పుట:Womeninthesmrtis026349mbp.pdf/230

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

210

స్మృతికాలపుస్త్రీలు

పతితపురుషునకువలెనే పతితస్త్రీకి కూడ ఘటాశ్రాద్ధము చేయుటను స్మృతులు విధించుచున్నవి.

ఏతమేవవిధిం కుర్యాద్యోషిత్సుపతితాస్వపి

(మను. 11-188)

(వారు చనిపోయిన పిమ్మట నుత్తరక్రియలు నుద కాది దానము నుండదు.)

ఈ క్రిందివారి కుదక దాన మీయనక్కర లేదని మనుస్మృతి చెప్పుచున్నది.

    పాషాండమాశ్రితానాం చచరంతీనాం చకామతః
    గర్భభర్తృద్రుహాం చైవసురాపీనాం చయోషితః
(మను. 5-90)

(పాషండులను పొందినట్టియు, కామచారిణులైనట్టియు, గర్భమునకు భర్తకు ద్రోహము చేయునట్టియు, సురాపానము చేయునట్టియు స్త్రీల కుదక దానము లేదు.)

తఱచుగ భర్తృవాక్యము పాటింపని స్త్రీకూడ కామచారిణిగనే పరిగణింపబడినది. కాని యామెకు పతితత్వము లేదు. పజ్త్కిబాహ్యత యున్నది. ఆమె యన్నము నెవ్వరును తినకూడదు.

    భర్తృశాసనముల్లంఘ్యయాచ స్త్రీవిప్రవర్తతే
    తస్యాశ్చైవనభోక్తవ్యం విజ్ఞేయాకామచారిణీ