పుట:Yogasanamulu.djvu/15

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

12



తత్రతం బుద్ధి సంయోగం లభతే పౌర్వ దేహికం
యత తేచ తతో భూయః సంసిద్దౌ కురునందన||
పూర్వాభ్యాసేనతేనైవ హ్రియతే వ్యావసో పీవా
జిజ్ఞా సురపి యోగస్య శబ్ద బ్రహ్మతో వర్తతే ||

.......................... భగవద్గీత ...అ ఆ || 4 | 44 శ్లో.||

యోగ భ్రష్టుడైన ఒక సాధకుడు యజ్ఞము వంటి పుణ్య కార్యము లొనర్చు వారికి ప్రాప్తించు సుఖములతో గూడిన పుణ్య లోకములు ప్రాప్తించును. తరువాత (అనగా పుణ్యము క్షీణించిన పిదప) శుచి వంతులు శ్రీ మంతులయిన వారి ఇంట జన్మించును. లేదా యోగులయినట్టి ధీమంతులయిన వారింట జన్మించును. అప్పుడు తాను ఇచ్చగించక పోయినను యోగము వైపునకు ఆకర్షింప బడి ఎక్కువగా కృషి చేసి బ్రహ్మైక్యము పొందును.

ప్రాణ అపానముల సంయోగమే యోగమనియు అట్టి స్థితిలో చిత్త వృత్తులు నిర్మూలింప పడుననియు చిత్తము ఏకాగ్రతను పొంది పరిణితి చెంది సమాధి స్థితిని ప్రాప్తింప జేయుననియు సమాధి యందు జీవుడు పరబ్రహ్మమున లయమంది అనిర్వచనీయమైన ఆనందమును పొందుననియు శాస్త్రము లందు చెప్పబడినది. అట్టి ఆనందమయ స్థితిని విడిచి వచ్చుటకే సాధకుడు ఇచ్చగింపడు. ఇట్లు ప్రాణాపాయములు చిత్తమున లయమగుట చేత దీనిని లయ యోగమని కూడ అందురు. ఆంధ్ర దేశమున మహా మహిమోపేతుడయి విరాట్ శ్రీ వీర బ్రహ్మేంద్రులు యోగ శాస్త్ర రహస్యములన్నియు సత్యములని నిరూపించి శాస్వత సమాధి నిష్టులైనారు.