పుట:Womeninthesmrtis026349mbp.pdf/45

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

ద్వితీయాధ్యాయము

27

పురుషుని యుపనయన వయస్సునుగూర్చి ముందు వివరింపబడనున్న గౌ. 1-5,8 చూడుడు.

వివాహవయస్సు కాకపోయినను తగినవరుడు లభించినచో కన్యకు వివాహము చేయవలెనని మనువు చెప్పుచున్నాడు.

    ఉత్కృష్టాయాభిరూపాయ వరాయసదృశాయచ
    అప్రాప్తామపితాం తస్మై కన్యాందద్యాద్యథావిధి.

(మను 9-88)

(వయస్సురాని కన్యనుగూడ సుత్కృష్టుడును మంచి రూపముగలవాడును, సమానవర్ణుడును నగువరునకు యథావిధిగ నీయవలెను.)

ఇచట 'అప్రాప్తాం' అని చెప్పుటచేతనే స్త్రీకి నిర్ణీతమగు వివాహ వయస్సొకటి మనువు నభిప్రాయములో గలదని తేలుచున్నది.

కాలే౽దాతా పితావాచ్యః

(మను 9-4)

(సకాలములో దానముచేయని తండ్రి దోషి)

అనుటచే గూడ నీయంశమే తేలుచున్నది. ఆనిర్ణీత వయస్సు ఎనిమిదేండ్లు మొదలు పండ్రెండేండ్ల లోపునని 2-67 వలనను ముందు వివరింపబడనున్న 9-94 వలనను తేలుచున్నది.