6. వ్యాసం సమీక్షకి పంపడం
- కొత్తగా సృష్టించిన వ్యాసాలు కొంత సమయం పాటు వికీపీడియా సబ్జెక్టుల ద్వారా సమీక్షకు నోచుకోవచ్చు. ముఖ్యంగా వికీపీడియాలో చర్చలు, సమీక్షలు సహజం, అందుకే మీ వ్యాసం ఒకసారి సమీక్షకు రావచ్చు. వ్యాసంలో మీ వ్యక్తిగత అభిప్రాయాలను లేదా అవాస్తవాలను పొందుపరచకుండా ఉండాలి.
అనువాద పరికరం
తెలుగు వికీపీడియాలో లక్ష వ్యాసాలుంటే ఇంగ్లీషు వికీపీడియాలో 70 లక్షల వ్యాసాలున్నాయి. ఆ వ్యాసాలలో మనకు నచ్చినదాన్ని తెలుగు లోకి అనువదించడం అనేది వికీపీడియాలో సాధారణంగా అనుసరించే పద్ధతి. ఇందుకోసం వికీపీడియాలో అంతర్గతంగా ఒక అనువాద పరికరాన్ని ఇమిడ్చారు కూడా. యాంత్రికానువాద సౌకర్యం ఉన్న ఉపకరణం ఇది. ఇందులో భాగంగా గూగుల్, యాండెక్స్, మింట్ అనే మూడు అనువాద యంత్రాలున్నాయి. వాటిలో ఏ యంత్రాన్నైనా వాడి అనువాదం చెయ్యవచ్చు. అనువాద పరికరం వాడాలంటే కనీస అనుభవం అంటూ పరిమితి ఏమీ లేదు. వికీపీడియాకు కొత్తవారైనా ఈ పరికరాన్ని వాడొచ్చు. అయితే వికీ పద్ధతుల గురించి తెలుసుకునేందుకు కొన్నాళ్ళు నేరుగా దిద్దుబాట్లు చేస్తే మంచిది.
అనువాద పరికరంతో ఉపయోగాలు: ఈ పరికరం మన పనిని కొంత సులభతరం చేస్తుంది. యంత్రం ద్వారా చేసే ఈ అనువాదం కొంతవరకు బాగానే ఉంటుంది. దాన్ని సరిచేసి ప్రచురించవచ్చు. తొందరగా అయిపోతుంది.. దాని వలన ముఖ్యంగా కింది ఉపయోగాలున్నాయి.
వికీపీడియా గురించి మీకు తెలుసా? 23