పుట:Yogasanamulu.djvu/190

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

యోగాసనములు

189


లను క్రమ క్రమముగా పెంచు చుండ వలయును. ముందుగా చేయు చున్న కపాల భాతి యందు ఘర్షణ జరుగు చున్నది. ఘర్షణ అనగా ఉస్ఛ్వాస, నిశ్వాసములను శబ్దముతో కూడిన వేగముగా చేయుట. వాయువును పూరించగనే ఒక గ్రుక్క వేసి (అనగా మింగుట) జాలంధర బంధమును, మూల బంధమును వేయవలయును. కుంభకము సగ భాగము వున్నదనగా ఉడ్డి యాన బంధము చేసి పరీధాన యుక్తి పరీచాల క్రిదులను చేసి తాడన క్రియను సల్పి తరువాత మహా ముద్రను వేసి క్రమము చొప్పున రేచకమును నెమ్మది నెమ్మదిగా చేయ వలయును. ప్రారంభ దశలో ఒక కుంభకమునకు మరియొక కుంభకమునకు నడుమ కొంచము సేపు ఒకటి రెండు ధీర్ఘ ఉచ్చ్వాస నిశ్వాసములు చేయ వచ్చును. సాధన అభివృద్ధి పొందిన తరువాత కుంభకము వెంట మరియొక కుంభకము చొప్పున 80 ఎనుబది కుంభకములు చేయు చుండ వలయును. ఇట్లు చేయుట వలన యోగ నాడీ మండలము శుద్ధి యగును. సుషుమ్న నాడి యందలి మల పదార్థములు అన్నియు ఇరిగి పోయి సన్నని ఖాళీ గొట్టము వలె నుండును. నాడీ మండలము శుద్ధి యగుట వలన అనాహత శబ్ధములు శుద్దముగా వినబడును. మనస్సును ఒక చోట లగ్న పరచి దృష్టిని నాసికాగ్రమున గాని భ్రూమధ్యమున గాని లేక అనాహత, మణి పూరక చక్రములలో ఒక దాని యందు నిలిపి వుంచి కొంత సేపు కేవల కుంభకమును సాధనము చేయ వలయును. కేవల కుంభకమనగా పూరక రేచకములు లేని యవస్థ. ఇట్లు సాధన చేయు అవస్థయందు మనస్సు లయమగును. అదే విధముగా నాదమున