పుట:Womeninthesmrtis026349mbp.pdf/238

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

(త్రిరాత్రానంతరము సమావేశనము కావలెనని కొందఱు చెప్పుచున్నారు.)

117 వ పుటలో 17 వ పఙ్క్తిలో 'పరాశరస్మృతిలో' అనుటకు బదులు 'పురాణములలో' అని యుండవలెను.

100 వ పుటకును 101 వ పుటకును నడుమ నీక్రింది వాక్యములుండవలెను:

వసిష్ఠుడు అక్షతయోనిని వివాహమాడవలెనని చెప్పుచున్నాడు.

       అస్పృష్టమైధునామ వరయవీయసీం (వసిష్ఠ. 8-1)

దీనినిబట్టి వసిష్ఠుని మతములో యక్షతయోనిగనున్న స్త్రీని వివాహమాడవచ్చునని మాత్రమే తెలియుచున్నది. అట్టి స్త్రీ వితంతువగుచో నామెను వివాహమాడవచ్చునని యాతని మతమైనట్లీ క్రింది శ్లోకమువలన తెలియుచున్నది.

      పాణిగ్రాహే మృతేబాలా కేవలం మంత్రసంస్కృతా
      సాచేదక్షతయోనిస్స్యాత్పున స్సంస్కారమర్హతి.
                                     (వసిష్ఠ. 17 - 14)

(మంత్రసంస్కృతయు నక్షతయోనియునగు బాలికకు భర్తమరణించుచో నామె మఱల వివాహ సంస్కారమున కర్హురాలు.)