ఈ పుట అచ్చుదిద్దబడ్డది
5. వికీ కామన్స్: ఉచితంగా ఫొటోలు, ఇతర చిత్రాలు, ఆడియోలు, వీడియోలు లభించే ఖజానా 6. వికీడేటా - ప్రపంచ విజ్ఞానాన్ని ఒక పద్ధతిలో డేటాగా అమర్చే చోటు
సమగ్ర సాహిత్యం అంటే పుస్తకాలూ, పత్రికలూ, వ్యాసాలు, బొమ్మలే కాకుండా పద్యాలూ, వ్యాఖ్యలు, సామెతలు, పదాలు వంటివి కూడా వికీ ప్రపంచంలో వివిధ ప్రాజెక్టుల రూపంలో చోటు చేసుకుంటున్నాయి.
ఇంగ్లీషు వంటి ఇతర భాషలలో ఉండి, ఇంకా తెలుగులోకి రాని మరి కొన్ని ప్రాజెక్టులున్నాయి. వికీవాయేజ్, వికీవార్సిటీ, వికీస్పీసీస్ వంటివి వాటిలో కొన్ని. తెలుగులో ఉన్న ప్రాజెక్టుల విశేషాల గురించి ఇక్కడ తెలుసుకుందాం.
వికీపీడియా గురించి మీకు తెలుసా? 32