ఈ పుట ఆమోదించబడ్డది
"ఖాతా తెరువు:" పుట పైభాగాన వున్నది. దీని సహాయంతో వికీపీడియాలో అన్ని సౌలభ్యాలు అందుబాటులోకి తెచ్చుకోవడమేకాకుండా మీ ఆన్లైన్ పరిచయపత్రం కూడా రూపొందించుకోవచ్చు.
చరిత్ర: ఇది గతంలో చేసిన మార్పులు చేర్పులు మొదలగు వాటి వివరాలు చూపిస్తుంది.
వెతుకు: మీకు కావలసిన వ్యాసం పేరును "వెతుకు" పెట్టెలో సరిగా వ్రాసి దానిని నొక్కినచో ఆ వ్యాసం ఇదివరకే వున్న యడల ఆ వ్యాసం వున్న పుట తెరుచుకుంటుంది. అలా ఆ వ్యాసం లోనికి వెళ్ళవచ్చు.
- ప్రయత్నించండి
- చరిత్రను చూడండి దీనిపై నొక్కితే ఎవరెవరు ఎప్పుడు ఏ సమయాన, ఏ తారీఖున, ఆ వ్వాసంలో ఏ భాగము మార్పులు, చేర్పులు చేశారో, చూడొచ్చు. అంతే కాక గతంలో పోల్చితే మార్పు ఎలా వుండేదో వారి పేరున కూడ చూడవచ్చు. ఒక మార్పును ఎందుకు చేసామో వివరించడం వలన ఇతరులు మార్పులు ఎలా చేయాలో సులభంగా అర్ధం చేసుకోగలరు.
- అనుపమ స్నేహితుడు రాజు కొత్తగా చేరి వికీపీడియాలో వ్రాయడం ప్రారంబించాడు. ఈ విషయంలో అతనికి వికీపీడియా నియమ నిబంధనల గురించి, దీనికి సంబంధించిన విషయాల గురించి సాధారణ సలహాలు, సహాయము కావలసి వున్నది. అవి ఎక్కడ లభించ గలవు?
సరియైన సమాధానం ఎంపిక చేయండి.
□ ఇటీవలి మార్పులు
□ సహాయం
□ వెతుకు