పుట:Womeninthesmrtis026349mbp.pdf/234

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

యగును. (పాణిని. 1-4-9) ఇచట షష్ఠ్యంతము లేదుకాన నార్షమనుటకు వీలులేదు. అంతేకాక, అని యుండవలెను.

70 వ పుటలో 6 వ పఙ్క్తిలో 'ఆపస్తంబపారస్కరులు' మొదలు 9 వ పఙ్క్తిలో 'నొసగుచున్నది' వఱకు లేనట్లు భావించి యాపిమ్మట నీక్రింది వాక్యములను పూరించు కొనవలెను.

పైన చేయబడిన చర్చయంతయు నాపస్తంబగృహ్య సూత్రము ననుసరించియే చేయబడినది. కాన నిపుడితర గృహ్యసూత్రముల ననుసరించి కూడ నీయంశమును పరిశీలింతము.

కొన్ని గృహ్యసూత్రములను బట్టి వివాహములోని దీక్షయొక్క పరిసమాప్తిలో దంపతులకు సమావేశసము జరుగవలెనని స్పష్టముగ కలదు.

హిరణ్యకేశి గృహ్యసూత్ర మిట్లు చెప్పుచున్నది.

అథైనాముపయచ్ఛతే (హిరణ్యకేశి 1-7-11-4)

(త్రిరాత్రదీక్షానన్తరము వరుడు వధువును పరుండబెట్టి యోనిని స్పృశించి యామెను పొందును.)

బోధాయనుడు గూడ వ్రతాన్తమం దుపనంవేశనము చెప్పుచున్నాడు. అతడు వ్రతకాలపరిమితిలో వికల్పములను సూచించియున్నాడు.