ఈ పుట ఆమోదించబడ్డది
44
లంక సూర్యనారయణ
అప్రయత్నముగా శుక్రమును బహిష్కరింపబడనీయదు. శుక్రము బహిష్కరింపబడక ఓజస్సుగా మారి సుషుమ్న గుండా ఊర్ద్వ ముఖముగా ప్రసరించి శరీరమంతను వ్యాపించును. అందుచేత సిద్ధుడైన యోగిని ఊర్థ్వ రేతస్కుడని యందురు.
ఆసనము చేయు పద్ధతి: సాధకుడు కాళ్ళు రెండును ముందునకు చాచి కూర్చొని ఎడమ కాలిని మోకాలి వద్ద నుంచి మడమను లింగస్థానమునకునూ గుదస్థానమునకునూ మధ్య ఉంచి కుడికాలి మడమను లింగస్థానము మీద ఉంచి గడ్డమును రొమ్మున హత్తించి వెన్నెను మేదను శిరస్సునకు తిన్నగా ఉంచవలయును. అపుడు దృష్టి భ్రూమధ్యమున అర్థనిమాలితముగా ఉంచవలయును.
సిద్ధాసనమును పలు విధములుగా కూడ ఆచరించు చున్నారు:
మతాంతర సిద్ధాసనము:
ఎడమకాలి మడనును లింగస్థానమున వుంచి కుడికాలి మడమను ఎడమకాలి మడము పైనుంచి నాసికాగ్రమున దృష్టి నిలుపునది.