వికీపీడియాను ప్రతిరోజు వాడే లక్షలమందిలో మీరు ఒకరా?
ప్రతిరోజు, ప్రపంచంలోని అన్ని చోట్లనుండి ప్రజలు పాఠశాల ప్రాజెక్టులకు, వ్యాపార ప్రణాళికలకు, వ్యక్తిగత పరిశోధనకు,ప్రణాళికల తయారీకి మరియు ప్రయాణాలకు వికీపీడియాను వాడతారు. కొత్త ఆలోచనల ప్రేరేపణకు మరియు ఊహల మేధోమధనానికి వాళ్లు వాడతారు. దూరపు భూభాగాలను, పురాతనసంస్కృతిని. కళలను, పౌర నాయకులను మరియు ఇటీవలి ఘటనలగురించి తెలుసుకొనడానికి వాళ్లు వాడుతారు.
ఎవరైనా తరువాతి మెట్టుకి వెళ్లి మానవ జ్ఞానాన్ని పోగుచేయటం మరియు పంచుకోవాలనుకుంటే వికీపీడియా స్వయంశిక్షణ అనే ఈచిన్నపుస్తకము ఉపయోగపడుతుంది.
అనుపమ తను వికీపీడియాలో ఏ విధంగా మొదటి దిద్దుబాట్లు చేస్తున్నదో గమనించండి. ఆలా మీరు ముఖ్యమైన ఊహలు, మార్గదర్శకాలు, సమాచారము మరియు ఉపకరణాలు గురించి తెలుసుకొని మీరు వికీపీడియాలో పాలుపంచుకోగలుగుతారు.
మరింత సమాచారానికై బుక్ షెల్ఫ్ జాల స్థలం (http://bookshelf.wikimedia.org) చూడండి.
వికీమీడియా భారతదేశం చాప్టర్ ( నమోదు చేయబడిన పేరు వికీమీడియా చాప్టర్) ఒక స్వలాభాపేక్ష లేని సంస్థ. సంఘాల నమోదు కార్యాలయం, బెంగుళూరు పట్టణ జిల్లా వద్ద 3 జనవరి 2011 రిజిస్టర్ చెయ్యబడింది. భారతీయులకు స్వేచ్ఛా విజ్ఞానాన్ని అందుబాటులో ఉంచడం మరియు అటువంటి సాధనాలకు తోడ్పాడటానికి ప్రజల నైపుణ్యాలను మెరుగు పరచేలా చేయడం ఈ సంస్థ ముఖ్య లక్ష్యం. ఇది వికీపీడియా మరి ఇతర ప్రాజెక్టులు నడిపే వికీమీడియా ఫౌండేషన్ తో కలిసి పనిచేస్తునంది. వికీమీడియా చాప్టర్ కు వికీపీడియా మరియు ఇతర ప్రాజెక్టులలో చేర్చే విషయాలపై ఏ విధమైన నియంత్రణ లేదు.అలాగే ఈ ప్రాజెక్టుల నడిచేసర్వర్లకు పై నేరు ఆధిపత్యం లేదు.
వికీమీడియా ఫౌండేషన్ 149 న్యూ మోంట్గోమరీ స్ట్రీట్, థర్డ్ ఫ్లోర్ శాన్ ఫ్రాన్సిస్కో, సిఎ 94105, యుఎస్ఎ. వికీమీడియా ఫౌండేషన్ ఒక లాభాపేక్ష లేని సంస్థ. ఇది వికీపీడియా మరియు ఇతర ఉచిత విషయాలుగల వెబ్సైట్లను నడుపుతుంది.
వేరేగా పేర్కొనకబోతే అన్ని బొమ్మలు వికీమీడియాకామన్స్ నుండి సిసి-బై-ఎస్ఎ (CC-BY-SA) లేక ఇతర సార్వజనీయమైన లైసెన్సులతో విడుదల చేయబడినవి. పాఠ్యము క్రియేటివ్ కామన్స్ యాట్రిబ్యూషన్-షేర్ ఎలైక్ లైసెన్స్ v.3.0 లేక దాని తరువాత రూపం(Creative Commons Attribution-ShareAlike License v.3.0) (http://en.wikipedia.org/wiki/Wikipedia:CC-BY-SA) విడుదలచెయ్యబడింది. వికీమీడియా ఫౌండేషన్ మరియు ఇలాంటి ఇతర సంస్థల వ్యాపార చిహ్నాలు మరియు గుర్తులు క్రియేటివ్ కామన్స్ లైసెన్స్ కు లోబడవు. వికీమీడియా ఫౌండేషన్, వికీపీడియా, కామన్స్, మీడియావికీ, విక్షనరీ, వికీబుక్స్, వికీసోర్స్, వికీన్యూస్, వికీీఖోట్, వికీవర్శిటీ, వికీస్పిసీస్ మరియు మెటా వికీలు నమోదుచేయబడిన లేక నమోదు చేయబడుతున్న వ్యాపార చిహ్నలు.
మరింత సమాచారానికి, మా వ్యాపార చిహ్నల విధానం (http://wikimediafoundation.org/wiki/Trademark_Policy) చూడండి: ఇతర ప్రశ్నలకు మరియు లైసెన్స్ షరతులకు లేక వ్యాపార చిహ్నల విధానానికి వికీమీడియా ఫౌండేషన్ న్యాయశాఖకుఈమెయిల్ (legal@wikimedia.org ) చేయండి. వికీమీడియా భారతదేశం గురించి మరియు ఈ తెలుగు పుస్తకంగురించి సూచనలు చేయదలిస్తే వికీమీడియా భారతదేశానికి ఈ మెయిల్ (chapter@wikimedia.in ) చేయండి.