ఈ పుట ఆమోదించబడ్డది
యోగాసనములు
139
రెండు పాదములపై తిన్నగా నిలబడి, ఒక కాలిని రెండవ కాలికి ముందు నుండి పెనవేయుము. అటులనే చేతులు కూడ ఒకదానితో మరియొకటి పెనవేయుము. రెండ ప్రక్క కూడ అటులనే చేయవలయును.
- ఉపయోగములు
- గిలక, వరిబీజము వంటి రుగ్మతలు నివారణ యగును.
101. చక్రాసనము
నిలువుగా నిలబడి చేతులు రెంటిని పైకి ఎత్తి నెమ్మది నెమ్మదిగా చేత్లను తలతో పాటు రెండూ చేతులూ వంచుతూ నేలకు ఆనించ వలయును. ఇది చక్రమును పోలియుండును కావున చక్రాసనమనిరి.
- ఉపయోగములు
- వెన్ను పూసలు చుట్టునున్న కండరముల సంధి భందములు మెత్తబడి చక్కగా వంగును. నడుములోను వెన్నులోను ఉన్ననొప్పులు నివారించ బడును. జీర్ణ శక్తి వృద్ధి యగును.