పుట:Yogasanamulu.djvu/158

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

యోగాసనములు

157


బంధములన వేసి రెండు చేతులతోను ఎడమకాలి (మోకాలును వంచకుండ) వ్రేళ్ళను పట్టుకొని ముఖమును ఎడమ మోకాలిని ఆనించి ఎడమ రొమ్మును, ఎడస్మ ప్రక్కటెముకలను ఏడమ కాలికి ఆను నట్లు కష్టము కల్గు వరకు వుంచి లేచి రేచించ వలయును. పూరక, కుంభక, రేచకములు 1: 4 : 2 నిష్పత్తిలో జరుగ వలయును. మరల రెండ ప్రక్క కూడ అటులనే చేయుము. దీని వలన ప్రాణాపానములు సంయోగము పొంది నాడీ మండలము శోధింపబడి శుద్ధ మగును. ప్రాణము సుషుమ్న మందు ప్రవేశించును. కనుక ఇది యోగ సిద్ధికి దోహద కారి. దీని వలన జీర్ణ కోశమునను, మలాశయమునను వున్న రోగములు, క్షయ, మూల వ్యాధి, గుల్మములు, కష్టములు, పంచ మహా క్లేశములు అవిద్య, అభినవ అస్తిగత, రాగ, ద్వేషములు) నశించును. మహా సిద్దులను ప్రసాదించు సామర్థ్యము గలది మహాముద్ర. ఇది చాల రహస్యమైనది యోగుల చేత చెప్పబడినది.

2. మహాబంధము

కూర్చొని ఎడమ కాలి మడమను యోని స్థానమున చేర్చి ఎడమ తొడ మూల మీద కుడి పాదమును వుంచి రెండు నాసిక రంధ్రములచేత వేగముగను, పొడవుగను, ఘర్షణ శ్వాసల కొన్నింటిని చేసి తరువాత వామనాడిలో ధీర్ఘముగా వాయువును పూరించి జలంధర బంధము చేసి అనగా గడ్డమును రొమ్ము మూలమందు గట్టిగా హత్తించి మూల బంధము చేసి అనగా గుదమును గట్టిగా పీడించ వలయును. (కొందరు రెండు చేతులలోను కుడి మోకాలిని పట్టుకొనవలయునని కొందరు మార్షులు చెప్పిరి)