ఈ పుట ఆమోదించబడ్డది
యోగాసనములు
69
ఒకటి గట్టిగా అదిమి వుంచి మోకాళ్ళను భూమి మీద ఆనించి కూర్చొన వలయును.
- ఉపయోగములు
- దీని వలన సమస్త వాత రోగములు నివారించ బడును. మరియు ప్రాణము ఊర్ద్వ గతి చెందును. సాధకుడు ఊర్థ్వ రేతస్కుడగును.
25. ఉత్తాన కూర్మాసనము :
పైన చెప్పినట్లు కూర్మాసనము వేసి మోకాళ్ళను పైకి ఎత్తవలయును.
- ఉపయోగములు
- కూర్మాసనములోని ఉపయోగములే వర్తించును.