ప్రజ్ఞా ప్రభాకరము/ఇల్లాలి యినిసియేషన్

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search

౨౯

ఇల్లాలి యినిసియేషన్

మద్రాసు పయనము. నే నింటిసామాన్లు నన్నింటిని రైలులో మద్రాసు పంపి సకుటుంబముగా తంజావూరి నుండి కుంభకోణమునకు వచ్చి నాయరోగ్యాది విషయములను శ్రీ వారి కెఱింగించితిని.

నాఁడు సాయంకాలపు యోగాభ్యాసము ముగిసిన తర్వాత నన్నుఁబిలిచి శ్రీవారు' నీ వీరాత్రి నేను సదా వర్తిల్లు చుండు యోగాలయపు గదిలో, నేను విశ్రమించు బల్ల మిఁదనీ భార్యతో శ యనించుము. నే నిప్పుడు ఇంటనే శయ నించు చుంటిని' అనిరి. నేను గడగడలాడి సిగ్గుతో అంగీకార సూచకముగా తల వాంచితిని. కాని నాకు తర్వాత చాల వెఱపు గల్గెను. అది గురు దేవులు శయనించుగది. అందు వారు విశ్రాంతి గొనుబల్ల! అందు నేను శయనంచుటా? అందును సద్వితియముగా! అని వణకితిని. ఈయాజ్ఞ నాలోనే జిర్ణించెను. వారితోనే భోజనము చేసితిని. వారి యింటిలోని యాడువా రందఱు మిత్రులతో వీధియరుగుమిఁద శయనించితి. రేయెల్ల శ్రీవారి యాజ్ఞను గూర్చి పర్యాలోచనమే! ఉదయము తెలతెలవాఱుచుండఁ గా తలుపులు తెఱచిన తోడనే లోని కరిగితిని.

శ్రీవారు ఇంటిలో విశాలమయిన మండువానిలో చంద్ర నక్షత్రాదులు నీలాకాశము గోచరించుచుండఁ గా చల్లని గాలి విచుచుండఁ గా, నొక గోల్డు మెడల్ మడత మంచము మిఁద పలుచని పడుక మీదను, క్రిందను చల్లినమల్లెపూవు లున్నవి. పట్టుతలగడ గలదు. తెల్లని పలుచనిపట్టు సెల్లా కప్పుకొని యుండిరి. మంచమునకు దోమ తెరక ప్పుండెను. అదను ప్రతీక్షించుచు వారు కనులు దెఱచి లేవ నుంకించునంతలో నేను చేర నరిగి పాదములు స్పృశించి నమస్కరించి తిని.' రాత్రి యెక్కడ శయనించితి' వని యడిగిరి. ఇంటిలో స్ర్తీలతో స్ర్తీయు, వాకిటియరుగు మిఁద నేనును శయనించుట తెల్పితిని. చప్పరంచి ' నా మాట పాటింపక పోతివి గదా' యనిరి. సిగ్గుతో తల వాంచితిని.' సరే! కానిలే! ఏమి విశేషము ' అనిరి.

' మి దివ్యానుగ్రహమున నే నారోగ్యవంతుఁ డ నయితిని. నా కీయోగమార్గమున ధన్యత చేకూరును. నాకు శరీర మొసఁగిన మాతల్లి దండ్రులు వృద్ధులు. ఎప్పు డేమిజరుగునో? వారికి మిశిష్య తన నుగ్రహింప వేఁడుచున్నాను. వారిక్కడికి రాఁజాలరు' అంటిని.' వారివయసెంత' యనిరి.' మాతండ్రి గారి వయసు డెబ్బది దాటినది'యంటిని.' అంత వార్ధకమున నున్న వారినిగూర్చి యనుతపింతువే? చిరకాలము నీతో జీవితము గడపవలసిన నీభార్యను గూర్చి యడుగ వేమి' యనిరి.' చిన్న వయస్సులో నున్న యీయువిద నాతో నెప్పుడు పట్టిన నప్పుడు మి దర్శనమునకు రాఁ గల్గును. కాన యెప్పుడయిన మీ శిష్యతానుగ్రహమున కర్హురాలు కాఁగలదు. చాల వార్ధకమున నున్నవారని, ఎప్పు డేమగునో అని, వా రీశరీ రముతో నే మీ శిష్యత పడయవలె నని నాయాశ' యంటిని.' సరే కాని నేఁడు ఎనిమిది గంటలకు నీ భార్యకు ఇ౯ సియేష ౯ జరుగును. అందుకు వలయు సన్నాహములు జరపుము, అందుకై నీ వేమియు వస్తువులు తీసికొని రా నక్కఱ లేదు. రాధాకృష్ణనితోను, మహాదేవయ్యరుతోను, చెప్పి ఫారము వగైరాలు ఫిలప్పు చేయించుము ' అని శయ్య వీడి లోని కరిగిరి.

  నే నడిగిన దాని ననుగ్రహించినట్లు త్తర మియాక యర్ధింపవలసిన దే అయినను అప్పు దర్ధింపని దాని ననుగ్రహించుట జరిగెను గదా యని వింత చెందుచు నేనును వెలికి వచ్చి కాల కృత్యములు నిర్వర్తించుకొని, యంతలోనే యోగశాలకు విచ్చేసిన మిత్రు లిర్వురకు శ్రీవారి యాజ్ఞను దెలిపితిని. వారు నవ్విరి. ఎనిమిది గంటలకు సర్వము సిద్ధమయ్యెను. నాఁడు శ్రీవారియింట వారి యారోగ్యమును గూర్చి శ్రీవారు తీవ్ర ప్రజ్ఞతో నుండిరి. ఎనిమిది గంటలకు ఇ౯సి యేష౯ జరగినది.
  మాతృశ్రీగారు యోగ సాధనోపక్రమమునకు ముందు ఇడ్డనలు, కాఫీ, ఆహారము తిసికొనుటకై తెచ్చి దగ్గఱ నుంచిరి. అది తెలియక యీక్రొత్త యువిద యాభ్యాసవిధానము నారంభించెను. అయుదు నిమిషములలో శరీర మెల్ల కొయ్యబాఱి కదల మెదల వీలు లేకుండ బిగిసి కొని పోయెను. దగ్గఱకు వచ్చి సచ్చిదానందస్వాములవా రాస్థితిని జూచి పిలిచిరి. కనులు తెఱవఁజాల దయ్యెను. వారు మాతృశ్రీ గారిని లుచుకొనివచ్చిరి. చూడఁగా నా హరపదార్ధములుంచినవి యుంచినట్లే యుండెను. వెంటనే లేపి, ఒడలు పిసికి, యెఱుక తెచ్చి యాహారము గొనిపించిరి. మూఁడునా ల్గిడ్డెనలు, చెంబెడుమంచినీరు, కాఫీ త్రాగి, శక్తి రాఁగా మరల యోగ సాధనముల సాగింపించిరి. పావు గంటసేపు ప్రబలముగా సాధన జరిగెను. అంత తివ్రయే నాఁ డుండుటకు కారణము శ్రీవారి యానాఁటి ప్రజ్ఞతీవ్రతయే యగుట నక్కడి వారు తెల్పిరి. నాఁడు మహోత్సాహముతో దంపతుల ముంటిమి.
  ఆసాయంకాలమే నేను మద్రాసు వెళ్ళవలెను. నా కోర్కి తీరలేదు. మరల శ్రీవారి దర్శించి నా కోర్కి- మా తలి దండ్రుల విషయమును ప్రశ్నించితిని. శ్రీవారు శరీరములను జిరకాలము రక్షింప ననువు పడదు. అయినను నీవు వెంటాడు చున్నావు గాన చెప్పుచున్నావు.' నీవు యోగ సిద్ధుఁ వై తేని-' దశపూర్వేషాం దశపరేషాం-మివంశ్యులకు నీ యోగవాసన లంటి వారు కడతేరఁ గలరు. పది సంవత్సరములు విడువక నాయాదేశము చొప్పున యోగా భ్యాసము చేయవలెను. అన్నివాంఛితములను నీవే నెఱవేర్చుకొనఁగల్గుదువు. ఇప్పటికి మి తల్లిదండ్రులు లక్కడనే ఉండియీనాయుప దేశించు విధానము నాచరింతురుగాక' అని తద్విధానము తెల్పిరి. నే నెంతో ఉప్పొంగితిని.
  కాని యానాఁడు తెల తెలవాఱునపుడు వారిని దర్సించి నప్పుడు భాషించిన తెఱఁ గునకు, నే నొక్క దాని నడుగఁగా దానికి బదులు ననుగ్రహింపక యనన్వితముగా జరపిన సందర్భమునకు, మధ్యాహ్నము మరల వెంటాడి ముర్ఖతతో ప్రశ్నింపఁగా చూచినచూడ్కికి, చెప్పిన బదులుకు నే కాన్వయమును మఱి పదేండ్లకు గాని నేను గుర్తింప యోగ్యత గల వాఁడ గాఁజాల నయితిని. పదమూఁడేండ్లకు కద్భుతముగా తద్రహస్య మెల్ల ననుభూతి పూర్వకముగా గోచరించెను. అది యాసందర్భము వచ్చినప్పుడు వివరింపఁ గలను. 
  కుంభకోణముణ నుండి యే మా తల్లిదండ్రులకు శ్రీవారు యా దేశమును వ్రాసితిని. శ్రీవారిసన్నిధిని మాదంపతుల కెట్టి యనుభూతులు జరగినచో సుదూర దేశమున నున్నను మా తల్లిదండ్రులకు నట్టియనుభూతులు జరిగినవి. తర్వాత వారు మద్రాసుకు నా కాయా విషయముల తెలిపిరి. నాఁడు రాత్రి మెయిలులో దంపతులము మేము మద్రాసు వచ్చి వేసితిమి.
                     ---