పుట:Yogasanamulu.djvu/27

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

24


మునకు గల సంబంధము నీరు, ఆవిరికీ వన్న సంబంధము వంటిది. సూక్ష్మ శరీరమున వున్న ఏడు చక్రములు యోగ శాస్త్రమున అతి ప్రాముఖ్యములైనవి. అన్ని చక్రేములకు పైనున్న ఏడవ చక్రమైన సహస్త్రామున పరమేశ్వరునికి నిలయమని చెప్పబడినది. ఈ విషయము నిరూపించుటకే శ్రీ వేంకటేశ్వర స్వామి వారిని ఏడు కొండలపై ప్రతిష్టించిరి. ఏడు కొండల వాడని శ్రీ వేంకటేశ్వర స్వామిని భక్తులెల్లరు కొలుచు చున్నారు. ఈ చక్రముల స్థానములు శరీరమున వున్న నెలవులను మరి కొన్ని వివరణములను తెలిసికొందము.

చక్ర వివరణ

మూలాధార చక్రము:... కంద స్థానమనునది నాభికిని లింగ స్థానమునకు మధ్యగా నున్నదని యిదివరకు చెప్పి యుంటిమి. అట్టి కంద స్థానమునకు దిగువను వెను బామునకు చివరను గుద స్థానమునకు కొంచెము పైగా నున్నది. ఇది నాల్గు దళములు గల పద్మము. వం, శం, షం, సం అను నాలుగు బీజాక్షరములు ఇందు ఉత్పన్నమయినవి. ఇది పృద్వీ (భూమి) తత్వము గలది. ఆకారమున చతురస్త్రముగా నుండును. వాసనతో కూడిన పశుపు రంగుగా నుండును. ఆ చక్రమునకు ఆధి దేవత విఘ్నేశ్వరుడు. దేవత ఢాకిని, భీజాక్షరము "లం " ఇందు బ్రహ్మ గ్రంధి అను నాటీ కేంద్రము యున్నది. దీనిని ఆంగ్ల వైద్య శాస్త్రమున శాక్రల్ ప్లెక్సన్ " అని చెప్ప బడినది.