖముగా బయనించుచు సత్యజ్ఞానానందముల నంతలతల ననుభవింప నలవడిన వారి ప్రజ్ఞలే ప్రపంచోప కారకము లగుచుండును.

ఇంచుమించు నాపదియేండ్ల ప్రాయముననే నాకడ గొట్టు సోదరికిఁ జాల జబ్బు చేసినది. జీవితము నిలువ దేమోయని యందఱు సందేహించు స్థితి కలిగెను. తర్వాత స్థితి యెట్లుండునో యని మాకు చల్దియన్నము వడివడిగాఁ బెట్టిరి. మాతో వావిడిచి చెప్పకున్నను ఇంటిలోని యలజడిని గుర్తించి నేను బెంగతో నెవ్వరికిని గానరాకుండ గుడిలోని కరిగి యక్కడ నొకమూలలో రక్షించు మని యాబిడ్డను గూర్చి భగవంతుని గూర్చి యేమేమో ద్యానింపఁ జొచ్చితిని. ఇంటికి మధ్యాహ్నపుఁ దిండికి రాలేదు. ఇంటిలో అలజడి కొంత తగ్గినది. రెండు మూఁడు విరేచనములయి బిడ్డ తేటగా నున్నది. అపాయభాయము తొలఁ గినది. అందఱును భోజనము చేసి నేను గానరాక పోవుట గుర్తించి వెదక సాగిరి. మిత్రులిండ్లలో నెక్కడను నేను గానరాలేదు. ప్రొద్దు గ్రుంకు వేళ కావచ్చినది. మా నాయన గారికి వెఱపు కల్గినది. వెదకఁ గా వెదకఁ గా తుదికి గుడిలో నక్కియున్ననన్ను గనుగొని బిడ్డ క్షేమ మెఱిఁగించి చాల దుఃఖించినన్నింటికిఁ గొని వచ్చిరి. పసితనము నాఁ టినుండియు వ్యాధికి మృతికి నేను తార్మారయి పోయెడి వాఁడను. ఏమియు తోచక చేయఁ గల్గినది లేక ఇంత నిలువలేక ఎవ్వరును గుర్తింపఁ జాల రని గుడిలో నొక మూల నక్కి నాఁ డు నేను దైవప్రార్ధనము చేసితినే కాని దానికి ఫలితముండు అని యానాఁ డు నే నేఱుఁగను.

మా నాయనగారు వైద్యవృత్తిలో రోగులకడ కటువుగా సొమ్ము పుచ్చుకొనుచుండిరి. ఒక సందర్బమున వ్యాధితుని యార్తికిఁజకితుఁ డ నయిన నేను మా నయనగారిని సొమ్ముకి నిర్బందింపక మం దీయఁ గోరితిని.' ముందు వ్యాధి కుదుర్చుఁడు. వాని చేత సోమ్మిపుడు లేదు. నెమ్మదిగా ఇయ్యఁ గలఁ డు. ఇయ్యక పోయినఁ బోనిండు. మికు పుణ్యము దక్కు' నంటిని. రెండు నిమిషము లాలోచించి ' నాయనా! ఈ కాఠి న్యము మీమీమిద ప్రేమ చేతనే నేను పూనావలసెను. నే నిట్టి కాఠిన్యము పూనకున్న సొమ్ము రాదు. అది యార్జించినఁ గాని మిషోషణము సాగదు. మీమీది ప్రేమ నన్నితరుల మిఁద నింత కఠినునిఁ గావించినది' అనిరి. కనుల నీరు గ్రుక్కుకొని యూరకుంటిని. ఆ సంభాషణము నాలో మఱుపురాక కుదుర్కొని నాఁటినుండి నన్ను వేధింపజోచ్చినది. దానినిర్వాహము ముందు తెలియఁగలదు.

--- ---