పుట:Yogasanamulu.djvu/159

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

158

లంక సూర్యనారయణ


యధావిధి 1 : 4 : 2 నిష్పత్తిలో పూర్ఫక, కుంభక, రేచకములను సలుపవలయును. రెండ వైపు కూడా అటులనే చేయ వలయును. మహా సిద్ధులను ప్రసాదింప సమర్థవంత మైనది.

3. మాహావేధ

మహా బంధముద్ర యందుండి వాయువును పూరించి జలంధర బంధమును ధరించి శరీరమునకు యిరు ప్రక్కల యందు భూమి మీద చేతులు ఆనించి శరీరమును కొంచెము పైకి లేపి పిరుదులను భూమి మీద కొట్ట వలయును. ఈ విధముగా పిరుదులను నేలపై కొట్టుటను రేచకమునకు ముందునను, కుంభకమునకు వెనుకను చేయ వలయును. దీని వలన ప్రాణము సుషుమ్న యందు ప్రవేశించుటకు అనుకూల పడును. ఇది సిద్ధులను ప్రసాధించ సమర్థత గలది.

.4. ఖేచరీ ముద్ర

ఇడ, పింగళ నాడుల నిరోధము వలన ప్రాణ వాయువు సుషుమ్న యందు చేరుచున్నది. ఆ విధముగా సుషుమ్న యొక్క ఒక కొననుండి ప్రాణ వాయువు చేత నింపి, మరియొక కొనను నాలుక చేత బంధించ వలయును. అదియే ఖేచరీ ముద్ర స్వభావము. అందున ప్రాణము లయము కాగా మనస్సు లయమగు చున్నది. అందుల కొరకు నాలుకను కొండ నాలుక ఆవలనున్న పాలకుహరమున ప్రవేశ పెట్ట వలయును. అపుడు దృష్టిని అజ్ఞా క్రమందు నిలిపి వుంచ వలయును. అటుల చేసిన దానిని ఖేచరీ ముద్ర అందురు. నాలుక కపాలకుహరమున ప్రవేశింప వలెనన్న