పుట:Yogasanamulu.djvu/166

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

యోగాసనములు

165

గురించి ప్రస్తావించ లేదు. కాని హఠయోగ ప్రదీపిక కుండలిలోపనిషత్తు వంటి గ్రంధముల యందు దీనిని గురించి ప్రత్యేకముగా విపులీకరింప బడినది. కుండలిని అనునది శక్తి యొక్క రూపము. ఇది సర్పాకృతిని పొంది చుట్టలుగా చుట్టుకొని నాభి యందు గల కంద స్థానమున ఉన్నది. ఈ కంద స్థానము నుండియే సూక్ష్మ నాడీ మండలము ప్రసరించు చున్నది. ఇది నాబ్ హికిని లింగ స్థాఅమునకు వధ్యగా వున్నది. ఇచటనున్న శక్తి చుట్టలుగా చుట్టుకొని ఉన్నందున కుండలని యని పిలువ బడెను. ఆకుండలిని మూలాధారమున ఉన్న సుషమ్న నాడీ యొక్క ఒక చివర యందు ముఖము వుంచి నిద్రించు చుండును. యోగులు తమ సూక్ష్మ నాడీ మండలమును ప్రాణాయామము ద్వారా ఎట్టి అడ్డంకులు లేకుండా శుద్ధి చేసుకొని యోగాగ్నిని రగుల్కొల్పి నిద్రలోనున్న కుండలిని నిద్ర నుండి లేపి శుద్ధిగా ఉన్న సుషమ్న గుండా షడ్చక్రములను గ్రంధి త్రయమును చేదించుకొని సహస్రారమున వున్న పరమ శివుని పొందునని శ్రీ శంకర భగవత్పాదులు తెలిపి యున్నారు. పిండాండమున నున్న ఈ మహా శక్తియే బ్రంహ్మాండమున ఎన్నొ విధముల రూపమును ధరించి సృష్టికి తోడ్పడుచున్నది. విద్యుచ్చక్తి, అయస్కాంత శక్తి, పీడన శక్తి , అణు శక్తి ఇత్యాది రూపములు ఎన్నో తెలుపుటకు లెక్కకు మీరి యున్నవి. పిండాండమున నిద్రలో ఉన్న ఆకుండలిని మేల్కొల్పుటకు కొన్ని ఉపాయములను మన మహర్షులు చెప్పియున్నారు. అందున 1. సరస్వతీ చాలనము. 2. ప్రాణాయామమను రెండు సాధనములను పూనికతో అభ్యసింప వలయునని చెప్పిరి.