పుట:Yogasanamulu.djvu/165

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

164

లంక సూర్యనారయణ

వలెను. వజ్రోలి ముద్ర సాధనకు ఉద్యానమును చక్కగా నేర్చుకొన వలయును. కొన్ని దినములిట్లు నోటితో నీటిని లోనికి ఊదిన తరువాత గళ్ళ అవసరము లేకుండ బయట నున్న నాళము (గొట్టము) కొనను గోరు వెచ్చని నీటిలో ఉంచి ఉద్వానము చేసినట్లయిన నీరు లోపలికి ప్రవేశించును. అట్లు నీటిని లోపలి లాగెడు శక్తి వృద్ధి చేసుకొన వలయును. ప్రారంభములో నీటిలో వున్న పాత్రను లింగమున్న ఎత్తుకన్నా ఎక్కువ ఎత్తులో వుండి ఉడ్యానము చేసిన తేలికగా నీలు లోపలకు ప్రవేశించును. ఆ ఎత్తును నిమ్మది నెమ్మదిగా తగ్గించి లింగ మున్న స్థానముకన్నా తక్కువ ఎత్తులో వుంచి నీటిని పైకి లాగు నట్టి శక్తిని పొందవలెను. ఇది ఉద్యానము యొక్క శక్తి పై ఆధార పడి యుండును. ఉద్వానములు చేయు విధమును త్రిబంధములను గూర్చి చెప్పినపుడు వివరించ బడినది. నీటిలో అభ్యసించిన వెనుక నూనె, తేనెలతో సాధనము చేయ వలెను. దీని వలన రతస్సు బహిర్గతము కానేరదు. ఇంద్రియము శరీరమున నీరు ఆవిరియై సూక్ష్మ ఫూపమూ ధరించిన రీతి ఓజస్సుగా మారును. అపుడు యోగి ఉర్ద్వ రేతస్కుడగును. అతిశయించిన వజ్రోలి సామర్థ్యము వలన పతన మయిన రేతస్సును సయితము పైకి తీసుకొన గల్గును. ఈ వజ్రోలి పురుషులే కాక స్త్రీలు కూడ చేయ వచ్చును. దీనిని స్త్రీ వజ్రోలి అనిరి. దీని వలన అనగా వజ్రోలి వలన యోగులు అవివాహితులు కాదనియు యోగులు వివాహిలై పత్నులతో సంసారము చేయు చుండినట్లు తెలియు చున్నది.

పతంజలి మహర్షి తన యోగ సూత్రముల యందు కుండలిని