పుట:Yenki Paatalu Nanduri Venkata Subba Rao.pdf/5

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

తనిసి తనియింపజేయుటకును వీలైనట్టివి. నిక్కమగు ప్రేమయును, దాంపత్య భావమును, ధర్మపరతయును యొట్టి యాదర్శములను గలిగియుండునో యను విషయమును, ఈ పాటలంత తేటతెల్లవబ"గా-సాధారణ జనమున కంతటికిని తెల్పగల గేయము లివితప్ప మనలో నితరములు లేవనుట సత్యదూరము కాదు. సుబ్బారావు పంతులుగారు గానము చేసిన యీ పాటలలో భావము కంటెను మున్ముందుగ భాషయును, భాషకంటెనును మున్ముందుగ భావమును, నహ మహమికతో బర్వులెత్తుచుండును. వీయొక్క స్థలమున నైనను వీని గమనము నందు యేమాత్రమైనను కుంటుపడిన దేమోయని యెంతగ. వెదకినను మచ్చునకై నను నాకు అట్టిది యిందు కొనవచ్చుటలేదు. వీరు యీ గేయములందు కూర్చిన పదములుగాని, పదార్థ ములుగాని కొందఅు కొందeు కవితలలోవలె ప్రయత్న విశేమమున నేర్చి తెచ్చి కూర్చిన వెంతమాత్రమునుగాక ప్రతినిత్యమును మన కన్నులయెదుట-క్షణక్షణమును గోచరించుచున్నవే యగుట యెన్నదగిన ప్రధానమగు విశేవము. ఇట్లయ్యను, వాని నీ కవికుమారుడు గేయరూపమున గూర్చి సహృదయలోకి ము సన్నిధిని ప్రదర్శించినప్పడు మాత్రము-యెట్టివారి కైనను “ఔరౌరా?-యని యనిపించునంతటి మహోజ్జ్వలత వీనియందు విల సిల్లి-తత్వభౌవమున శ్రోతల హృదయసీమలు ఒక్క-మాటుగా మిరుమిట్టు గొనుటయును కలుగుచున్నది. భావనాధనులగు ఘనుల కవితలయం దింతటి sక్తిసామర్థ్యము లున్నవి గనుకి నే మన పూర్వికులు శ్లో, తపన పదవిన్యాసా8 వార్థవిభూతయః, తధాపి సవ్యం భవతి కావ్యం గ్రథన కౌశలాత్ -

అని కవిసృష్టిని ఆనంద సరినూచకములగు శిరఃకంపనములతో గారవించి యున్నారు. ఇట్టి ప్రశంస్యతమములగు శక్తిసామర్థ్యముల నలపరచకొనిన కుమారుడు-మన యాంధ్ర వాజ్మయమునఁ బొడసూపటయును-నందునను మనమున్న నీ యిర్వదవ శతాబ్దిని-మన కన్నులయెదుట-మన కవితామతల్లినియీ విధములగు దివ్యప్రసూనముల నర్చించి మనల "నానందసాగరమున నోల లాడించుటయును చూడగల్లిన ననుబోటుల జీవితములు ధన్యములను, ధన్య తపములను-అని యనుటలో నావంతరమును సందియము లేదు. మొత్తముమిూద నింతవజకు నీకవి గానముచేసిన యీ ప్రణయపూతము లగు గేయములు ముప్పదియైదు వరకును గలవు. క్రమవికాసమును భావ