Jump to content

పోవోయి పోవోయి - పొలతులతో నింత

వికీసోర్స్ నుండి

కాపి రాగం - చాపు తాళం

[మార్చు]



పల్లవి:
పోవోయి పోవోయి - పొలతులతో నింత
- పోటాపోటీ లేమోయి ॥పోవోయి॥

అనుపల్లవి:
వావిని ఈవాడ - వనితలెల్ల నీకు
వావారే వావారే - వదిన మరదళ్లైరి ॥పోవోయి॥

చరణం 1:
తల తడిపి తగని బా - సలు జేసిన నమ్మ
- దగిన కాలము గాదురా
చెలువుడ మన యూరి - వెలయాండ్రతో నీకు
భళిభళి భళీభళి - బహరీ ఖాతాలాయె ॥పోవోయి॥

చరణం 2:
వేషభాషలు జూపి - విషము చక్కెర జేసి
- విడుతురోయి పురుషులు
హాషామాషీ చెలి - యల సయ్యాటలు నీకు
భేషు భేషు భేషు - విజయ బిరుదములాయె ॥పోవోయి॥

చరణం 3:
బహురూపధర తోట్ల - వల్లూరి వేణుగోపాలా
- యెంత జాణవు
రహి మించు దాసు శ్రీ - రాముని పలుకులు
అహ హాహా అహా అహా - అమృత బిందువులాయె ॥పోవోయి॥