పుట:Womeninthesmrtis026349mbp.pdf/22

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

4

స్మృతికాలపుస్త్రీలు


(పౌత్రదౌహిత్రులకు భేదములేదు. దౌహిత్రుడు గూడ పౌత్రునివలెనే పరలోకములో తరింపచేయగలడు.)

పౌత్ర దౌహిత్రులకుగల యీసమాన ప్రతిపత్తికి గల హేతువును గూడ మనుస్మృతి చెప్పుచున్నది.

తయోర్హిమాతాపిత రౌసంభూతౌతస్యదేహత:
                                     (మను 9-133)

(పౌత్రుని తండ్రియు దౌహిత్రుని తల్లియు నాతని దేహమునుండి పుట్టినవారేగదా!)

మనుస్మృతి యిట్టి హేతువును చెప్పుచున్నను గూడ నపుత్రకుని దౌహిత్రునకు పౌత్రతుల్యత్వము నంగీకరింప జాలకున్నది. పుత్రపౌత్రులు లేనపుడే దౌహిత్రునకీ ప్రాశస్త్యము నంగీకరించుచున్నది.

దౌహిత్ర ఏవచహరే దపుత్ర స్యాఖిలంధనం
                                        (9-181)

(అపుత్రకుని ధనమునంతను దౌహిత్రుడు హరించును)

సపుత్రకుని ధనములో నన్ననో దౌహిత్రునకు పాలే లేదు (స్త్రీధనము, అను ప్రకరణమును జూడనగును.) అట్లే

పుత్రేణ దుహితాసమా.
                       (9-130)

(కుమారునితో కుమార్తె సమురాలు)

అని యంగీకరించుచున్న మనుస్మృతి పుత్రులుగల వాని యాస్తిలో కుమార్తెకు భాగము నంగీకరించుటలేదు.