పుట:Yogasanamulu.djvu/197

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

196

లంక సూర్యనారయణ


వాయువు సుషుమ్న యందు ప్రవేశించునపుడు ఉన్మన్యవస్థ తప్పక కల్గును.

ధ్యానము
.......

మనస్సును ఇంద్రియములలో సంయోగము చెందనీయ కుండుట ప్రత్యాహారమని చెప్పితిమి. అందువలన ఇంద్రియములు వశీకరణము కల్గును. మనసు కూడ వశమగు చున్నది. అట్లు వశీకరణమయిన మనస్సును ఒక ప్రత్యేకించిన వ్యాపారమందుగాని స్థాన మందు గాని నియమించుట ధారణము అని చెప్పితిమి. అట్లు నియమించిబడిన మనస్సును ఏక భావ ప్రవాహ రూపమున నున్న స్థితిని ధ్యానమని చెప్పుదురు. స్వాభావికముగా మనస్సు బహు చఫలమగుట చేత దీనిని పాదరసముతో పోల్చి యున్నారు. నిత్యము సంకల్పములు చేయుచు వికల్పము చేయుచు మరల మరల సంకల్ప వికల్పములను చేయుచునే యుండును. దీనికి కారణము శరీరమున ప్రాణము (శ్వాస) ఎంతవరకు చలించు చుండునో మనస్సు అంత వరకు చలించును. చిత్తమును ఏకాగ్ర స్థితికి రానీయదు. చిత్తమునేకాగ్ర పరచుటకు ప్రాణమును జయించి లయము చేయ వలయును. అపుడు మనస్సు లయమగును. అట్లు లయమయిన మనస్సును ధారణ చేసి అనగా ఒక చోట నియమించి యుంచి దానిని ఏకధార రూపముగా ఎక్కువ కాలముంచుటను ధ్యాన మనబడు చున్నది. యిట్టి స్థితి భక్తితో తన్మయత్వము పొందుట చేతను మరియు యోగము చేత సాధ్యమగు చున్నది. ధ్యాన