పోతన తెలుగు భాగవతము/పంచమ స్కంధము (ద్వితీయాశ్వాసము)/భగణ విషయము

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search


(తెభా-5.2-77 ఆ. )[మార్చు]

మలజాండ మధ్యతుఁడైన సూర్యుండు
రితమైన యాతపంబుచేత
మూఁడు లోకములను ముంచి తపింపంగఁ
జేసి కాంతి నొందఁజేయుచుండు.

(తెభా-5.2-78 వ. )[మార్చు]

ఇట్లు భాస్కరుం డుత్తరాయణ దక్షిణాయన విషువు లను నామంబులు గల మాంద్య తీవ్ర సమానగతుల నారోహణావరోహణ స్థానంబుల యందు దీర్ఘ హ్రస్వ సమానంబులుగాఁ జేయుచుండు.

(తెభా-5.2-79 ఆ. )[మార్చు]

మేషతులల యందు మిహిరుం డహోరాత్ర
మందుఁ దిరుగు సమవిహారములను;
రఁగఁగ వృషభాది పంచరాసులను నొ
క్కొక్క గడియ రాత్రి దక్కి నడచు.

(తెభా-5.2-80 ఆ. )[మార్చు]

మించి వృశ్చికాది పంచరాసులను నొ
క్కొక్క గడియ రాత్రి నిక్కి నడచు;
దినములందు నెల్ల దిగజారు నొక్కొక్క
డియ నెలకుఁ దత్ప్రకారమునను.

(తెభా-5.2-81 వ. )[మార్చు]

మఱియు; నివ్విధంబున దివసంబు లుత్తరాయణ దక్షణాయనంబుల వృద్ధిక్షయంబుల నొంద నొక్క యహోరాత్రంబున నేకపంచాశదుత్తరనవ కోటి యోజనంబుల పరిమాణంబు గల మానసోత్తర పర్వతంబున సూర్యరథంబు దిరుగుచుండు; నా మానసోత్తరపర్వతంబు నందుఁ దూర్పున దేవధాని యను నింద్రపురంబును, దక్షిణంబున సంయమని యను యమ నగరంబును, పశ్చిమంబున నిమ్లోచని యను వరుణ పట్టణంబును, నుత్తరంబున విభావరి యను సోముని పుటభేదనం బును దేజరిల్లుచుండు; నా పట్టణంబుల యందు నుదయ మధ్యాహ్నా స్తమయ నిశీథంబు లనియెడు కాలభేదంబులను, భూత ప్రవృత్తి నిమిత్తం బచ్చటి జనులకుఁ బుట్టించు చుండు; సూర్యుం డెపు డింద్ర నగరంబున నుండి గమనించు నది యాదిగాఁ బదియేను గడియలను రెండుకోట్ల ముప్పదియేడులక్షల డెబ్బదియైదువేల యోజనంబులు నడచు; నివ్వింధంబున నింద్ర యమ వరుణ సోమ పురంబుల మీఁదఁ జంద్రాది గ్రహ నక్షత్రంబులం గూడి సంచరించుచుం బండ్రెండంచులు, నాఱు గమ్ములును, మూఁడు దొలులుం గలిగి సంవత్సరాత్మకంబయి యేకచక్రం బయిన సూర్యుని రథంబు ముహుర్త మాత్రంబున ముప్పది నాలుగులక్షల నెనమన్నూఱు యోజనంబులు సంచరించు.

(తెభా-5.2-82 సీ. )[మార్చు]

నురథంబున కున్న యిరుసొక్కటియ మేరు;
శిఖరంబునందును జేరి యుండు;
నొనరఁ జక్రము మానసోత్తర పర్వతం;
బందులఁ దిరిగెడు నా రథంబు
నిరుసున నున్న రెం డిరుసులు దగులంగఁ;
వన పాశంబుల ద్ధ మగుచు
ధ్రువమండలంబు నందుల నంటియుండఁగా;
సంచరించుచునుండు సంతతంబు;

(తెభా-5.2-82.1 తే. )[మార్చు]

ట్టి యరదంబు ముప్పదియాఱులక్ష
లందు నంటిన కాడిఁయు న్ని యోజ
ముల విస్తారమై తురంముల కంధ
ములఁ దగులుచు వెలుఁగొందు మణతోడ.

(తెభా-5.2-83 వ. )[మార్చు]

ఆ రథంబునకు గాయత్రీచ్ఛందం బాదిగా సప్తచ్ఛందంబులు నశ్వంబులై సంచరించు; భాస్కరునకు నగ్రభాగంబున నరుణుండు నియుక్తుండై రథంబు గడపుచుండు; వెండియు నంగుష్టపర్వమాత్ర శరీరంబులుగల యఱువదివేల వాలఖిల్యాఖ్యు లగు ఋషివరులు సూర్యుని ముందట సౌరసూక్తంబుల స్తుతియింప, మఱియు ననేక మునులును గంధర్వ కిన్నర కింపురుష నాగాప్సరః పతంగాదులును నెలనెల వరుస క్రమంబున సేవింపం, దొమ్మిదికోట్ల నేబఁది యొక లక్ష యోజనంబుల పరిమాణంబు గల భూమండలంబు నం దొక క్షణంబున సూర్యుండు రెండువేలయేబది యోజనంబులు సంచరించుచు, నొక యహోరాత్రంబు నందె యీ భూమండలం బంతయు సంచరించు" ననిన శుకయోగీంద్రునకుఁ బరీక్షిన్నరేంద్రుం డిట్లనియె.

(తెభా-5.2-84 క. )[మార్చు]

ము నివర! మేరుధ్రువులకు
నొ రఁ బ్రదక్షిణము దిరుగుచుండెడు నజుఁ డా
యి నుఁ డభిముఖుఁడై రాసుల
నుకూలత నేగు నంటి; ది యెట్లొప్పున్.

(తెభా-5.2-85 క. )[మార్చు]

ని పలికిన భూవరునిం
నుగొని శుకయోగి మిగులఁ రుణాన్వితుఁడై
మున శ్రీహరిఁ దలఁచుచు
వి ను మని క్రమ్మఱఁగ నిట్లు వినిపించెఁ దగన్.

(తెభా-5.2-86 వ. )[మార్చు]

నరేంద్రా! యతి వేగంబునఁ దిరుగుచుండు కులాల చక్రంబు నందు జక్ర భ్రమణంబునకు వేఱైన గతి నొంది బంతిసాగి తిరిగెడు పిపీలకాదుల చందంబున నక్షత్రరాసులతోడం గూడిన కాలచక్రంబు ధ్రువమేరువులం బ్రదక్షిణంబు దిరుగునపు డా కాలచక్రంబు నెదుర సంచరించు సూర్యాదిగ్రహంబులకు నక్షత్రాంతరంబుల యందును రాశ్యంతరంబుల యందు నునునికి గలుగుటం జేసి సూర్యాది గ్రహంబులకుఁ జక్రగతి స్వగతులవలన గతిద్వయంబు గలుగుచుండు; మఱియు నా సూర్యుం డాదినారాయణమూర్తి యగుచు లోకంబుల యోగక్షేమంబులకు వేదత్రయాత్మకంబై కర్మసిద్ధి నిమిత్తంబై దేవర్షి గణంబులచేత వేదాం తార్థంబుల ననవరతంబు వితర్క్యమాణం బగుచున్న తన స్వరూపంబును ద్వాదశ విధంబులుగ విభజించి వసంతాది ఋతువుల నాయా కాలవిశేషంబుల యందుఁ గలుగఁ జేయుచుండు; నట్టి పరమ పురుషుని మహిమ నీ లోకంబున మహాత్ములగు పురుషులు దమతమ వర్ణాశ్రమాచారముల చొప్పున వేదోక్త ప్రకారంబుగా భక్త్యతిశయంబున నారాధించుచు క్షేమంబు నొందుచుందు; రట్టి యాదినారాయణమూర్తి జ్యోతిశ్చక్రాంతర్వర్తియై స్వకీయ తేజఃపుంజదీపితాఖిల జ్యోతిర్గణంబులు గలవాడై ద్వాదశరాసుల యందు నొక సంవత్సరంబున సంచరించుచుండు; నట్టి యాదిపురుషుని గమన విశేషకాలంబును లోకు లయన ఋతు మాస పక్ష తిథ్యాదులచే వ్యవహరించుచుందురు; మఱియు నప్పరమపురుషుం డా రాసుల యందు షష్టాంశ సంచారంబు నొందిన సమయంబును ఋతు వని వ్యవహరింపుదు; రా రాసుల యందు నర్థాంశ సంచారమ్మున రాశిషట్కభోగల బొందిన తఱి యయనం బని చెప్పుదురు; సమగ్రంబుగా రాశుల యందు సంచార మొందిన యెడల నట్టి కాలంబును సంవత్సరం బని నిర్ణ యింపుదు; రట్టి సమగ్రరాశి సంచారంబునందు శీఘ్రగతి మందగతి సమగతు లనియెడు త్రివిధగతి విశేషంబులవలన వేఱుపడెడు నా వత్సరంబును సంవత్సరంబు పరివత్సరం బిడావత్సరం బనువత్సరం బిద్వత్సరం బని పంచవిధంబులఁ జెప్పుదురు; చంద్రుండు నీ తెఱంగున నా సూర్యమండలంబు మీఁద లక్షయోజనంబుల నుండి సంవత్సర పక్ష రాశి నక్షత్ర భుక్తులు గ్రహించుచు నగ్రచారియై శీఘ్ర గతిం జరించునంత వృద్ధిక్షయరూపంబునం బితృగణంబులకుఁ బూర్వ పక్షాపరపక్షంబులచేత నహోరత్రంబులఁ గలుఁగఁ జేయుచు సకలజీవ ప్రాణంబై యొక్క నక్షత్రంబు త్రింశన్మూహూర్తంబు లనుభవించుచు షోడశ కళలు గలిగి మనోమయాన్నమ యామృతమయ దేహుండై దేవ పితృ మనుష్య భూత పశు పక్షి సరీసృప వీరుత్ప్ర భృతులకుఁ బ్రాణాప్యాయనశీలుం డగుటంజేసి సర్వసముం డనంబడు.

(తెభా-5.2-87 క. )[మార్చు]

చం దురునకు మీఁదై యా
నం దంబున లక్ష యోజనంబులఁ దారల్
క్రం దుకొని మేరు శైలం
బం ది ప్రదక్షిణము దిరుగు భిజిద్భముతోన్.

(తెభా-5.2-88 సీ. )[మార్చు]

ట మీఁదఁ దారల న్నిటి కుపరి యై;
రెండులక్షల శుక్రుఁ డుండి భాస్క
రుని ముందఱం బిఱుఁదను సామ్యమృదు శీఘ్ర;
సంచారములను భాస్కరుని మాడ్కిఁ
రియించుచుండును నులకు ననుకూలుఁ;
డై వృష్టి నొసఁగుచు నంతనంతఁ
తురత వృష్టి విష్కంభక గ్రహశాంతి;
నొనరించువారల కొసఁగు శుభము;

(తెభా-5.2-88.1-తే. )[మార్చు]

లుండు నా మీఁద సౌమ్యుండు రెండులక్ష
ను జరించుచు రవిమండలంబుఁ బాసి
కానఁబడినను జనులకు క్షామ డాంబ
రాది భయములఁ బుట్టించు తుల మహిమ,

(తెభా-5.2-89 సీ. )[మార్చు]

రణీతనూజుఁ డంటిమీఁద రెండుల;
క్షల నుండి మూఁడు పక్షముల నొక్క
రాశి దాఁటుచు నుండుఁ; గ్రమమున ద్వాదశ;
రాసుల భుజియించు రాజసమున;
క్రించియైన నక్రత నైనను;
ఱచుగాఁ బీడలు రుల కొసఁగు;
నంగారకుని టెంకి కావల రెండుల;
క్షల యోజనంబుల నత మించి

(తెభా-5.2-89.1-ఆ. )[మార్చు]

యొక్క రాశినుండి యొక్కొక్క వత్సరం
నుభవించుచుండు మరగురుఁడు
క్రమందు నైన సుధామరులకును
శుభము నొసఁగు నెపుడు నభినవముగ.

(తెభా-5.2-90 క. )[మార్చు]

సు గురునకు మీఁదై భా
స్క సుతుఁ డిరు లక్షలను జములకు బీడల్
పుచుఁ ద్రింశన్మాసము
రుదుగ నొక్కొక్క రాశియందు వసించున్.

(తెభా-5.2-91 క. )[మార్చు]

ప్రా టముగ రవి సుతునకు
నే కాదశలక్షలను మహీసురులకు నీ
లో కులకు మేలు గోరుచుఁ
జో గ మునిసప్తకంబు సొంపు వహించున్.

(తెభా-5.2-92 క. )[మార్చు]

ము నిసప్తకమున కెగువం
రుచు నా మీఁదఁ ద్రియుతశలక్షలఁ బెం
పు శింశుమారచక్రం
నఁగా నిన్నిఁటికి నుపరి గుచుండు నృపా!

(తెభా-5.2-93 సీ. )[మార్చు]

శింశుమారాఖ్యగు చక్రమున భాగ;
తుఁడైన ధ్రువుఁ డింద్ర రుణ కశ్య
ప్రజాపతి యమప్రముఖులతోఁ గూడి;
హుమానముగ విష్ణుదముఁ జేరి
కణఁక నిచ్చలుఁ బ్రదక్షిణముగాఁ దిరుగుచుఁ;
జెలఁగి యుండును గల్పజీవి యగుచు;
నఘుఁ డుత్తాన పాదాత్మజుఁ డార్యుఁడు;
యిన యా ధ్రువుని మత్త్వ మెల్లఁ

(తెభా-5.2-93.1-తే. )[మార్చు]

దెలిసి వర్ణింప బ్రహ్మకు నలవిగాదు
నే నెఱింగినయంతయు నీకు మున్న
తెలియఁ బలికితిఁ; గ్రమ్మఱఁ దలఁచికొనుము
జితరిపువ్రాత! శ్రీపరీక్షిన్నరేంద్ర!

(తెభా-5.2-94 వ. )[మార్చు]

మఱియు నా ధ్రువుండు గాలంబుచేత నిమిషమాత్రం బెడలేక సంచరించు జ్యోతిర్గ్రహ నక్షత్రంబులకు నీశ్వరునిచేత ధాన్యాక్రమణంబునఁ బశువులకై యేర్పఱిచిన మేధిస్తంభంబు తెఱంగున మేటిగాఁ గల్పింపంబడి ప్రకాశించుచుండు; గగనంబు నందు మేఘంబులును శ్యేనాది పక్షులును వాయువశంబునం గర్మసారథులై చరించు తెఱంగున జ్యోతిర్గణంబులును బ్రకృతిపురుష యోగ గృహీతాశులై కర్మనిమిత్తగతి గలిగి వసుంధరం బడకుందురు.

(తెభా-5.2-95 క. )[మార్చు]

పొం దుగ జ్యోతిర్గణముల
నం ఱ నా శింశుమారమందుల నుండం
గొం ఱు దఱచుగఁ జెప్పుచు
నుం దురు; వినిపింతు, విను మనూనచరిత్రా!

(తెభా-5.2-96 క. )[మార్చు]

క్రిందై వట్రువ యై
లితమగు శింశుమార క్రము నందున్
నె కొని పుచ్ఛాగ్రంబున
ని లిచి ధ్రువుం డుండు నెపుడు నిర్మల చరితా!

(తెభా-5.2-97 వ. )[మార్చు]

మఱియు; నా శింశుమార చక్రపుచ్ఛంబునఁ బ్రజాపతియు నగ్నీంద్ర ధర్ములును, బుచ్ఛమూలంబున ధాతృవిధాతలును, గటిప్రదేశంబున ఋషిసప్తకంబును, దక్షిణావర్తకుండలీభూతభూత శరీరంబునకు నుదగయన నక్షత్రంబులును, దక్షిణపార్శ్వంబున దక్షిణాయన నక్షత్రంబులును, బృష్టంబున దేవమార్గంబును, నాకాశగంగయు నుత్తర భాగంబునఁ బునర్వసు పుష్యంబులును, దక్షిణభాగంబున నార్ద్రాశ్లేష లును, దక్షిణ వామ పాదంబుల నభిజి దుత్తరాషాఢలును, దక్షిణ వామ నాసారంద్రంబుల శ్రవణ పూర్వాషాఢలును, దక్షిణ వామ లోచనంబుల ధనిష్ఠా మూలలును, దక్షిణ వామ కర్ణంబుల మఘాద్యష్ట నక్షత్రంబులును, వామ పార్శ్వంబున దక్షిణాయనంబును, దక్షిణ పార్శ్వంబునఁ గృత్తికాది నక్షత్ర త్రయంబును, నుత్తరాయణంబును, వామ దక్షిణ స్కంధంబుల శతభిగ్జ్యేష్ఠలును, నుత్తర హనువున నగస్త్యుండును, నపర హనువున యముండును, ముఖంబున నంగారకుండును, గుహ్యంబున శనైశ్చర్యుండును, మేఢ్రంబున బృహస్పతియును, వక్షంబున నాదిత్యుండును, నాభిని శుక్రుండును, మనంబునం జంద్రుండును, స్తనంబుల నాశ్వినులును, బ్రాణాపానంబుల బుధుండును, గళంబున రాహువును, సర్వాంగంబులఁ గేతుగ్రహంబును, రోమంబులఁ దారలును నుండు; నది సర్వదేవతామయంబైన పుండరీకాక్షుని దివ్యదేహంబు ధ్రువునింగా నెఱుంగుము.

(తెభా-5.2-98 సీ. )[మార్చు]

ట్టి దివ్యశరీర మెవ్వఁడు ప్రతిదినం;
బందు సంధ్యాకాల తులభక్తి
నమందు నిలిపి యేఱక మిక్కిలి ప్రయ;
త్నంబున నియతుఁడై త్త్వబుద్ధి
మౌనవ్రతంబునఁ బూని వీక్షించుచు;
నీ సంస్తవంబు దానెంతొ ప్రేమ
పియించి కడుఁ బ్రశస్తమును మునీంద్ర సే;
వ్యమును జ్యోతిస్వరూమున వెలుఁగు

(తెభా-5.2-98.1-ఆ. )[మార్చు]

విపుల శింశుమార విగ్రహంబునకు వం
నము వందనంబు నుచు నిలిచి
న్నుతించెనేని కలార్థసిద్ధులఁ
బొందు మీఁద ముక్తిఁ జెందు నధిప!

(తెభా-5.2-99 క. )[మార్చు]

మండలంబునకుఁ గ్రిం
ను దశసాహస్ర యోజనంబుల స్వర్భా
ను ని మండలంబు గ్రహమై
ముగ నపసవ్యమార్గతి నుండు నృపా!

(తెభా-5.2-100 క. )[మార్చు]

సురాధముఁడగు రాహువు
బి రుహసంభవుని వరము పెంపున నెంతో
యగు నమరత్వంబున
మానంబైన గ్రహవిహారముఁ బొందెన్.

(తెభా-5.2-101 సీ. )[మార్చు]

ననాథ! రాహువు న్మకర్మంబులు;
వినిపింతు ముందఱ విస్తరించి
యుత యోజన విస్తృతార్క మండలము ద్వి;
ట్సహస్ర విశాల చంద్రమండ
ముఁ బర్వకాలంబును ద్రయోదశ సహ;
స్ర విశాలమై మీఁద రాహు గప్పు
ది చూచి యుపరాగ నుచును బలుకుదు;
రెల్ల వారును స్వధర్మేచ్ఛు లగుచు;

(తెభా-5.2-101.1-ఆ. )[మార్చు]

నంతలోన నినశశాంక మండలములఁ
రుణఁ బ్రోవఁదలచి రిసుదర్శ
నంబు వచ్చునను భయంబున నై దాఱు
డియలకును రాహు డిఁకి తొలఁగు.

(తెభా-5.2-102 క. )[మార్చు]

వర! యా రాహువునకు
సత నా క్రింద సిద్ధ చారణ విద్యా
రు లయుత యోజనంబులఁ
ది ముగ వసియించి లీలఁ దిరుగుదు రచటన్.

(తెభా-5.2-103 క. )[మార్చు]

రికింప సిద్ధ విద్యా
రులకుఁ బదివేలు క్రింద రలక యక్షుల్
ఱియును భూతప్రేతలు
రియింతురు రాక్షసులు పిశాచులు గొలువన్.

(తెభా-5.2-104 ఆ. )[మార్చు]

వారి క్రిందఁ దగిలి వాయువశంబున
లయుచుండు మేఘమండలంబు
మేఘమండలంబు మీఁ దగుచుండు భూ
మండలంబు క్రిందనుండు నధిప!
21-05-2016: :
గణనాధ్యాయి 10:49, 16 సెప్టెంబరు 2016 (UTC)