పుట:Yogasanamulu.djvu/98

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

యోగాసనములు

97


49 వృష్ట బద్ధ పతంగాసనము

పతంగాసనములో వలెనే బోరగిల పద్మాసనమున పరుండి రెండు చేతులతో వీపు మీద నుండి రెండు కాళ్ళను పట్టుకొని మెడ, శిరస్సును పైకి ఎత్తి చూడవలయును.

ఉపయోగములు
పైన చెప్పిన వతంగాసనము ఫలితమునే ఇచ్చును.

50. తిత్తిబాసనము

బోరగిల పరుండి రెండు చేతుల ప్రేళ్ళను వెన్నుకిరుప్రక్కల యందుంచి మోకాళ్ళను పిరుదులకు తాకునట్లుంచి మెడ, ముఖము రొమ్ము పైకి ఎత్తి వుంచవలయును.


ఉపయోగములు
వెన్నెముక బాగుగామెత్తగా వంగును. మెడ కండరములు బలపడును.

51. కపోతాసనము

మోకాళ్ళవద్ద నుండి పాదముల వరకు నేలకు ఆనించి కూర్చుని రెండు చేతులను రెండు తొడల మధ్య నుండి కాళ్ళ బొటన వ్రేళ్లను పట్టుకొని పైకి చూడ వలయును. భుజములు నేలను తాకనవసరము లేదు.

ఉపయోగములు
దీని వలన మోకాళ్ళూ, పాదముల గుత్తిలు మెడ కండరములు బలపడును.