పోయి వచ్చెద సామీ - అత్తింటికి

వికీసోర్స్ నుండి


పల్లవి:
పోయి వచ్చెద సామీ - అత్తింటికి
పోయి వచ్చెద సామీ ॥పోయి॥

అనుపల్లవి:
హా యేమి సేతు న - న్యాయముగా మన
నీయెడలను దైవ - మెడ బాపె నయ్యయో ॥పోయి॥

చరణ:
మరచిపోక యుండుమీ - యెన్నటికి
- మనము చేసిన చెలిమి
హరిహరి నిద్రాహారము లెరుగక
దరి లేని విరహసా - గరమున నీదుచు ॥పోయి॥

బడిబడి నెంతో తమి - కోరకు మీ
- పడచుకత్తెల కూరిమి
ఎడలేక కన్నీరు - విడువనేలర సామి
తడవు లేదెట్లయిన - తప్పించి రాలేనా ॥పోయి॥

ఘన వేణు గోపాలా - దాసు శ్రీరామ
- కవిపాలా మృదుశీలా
మనసు రాయి జేసు - కొని యెట్లు నిలుతు నా
తనువునీదే సుమ్మి - దయయుంచు నామీద ॥పోయి॥