పుట:Womeninthesmrtis026349mbp.pdf/239

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

ఇట్టి పునర్వివాహములో కన్యాదానముండదు. దానమై మంత్రసంస్కారము కాకుండ భర్తను కోల్పోయిన స్త్రీకే మఱల దానము గలదని యీక్రింద శ్లోకమువలన తెలియు చున్నది.

       అద్భిర్వాచా చదత్తాయాం మ్రియాతాదౌవరోయది
       నచమంత్రోపనీతాస్యాత్కుమారీ పితురేవసా
                                         (వసిష్ఠ 17-12)

(కన్య యుదకముచేతను వాక్కుచేతను నీయబడినదై మంత్రసంస్కృత కాకుండగనే భర్తను కోల్పోవుచో నామె తండ్రికే చెందును.)

మంత్ర సంస్కారమైన పిమ్మట నామె తండ్రికి చెందదు. కావుననే మంత్ర సంస్కారము కాకుండిన కాలములో నామె తండ్రికి చెందునని చెప్పబడినది.

నారదుడు కూడ నట్టి స్త్రీకి పునర్వివాహము నంగీకరించినాడు. కాని యామె పునర్భువని యంగీకరించినాడు.

      కన్యైవాక్షతయో నిర్యాపాణిగ్రహణదూషితా
      పునర్భూః ప్రథమాప్రోక్తా పునస్సంస్కారమర్హతి
                                      (నారద. 12-16)

కావుననే నారదు డట్టి స్త్రీ యేడువిధములగు పరపూర్వలలో నొకతెనుగనంగీకరించినాడు.

      పరపూర్వా స్త్రీయస్త్వన్యా: సప్తప్రోక్తా యథాక్రమం
                                           (నారద. 12-45)