ప్రజ్ఞా ప్రభాకరము/ధూమకేతు దర్శనము

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search

ధూమకేతు దర్శనము

మద్రాసులో మా బావగారు దరి రామేశంగారి దగ్గఱ గుమాస్తా శ్రీ కాజా వెంకటశేషయ్యగా రుండిరి. వారి యండతో నేను మద్రాసులో నేలకొంటిని, మద్రాసు చేరగానే నాకు శ్రీ పండిత గోపాలాచార్యులుగారు, శ్రీ పురాణం నాగభూషణము గారు మిత్రులయిరి. గోపాలాచార్యులుగారి ద్వారా నాకు శ్రీ పనప్పాకం అనంతాచార్యులుగారితోను, వారి కుమారులగు శ్రీనివాసా చార్యులుగారి తోను మైత్రి యేర్పడెను. మద్రాసు చేరగానే వెస్లి మిష౯ హైస్కూలులో తెలుఁ గు పండితుఁ డనుగా నేను గుదుర్కొంటిని. రెండేం డ్లక్కడ నుంటిని. ఆ నాళ్ళలో తఱచుగా ప్రాచ్యలిఖిత పుస్తకశాల కరుగుచు నక్కడి గ్రంధములు చదువుచునుంటిని.

శ్రీ వేపా రామేశముగారితో నేను దఱచుగా విద్యావినోద మనుభవించుచుండు వాఁడను. రామేశంగారు విద్యారాశి. గణిత ఖగోళ చరిత్రాది శాస్త్రములందు నిష్ణాతులు వారికడ ఖగోళశాస్త్ర రహస్యములెన్నో తెలిసినుచుండెడి వాఁ డను. వారికొక టెలస్కోపు కలదు. వారిధర్మ పత్ని యంతర్వత్నిగా నుండి పురుటికై పుట్టినింటికి వెళ్ళుచుండు సందర్భములలో నెలల తరబడి రాత్రులందు వారితో చాలసేపు నక్షత్ర గ్రహమండలములను బరిశీలించుచుండువాఁ డను. ఎన్నో ఖగోళశాస్త్ర రహస్యములు వా రెఱుఁగఁ జెప్పుచుండు వారు. నేర్చు కొనుచుండెడివాఁ డను. ఎపిగ్రాఫియా ఇండికా, ఇండియ౯ ఆంటిక్వరీ, ఎపిగ్రాఫికల్ రిపోర్టులు మొదలగు చరిత్రధార గ్రంధము లెల్ల వారి దగ్గఱఁ గలవు. వాని నెల్లఁ జదువఁ దెచ్చుకొని చదువుచుండు వాఁ డను.

1910 వ సంవత్సరము. హలిస్ కామెట్టు వచ్చినప్పుడు- ఇంకా కొన్నాళ్ళ కది స్థూలదృష్టికి గోచరించుననఁ గాటేలస్కోపుతోను, బైనాక్యులర్ తోను తెల్లవారుజామున లేచి ఆకాశ భాగమున మే మిర్వురమును బరిశీలించుచుండువారము. ఆ ధూమ కేతువు తొలుత అరుణోదయ మగుచుండగా ఉదయారుణ కాంతులు క్రమ్ముకొనఁ గా కానరాక పోయెడిది. ఒకనాఁ డు బైనాక్యులర్ చేతనంచుకొని మేడ దిగి రోడ్డుమీ దికి పోయి పరిశీలింపఁ గా నా కది వెల్తురు చీపురుకట్టవలె గోచరిం చెను. పర్వేత్తుకొని (అంతలో అరుణద్యుతులు క్రమ్ముకొను నని) రామేశంగారికి చూప వచ్చితిని. ఆ ఆత్రపాటులో మేడ మెట్లు కొట్టుకొని మోఁ కాలి మిఁ ద చర్మము చిట్లి నెత్తురు కారుచుండెను. అది చూడక నేను కేతువు కనబడెనని స్పష్టముగా గోచరించుటకు టెలస్ కోపును సరిద్రిప్పు చుంటిని. నెత్తురు చూచి ఇదేమని రామేశంగా రడిగిరి. అప్పుడు దెబ్బగుర్తించితిని. అంతలోనే టేలస్కోపులో స్పష్టముగా కేతువును గుర్తించితిని. రామేశంగారు మాయు ద్వేగమును, రక్తస్రావ బాధను గూడ గుర్తింప మిని జూచి నివ్వెఱ చెందిరి. నివ్వెఱ కొంత ఉడిగి టెలస్కోవులో కేతువును గుర్తుపట్టు చుండగా వెలుఁ గు రేకలు చెలరేగి కానరానీయ వయ్యేను. మర్నాటి తెల్ల వారుజామున నిర్వురము లేచితిమి. జాగ్రత్తగా గుర్తించి నిన్నటి యాకాసపు పట్టు చూపఁ గా రామేశము గారు స్పష్టముగా చూచియప్పుడే దాని గూర్చి హిందూ పత్రికకు వ్రాసిరి. మర్నాడు వారికి కొన్ని టెలిగ్రాములు దాని యెఱుక కై వచ్చినవి.అటుఫై నల్గయిదు రోజులకుఁ గాబోలు నది యందఱ యెఱు కకు నందినది.

ఆ ధూమకేతువును దక్షిణహిందూ దేశమున ప్రజాసామాన్యమున తొలుత గుర్తించిన వాఁ డను నే నగుటలో మహాత్తరమయిన విశేషమేదో ఉండ బోలు నని నేనిటీవల విశ్వసించుచున్నాను. అందుకే దీని గూర్చి యించుకంత హెచ్చగా వ్రాసితిని. తత్ప్రయోజన మేదో ముందు తెలియఁ గలదు.

--- ---