పుట:Womeninthesmrtis026349mbp.pdf/229

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

ఏకాదశాధ్యాయము

209

(సోముడు స్త్రీలకు శౌచమును, గంధర్వుడు శుభవాక్కును, అగ్ని సర్వపవిత్రతను గలుగజేయుదురు. కాన స్త్రీలు పవిత్రులు.)

కావుననే మనువు

నిత్యమాస్యం శుచిస్త్రీణాం

(మను.6-130)

(స్త్రీల ముఖమెప్పుడును పవిత్రమని చెప్పినాడు.)

పై శ్లోకమునుబట్టి రజోదర్శనమైన పిమ్మటనే కుచదర్శన మగునట్లు తేలుచున్నది. కాని కుచదర్శన మైనపిమ్మటనే రజోదర్శనమగుట లోకములో కాననగును. కాన నిచట రజస్సు వచ్చిన కన్యయనగా పరాశరుని నిర్వచనానుసారము పదేండ్లు దాటిన బాలికయని యర్థము చెప్పవలెను.

    అష్టవర్షాభవేద్గౌరీ నవవర్షాతు రోహిణీ
    దశవర్షాభవేత్కన్యా అతఊర్థ్వం రజస్వలా
(పరాశర. 1-4)

(ఎనిమిదేండ్ల పిల్లకు గౌరియనియు, తొమ్మిదేండ్ల దానికి కన్యయనియు, నాపై దానికి రజస్వల యనియు నామములు)

పతితత్వము

    నీచాభిగమనం గర్భపాతనం భర్తృహింసనం
    విశేషపతనీయాని స్త్రీణామేతాన్యపిధ్రువం

(నీచవర్ణపు పురుషుని పొందుట, గర్భము పోగొట్టు కొనుట, భర్తృహింస యనునవి స్త్రీ కత్యంతము పతన హేతువులు)