పుట:Yogasanamulu.djvu/69

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

68

లంక సూర్యనారయణ


యును. పాదముల నుండి మోకాళ్ళ వరకు నేల మీద ఆని వుండును. అటులనే రెండు చేతులు నేలపై ఆని వుండును.

ఉపయోగములు

మోకాళ్ళు బలముగా వుండును. వెన్ను బిరుసుతనము లేక చక్కగా వెనుకకు వంగును.

24. కూర్మాసనము :

తిన్నగా కూర్చుని మోకాళ్ళు వంచి రెండు పాదములను రెండు తొడలకు ప్రక్కగా మడమలు పిరుదులు క్రింద ఉండునట్లు వుంచుము. ముందునకు వంగి చేతులు రెండు, రెండు మోకాళ్ళకు ఇరుప్రక్కల వుంచి మోచేతులు వంచుము. ఎదురుగా చూడవలయును.

రెండవ పద్దతి: మూలాధారము (గుదము)నకు ఇరువైపుల రెండు కాలి మడమలను ఒక దానికి అడ్డముగా