Jump to content

పుట:Vyasa Manjari (Telugu) By C. Rama Linga Reddy, 1939.pdf/41

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

అధ్యక్షుని వచనము ముచే నిగ్రహింపఁబడిన భావప్రకటనమును గలవారు. ఈ లక్షణము నన్నయ పాత్రలయం దున్నంత సాంద్రముగ నితరకవుల పాత్రలయందు లేదనినానమ్మకము. అట్లనుటచే నాయితరులకు లఘు త్వారోపణము సేతకాదు. పాత్రముల ప్రవృత్తి ననుసరించి భావప్రకటనము మిత ముగాఁ జేయవలయునో, యడ్డు హద్దు పద్దు లేని యనర్గళధారగాఁ జేయ వలయునో నిర్ణయింపవలయు. జనమేజయుని గూర్చిన యొకానొక సంభాషణములో "మితహితసత్యవాక్య" యని నన్నయ వ్రాసి యున్నాఁడు. మితవాక్యుఁడుగా నుండుట గొప్పతనముగల వానిలక్షణ మని నిరూపించుట కితరసాక్ష్యములును నున్నవి. తనపాలికి వచ్చిన స్త్రీ పాత్రములు ములు సయితము గంభీరవర్తనములు. శకుంతల, దమయంతి మొదలగు మహాత్మలగరువతనమునకు, నన్నయ్య యొక్క మిత భావ ప్రకటనలకు నెంత చక్కఁగ నన్వయము కుదిరెనో రసికు లాదరింతురు గాక. నన్నయ్య తిక్కన్న లరీతులఁ బరామర్శించుట కనుకూలము లైనఘట్టములు రెండు. ఒకటి, ఆదిపర్వములోని కణికుని రాజనీతియు, ఉద్యోగపర్వములోని విదురనీతియు. నాకుంజూడఁ దిక్కన యీసంద' ర్భమున నన్నయ్యను నాదర్శముగా నిడికొని వ్రాసియుండునని తోఁచును. ఈ రెండుమట్టముల యసామాన్యలక్షణము లేవనఁగాఁ, గంద పద్యము లెక్కువ. నీతికిఁ గంద మనుపానము గాఁబోలు ! సొగసైన సామాన్యోపమానములు మెండు. ఉపన్యాన విస్తరభీతిచే నాపద్యముల నిటఁ జేర్పలేదు. రెండవది, ద్రౌపది తాఁబడిన భంగపాటు కృష్ణునితో జెప్పి మొఱపెట్టికొనుట :— "వ. నియంతఃకరణ ప్రవృత్తి కగోచరం బెద్దియు లేదయినను నాపడిన పరాభ వం బెఱింగిం చెద. CC-0. Jangamwadi Math Collection. Digitized by eGangotri