Jump to content

పుట:Wikipedia Gurinchi Meeku Telusa?.pdf/8

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

పూనుకున్నది ప్రభుత్వాలూ, లక్ష్మీ పుత్రులూ కాదు..., కేవలం మనలాంటి సామాన్యులే భుజం భుజం కలిపి ఈ పని చేస్తున్నారు. ఒక్కరు కాదు, ఇద్దరు కాదు.. వందల మంది ఇందులో భాగస్తులు. పదిహేను వందల పైచిలుకు ఉత్సాహవంతులు నిరంతరం శ్రమిస్తూ కోట్ల మందికి ఉపయోగపడగల ఒక విజ్ఞాన కోశాన్ని తయారు చేస్తున్నారు. ఇంతకీ ఏమిటీ విజ్ఞాన కోశం? ఎక్కడ రాస్తున్నారు, ఎవరు రాస్తున్నారు? అదే వికీపీడియా! స్వేచ్ఛా విజ్ఞాన సర్వస్వం.

అసలు వికీపీడియా అంటే ఏమిటంటే...

అప్పుడెప్పుడో 2001 లో మొదలైంది ఈ కథ. లోకం లోని విజ్ఞానాన్నంతటినీ ఒకచోట చేర్చి ప్రజలంతా స్వేచ్ఛగా వాడుకునే వీలు కల్పించాలనే సంకల్పంతో మొదలైంది. ఎక్కడుంది ఈ విజ్ఞానం... భాండాగారాల్లో ఉంది, సైన్సు పేపర్లలో ఉంది, పుస్తకాల్లో ఉంది, వార్తా పత్రికల్లో ఉంది, పెద్దపెద్ద సర్వర్లలో ఉంది, పర్సనల్ కంప్యూటర్లలో ఉంది, మెమరీ చిప్ లలో ఉంది. ఒక్క మాటలో చెప్పాలంటే ఏ కొందరో అందుకోగలిగే తావుల్లో ఉంది. దీన్నంతటినీ ఎలా తెస్తారు? ఎవరు తెస్తారు? ఎక్కడ పెడతారు?

ఎలా తెస్తారు: ఈ సమాచారాన్నంతటినీ చదివి, తేనెటీగలు మకరందాన్ని సేకరించినట్లు వాటిలోని సారాన్ని సేకరించి తెస్తారు.

ఎవరు తెస్తారు: స్వచ్ఛందంగా పనిచేసే చదువరులు, లేఖకులు, మేమూ ఇంకా మీరూ...

ఎక్కడ చేరుస్తారు: ఇదిగో ఈ వికీపీడియాలో.

వికీపీడియా అనే పేరు ఎలా వచ్చిందంటే...

చకచక, పకపక, గబగబ, సలసల, టపటప, తపతప అంటూ జమిలి

వికీపీడియా గురించి మీకు తెలుసా?

10